Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన

    తనకు తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ కో-ఛైర్మన్‌ బాధ్యతను అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి హీరో రామ్‌‌చరణ్ భార్య ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ క్రీడా రంగ అభివృద్ధికి ఉద్దేశించిన ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025’ లో భాగంగా ఈ నియామకం జరిగింది. ఈ నియామకం తనకెంతో గౌరవాన్నిచ్చిందని, గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం పట్ల సంతోషంగా ఉందని ఉపాసన X (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

  • ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు

    HYD: ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఫెడరేషన్ డిమాండ్స్‌పై ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ కంటే వీరికి వేతనాలు ఎక్కువ. బంద్ చేసే హక్కు అందరికీ ఉంది. వేతనాల పర్సంటేజ్‌పై చర్చ కొనసాగుతోంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

  • ‘కూలీ’ 1421 నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ ఇదే

    హీరో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపించిన 1421 నంబర్ వెనుక ఓ భావోద్వేగ కథ ఉంది. ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి సాధారణ బస్ కండక్టర్‌గా పనిచేసేవారని, ఆయన కూలీ బ్యాడ్జ్ నంబర్ 1421 అని తెలిపారు. తండ్రికి గుర్తుగానే ఈ నంబర్‌ను సినిమాలో ఉపయోగించినట్లు లోకేష్ పేర్కొన్నారు.

  • ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ట్విట్టర్ వార్

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ‘వార్2’. ఆగస్టు 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. సినిమాకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌ల విషయంలో స్టార్‌లు ఇద్దరూ వరుస ట్వీట్స్ చేసుకున్నారు. ‘వార్2’కు #HrithikvsNTR అని ఉండాలని హృతిక్ రోషన్ ప్రతిపాదించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం #NTRvsHrithik ఉండాలని పట్టుబట్టారు.

  • ‘ఏజీటీ సీజన్‌ 20’లో ‘పుష్ప’ సాంగ్‌

    ‘అమెరికన్స్‌ గాట్‌ టాలెంట్‌’ షోలో భారత్‌ నుంచి ‘బీ యూనిక్‌ క్ర్యూ’ బృందం ‘పుష్ప’ మూవీ మ్యూజిక్‌కు తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చారు. వాళ్లు చేసిన మూమెంట్స్‌ అక్కడున్న జడ్జిలనే కాదు, ఆడిటోరియంలో షో చూస్తున్న వాళ్లను మెస్మరైజ్‌ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ‘పుష్ప’ టీమ్‌, అల్లు అర్జున్‌ పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.

  • ‘మాస్ జాతర’ నుంచి ‘ఓలే ఓలే’ సాంగ్ ప్రొమో

    రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను బోగావరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఓలే సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో నటీనటులు ఇద్దరూ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఫుల్ సాంగ్‌ను రేపు సాయంత్రం 4.06 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే, ఈ మూవీ ఈ నెలలోనే 27 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • ‘శ్రీ చిదంబరం’ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

    వినయ్‌ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీ చిదంబరం’. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను హీరో కార్తికేయ విడుదల చేశారు. కళ్లద్దాల వెనకున్న  ‘చిదబరం’ కథ అంటూ ఈ గ్లింప్స్‌ను టీమ్‌ పంచుకుంది. త్వరలోనే ఇందులోని నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

  • రూ.100కోట్ల క్లబ్‌లోకి ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’

    ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతున్న యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మేరకు మూవీ కలెక్షన్స్‌పై నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఇండియాలో ఈ చిత్రం రూ.105 కోట్లు వసూళ్లు చేసినట్లు వెల్లడించింది.

  • ‘సారే జహా సే అచ్ఛా’ ట్రైలర్‌ రిలీజ్‌..

    ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సారే జహా సే అచ్ఛా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఆగస్టు 13 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భారత అంతరిక్ష పరిశోధన రంగంలోని కీలక ఘట్టాలను, గొప్ప వ్యక్తులను వెలుగులోకి తీసుకురానుంది.

     

  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన షూటింగ్‌లు

    HYD : తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సోమవారం నుంచి సమ్మెకు దిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోను జరుగుతున్న అన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ బంద్ కారణంగా.. అల్లరి నరేష్‌ సినిమా ఓపెనింగ్ వాయిదా పడింది. షూటింగ్‌లో కీలక పాత్ర పోషించే కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది.