Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఫిక్స్!

    అడివి శేష్-వామికా గబ్బి జంటగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘G2’. ఈ సినిమా మే1 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

     

  • ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్.. నవ్వులే నవ్వులు!

    నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా దర్శకుడు మురళీ మనోహర్‌ తెరకెక్కించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగిబాబు రాజ్‌కుమార్‌ కసిరెడ్డి లాంటి కమెడియన్లు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ అద్యంతం నవ్వులు పూయించేలా ఉంది.

  • ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్

    హైదరాబాద్‌ సిటీ అడ్డగుట్టలోని ఫిష్‌ వెంకట్‌ నివాసంలో ఆయన కుటుంబసభ్యులను నటుడు సోనూసూద్‌ పరామర్శించారు. ఇటీవల ఫిష్‌ వెంకట్‌ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూసూద్‌.. ఆయన కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు.

  • ‘మహావతార్‌: నరసింహ’.. సక్సెస్‌ ట్రైలర్‌ చూశారా?

    ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది ‘మహావతార్‌: నరసింహ’. హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా దర్శకుడు అశ్విన్‌కుమార్‌ దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులోని విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

  • కింగ్ నాగార్జునపై సూపర్ స్టార్ ప్రశంసలు!

    ‘కూలీ’ కథ చెప్పగానే అందులో సైమన్‌ పాత్ర తాను చేయాలన్నంత ఆసక్తి కలిగిందని దాన్ని.. నాగార్జున లాంటి నటుడు పోషించి అదరగొట్టారని సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు. ఆయన కీలక పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రజనీకాంత్‌ స్పెషల్‌ వీడియోతో తెలుగు వారిని పలకరించారు.

  • సినీ కెరీర్‌పై ‘సైయారా’ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!

    ‘సైయారా’ మూవీ డైరెక్టర్ మోహిత్‌ సూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘17ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి సెట్‌లో అడుగుపెట్టాను. ఐదేళ్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి 22 ఏళ్ల వయసులో దర్శకత్వం ప్రారంభించాను. ఇప్పుడు నా వయసు 44 ఏళ్లు. సగం జీవితం సినిమా సెట్‌లలోనే గడిచిపోయింది. ఆ వాతావరణంలోనే నేను నాకు నచ్చినట్లు ఉండగలను. సెట్‌లో ఉన్నంత సౌకర్యంగా మరెక్కడా ఉండలేను’’ అని తెలిపారు.

  • థియేటర్‌లో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు!

    అస్సాం గువాహటిలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్‌ సినిమా హాల్‌లో పైకప్పు కొంతభాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఆదివారం రాత్రి ‘మహావతార్‌ నరసింహ’ సినిమా ప్రదర్శన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే థియేటర్‌లోని వారందరినీ బయటకు తరలించారు. ఈ మేరకు సినిమా థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

  • ‘సైయారా’ టైటిల్ ట్రాక్‌.. 200 మిలియన్స్!

    దర్శకుడు మోహిత్‌ సూరి తెరకెక్కించని బాలీవుడ్ చిత్రం ‘సైయారా’.. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీని టైటిల్ ట్రాక్‌ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

  • మాళవిక బర్త్‌డే.. ‘రాజాసాబ్’ టీమ్ స్పెషల్ విషెస్

    నేడు హీరోయిన్ మాళవిక మోహనన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘రాజాసాబ్’ టీమ్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

  • నేషనల్‌ అవార్డు రాకపోవడంపై.. పృథ్వీరాజ్‌ రియాక్షన్ ఇదే!

    నేషనల్‌ అవార్డు దక్కకపోవడంపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించారు. ‘‘ఆడుజీవితం’ సినిమా విజయవంతమవ్వాలని కోరుకున్నా. ప్రేక్షకులకు నా పెర్ఫామెన్స్‌ నచ్చాలని ఆశించా. ముఖ్యంగా నజీబ్‌ మహమ్మద్‌ గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో పని చేశా. ఇలా నేను అనుకున్నవి జరిగాయి. అంతకుమించి ఆ సినిమా విషయంలో నేను ఆశించేదేం లేదు. ఒకవేళ అవార్డు వచ్చి ఉంటే హ్యాపీ’’ అని పేర్కొన్నారు.