Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కెరీర్‌పై అజిత్‌ ఎమోషనల్‌ నోట్‌

    ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి స్టార్‌గా ఎదిగారు అజిత్ కుమార్. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లు అయిన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన జర్నీ సులభంగా సాగలేదని ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎప్పుడూ ఆగిపోకుండా ముందుకు సాగానని.. పట్టుదలే తన బలమని తెలిపారు. అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.

  • కుమారుడి ఫొటోలు పంచుకున్న కిరణ్‌ అబ్బవరం.. పేరు ఇదే!


    టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తొలిసారిగా తన కుమారుడి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడికి ‘హను’ అనే పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో నామకరణం చేయడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిమానులు హనుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

     

  • నేడు నిర్మాతల మండలి అత్యవసర సమావేశం

    HYD : నిర్మాతల మండలి సోమవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేటి నుంచి సమ్మెకు దిగుతామని, తమకు వేతనాలపై 30 శాతం పెంచాలని డిమాండ్ చేయడంపై నిర్మాతల మండలి సమావేశమై చర్చించనుంది.

  • నా పాత్ర గురించి నాన్నకు కూడా తెలియదు: శ్రుతి హాసన్‌

    రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు నటి శ్రుతి హాసన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన ఇంట్లో సినిమాల గురించి ఎలాంటి ప్రస్తావన రాదని చెప్పారు. ‘కూలీ’ సినిమాలో ఉన్న స్టార్‌ హీరోలందరితో తనకు సీన్స్‌ ఉన్నాయని వెల్లడించారు. తన పాత్ర గురించి తన తండ్రి కమల్ హాసన్‌కు కూడా తెలియదన్నారు.

  • క్లైమాక్స్‌ మార్చడంతో కలతకు గురయ్యా: ధనుష్‌

    ‘రాంఝనా’ సినిమా క్లైమాక్స్‌ను ఏఐతో మార్చడంపై నటుడు ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సినిమా ఆత్మను కోల్పోయేలా చేస్తుందని, తాను అభ్యంతరం చెప్పినా సంబంధిత పార్టీలు ముందుకెళ్లాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 12 ఏళ్లక్రితం తాను కమిట్‌ అయిన సినిమా ఇదికాదని, కంటెంట్‌ను మార్చడానికి ఏఐని వాడడం కళ, కళాకారులకు ప్రమాదకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి నివారించేందుకు కఠిన నిబంధనలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

  • పాక్‌ క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌: తమన్నా రియాక్షన్‌ ఎంటంటే?

    సినీ నటి తమన్నా, పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలను ఖండించారు. ఓ జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవంలో మాత్రమే తాము కలిశామని ఆమె స్పష్టం చేశారు. అలాగే, క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న రిలేషన్‌షిప్‌పై వచ్చిన రూమర్స్‌పైనా ఆమె స్పందిస్తూ కేవలం ఒక్కసారి కలిసినందుకే ఇలాంటి ప్రచారం జరగడం బాధ కలిగించిందని తమన్నా అన్నారు.

     

  • మరోసారి విజయ్‌కి జోడీగా రష్మిక!

    టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండా-రష్మిక కాంబినేషన్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ జోడీ మరోసారి కలిసి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించే VD14లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తారని వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో ఫ్యాన్స్‌‌లో మరింత జోష్ పెంచింది.

     

     

  • రజినీకాంత్ ‘కూలీ’.. అమిర్ ఖాన్ మేకోవర్ వీడియో చూశారా?

    కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం ‘కూలీ’. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమిర్ ఖాన్‌ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్‌ కోసం అమిర్ ఖాన్‌ మేకోవర్‌ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు.

  • పాక్ క్రికెటర్‌తో పెళ్లి.. తమన్నా రియాక్షనిదే

    మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా పాక్ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్‌తో పెళ్లి అంటూ వచ్చిన రూమర్స్‌పై స్పందించారు. ఓ ఈవెంట్‌లో అబ్దుల్ రజాక్‌తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని ఆమె  పేర్కొంది. తనకు కేవలం అబ్దుల్ రజాక్‌తో మాత్రమే కాకుండా.. విరాట్ కోహ్లీతోనూ ముడిపెట్టారని వివరించింది. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా బాధేస్తుందని తమన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

     

  • సీఎం రేవంత్‌ను కలిసిన చిరంజీవి

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి జూబ్లీహిల్స్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంను చిరు ఎందుకు కలిశారనేది తెలియాల్సి ఉంది.