హీరో శివ కార్తికేయన్ ఓ కార్యక్రమంలో మూవీ సీక్వెల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు సీక్వెల్స్ అంటే భయం. ఎందుకంటే.. మొదట వచ్చిన విజయాన్ని తర్వాత వచ్చే సీక్వెల్ ఎక్కడ పాడు చేస్తుందోనని నా సందేహం. అందుకే నాకు ఈ సీక్వెల్స్ అంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ ‘మహావీరన్’కు సీక్వెల్ చేయాలని మాత్రం ఉంది. ఎందుకంటే అదో యూనిక్ మూవీ’’ అని తెలిపాడు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ధడక్-2’
సిద్ధార్థ్ చతుర్వేది, త్రిప్తి డిమ్రీ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ ‘ధడక్-2’ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల కలెక్షన్ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం రూ.11.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ‘ధడక్ 2’ ఓ ప్రేమకథా చిత్రం.
-
ఇన్నేళ్ల నా కెరీర్‌లో మొదటిసారి..!: నాగార్జున
సినిమా సెట్స్‌కు వెళ్లాక బోర్ కొట్టకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక పాత్రలు చేయాలని హీరో నాగార్జున అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కూలీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడారు.
-
‘కూలీ’ ప్రీ-రిలీజ్ వేడుకలో నవ్వులు పంచిన శ్రుతిహాసన్
రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘కూలీ’ మూవీలో ప్రీతి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు ధన్యవాదాలని నటి శ్రుతిహాసన్ అన్నారు. నాగార్జున, సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఇలాంటి పెద్ద సినిమాలో భాగస్వామ్యం కావడం ఎంతో స్పెషల్ అని శ్రుతి అన్నారు. రజనీకాంత్‌తో నటించే అవకాశం తనకు వస్తుందని ఊహించలేదన్నారు.
-
‘జటాధర’ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈమూవీ టీజర్ ఈనెల 8న రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
-
‘కింగ్‌డమ్’.. 4 రోజుల కలెక్షన్స్ ఇవే!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.ఈ సినిమా భారీ అంచనాల మధ్య జులై 31న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తాజాగా ఈమూవీ 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.82 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
-
‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా!
కిరీటి, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘జూనియర్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో వైరల్ వయ్యారి పాట ఎంత వైరలైందో తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్‌కు కిరీటి, శ్రీలీల ఇద్దరూ పోటాపోటీగా స్టెప్స్ వేసి అలరించారు. ఇప్పుడీ ‘వైరల్ వయ్యారి’ పాట ఫుల్ వీడియోను టీమ్ విడుదల చేసింది.
-
ప్రముఖ దక్షిణ కొరియా నటుడు మృతి
ప్రముఖ దక్షిణ కొరియా నటుడు సాంగ్ యంగ్-క్యూ (55) ఈ రోజు (ఆగస్టు 4న) మరణించారు. తన కారులోనే శవమై కనిపించారు. యోంగిన్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన మరణం పట్ల అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ‘బిగ్ బెట్’, ‘హ్వారాంగ్’ వంటి ప్రసిద్ధ K-డ్రామాలలో నటించిన సాంగ్ మంచి పాపులారిటీ సాధించారు.
-
ముగిసిన నిర్మాతల మండలి సమావేశం
చిత్ర పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి మీటింగ్ ముగిసింది. వేతనాలను 30% పెంచడానికి నిర్మాతలు అంగీకరించలేదు. లేబర్ కమిషన్ పరిధిలో ఉన్న ఈ విషయంలో సమ్మె ఎలా ప్రకటిస్తారనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని నిర్మాతలు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు లేబర్ కమిషనర్‌ను కలవనున్నారు.
-
నాగార్జున అలా చేస్తాడని ఊహించలేదు: రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో నటించారు. ఈ క్రమంలో నాగార్జునపై రజనీ ప్రశంసలు కురిపించారు. ‘‘విలన్‌గా నాగార్జున చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఆయనలా నేను కూడా చేయలేను. కింగ్‌ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని అన్నారు.