Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్!

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రేపట్నుంచి షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. తమ వేతనాలు 30% పెంచాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ చేసింది. పెరిగిన వేతనాలను కూడా రోజువారీగా చెల్లించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను అంగీకరించే నిర్మాతల చిత్రాల్లో మాత్రమే పనిచేస్తామని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమ్మె కారణంగా పలు చిత్రాల షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

  • రామ్‌చరణ్‌తో సినిమాపై స్పందించిన ‘కింగ్డమ్’ డైరెక్ట‌ర్‌

    కింగ్డ‌మ్ మూవీతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. అయితే రామ్‌చరణ్‌తో సినిమా ఆగిపోవడానికి కారణమేంటో చెప్పారు గౌత‌మ్‌. ‘‘సినిమాకు సంబంధించి ఓ పాయింట్‌ను రామ్‌చరణ్‌కు చెప్పా. ఆయనకు నచ్చింది. ఆ క‌థ ఆయ‌న‌కు సెట్‌ కాదేమో అని తర్వాత నాకే అనిపించింది. అదే విషయాన్ని చ‌ర‌ణ్‌కు తెలియజేసి, మరో కథతో వస్తానని చెప్పా’’ అని తెలిపారు.

     

     

  • దూసుకుపోతున్న కింగ్డమ్.. 3 రోజుల్లో రూ. 67 కోట్లు!

    ‘‘కింగ్డమ్’’ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మొదటి రోజునే రూ. 39 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లు రాబట్టింది. వీకెండ్‌లో కలెక్షన్‌లు మరింత పెరిగాయి. ఈరోజు ఆదివారం కావడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • ఈ సినిమాని పవన్‌ చూడాలని కోరుకుంటున్నా: అల్లు అరవింద్‌

    ‘మహావతార్‌ నరసింహ’ చిత్రాన్ని పవన్ కల్యాణ్ చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్‌ మూవీని కన్నడ దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ రూపొందించారు. ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్‌ విడుదల చేశారు. కాగా జులై 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా రూ.79+ కోట్లు (గ్రాస్‌) కలెక్షన్స్‌ చేసింది.

  • ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ మూవీ

    ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు రొమాంటిక్‌ కామెడీ మూవీ సిద్ధమైంది. థియేటర్లలో తమిళ్‌లో విడుదలకాగా.. ఓటీటీలో తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో సందడి చేయనుంది. ఆ సినిమానే ‘ఓహో ఎంథన్‌ బేబీ’. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తొలి ప్రయత్నంలోనే రుద్ర నటుడిగా ఆకట్టుకున్నాడు. అతడి సరసన హీరోయిన్‌ మిథిలా పాల్కర్‌ నటించింది.

  • రాముడి పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో?!

    ‘‘ఆదిపురుష్’’ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రభాస్ తర్వాత మరో టాలీవుడ్ స్టార్ హీరో రాముడి గెటప్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆ హీరోకు సంబంధించిన తదుపరి మూవీలో రాముడి పాత్రలో నటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

     

  • ‘నరేష్-65’ సినిమాకు ముహూర్తం ఫిక్స్

    అల్లరి నరేష్ హీరోగా 65వ చిత్రానికి పూజ టైంని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆగస్టు 4వ తేదీన ఉదయం 8:30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘పురాణాలు, మాయాజాలం పిచ్చి కామెడీ కోసం సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.

  • మహేశ్ బాబు లుక్ వైరల్.. వీడియో

    సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘‘ఎస్ఎస్ఎంబీ 29’’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో సూప‌ర్ స్టార్ త‌న భార్య నమ్రతా శిరోద్కర్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైనట్లు తెలుస్తోంది. వైర‌ల‌వుతున్న వీడియోలో మ‌హేశ్‌, న‌మ్ర‌తా వైట్ అంట్ వైట్‌ దుస్తుల్లో క‌నిపించారు. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • అడ్వాన్స్ బుకింగ్స్‌లో మహేశ్‌బాబు ‘అతడు’ రికార్డు

    మహేశ్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అత‌డు’ ఆగస్టు 9న రీ-రిలీజ్ కాబోతోంది. తాజాగా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రీ-రిలీజ్ ఇంకా వారం ఉండ‌గానే బుకింగ్స్‌లో రూ.కోటి మార్క్‌ను అందుకుంది. దీంతో రీ-రిలీజ్‌లో ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ముర‌ళి మోహ‌న్ నిర్మాతగా వ్య‌వ‌హారించాడు.

  • ఫ్రెండ్‌షిప్ డే.. RGV వరుస ట్వీట్లు

    ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వరుస ట్వీట్స్ చేశారు. ‘స్నేహితులు కాకుండా మిమ్మల్ని శత్రువులు వెన్నుపోటు పొడవలేరు. స్నేహితుడికి సహాయం చేయడం తప్పు కాదు.. కానీ అతను మళ్లీ సాయం కోరినప్పుడు చేయకపోతే మీరు శత్రువు అవుతావు. మీ రహస్యాలన్నింటినీ బయటపెట్టే వారు ఎల్లప్పుడూ మీకు అత్యంత సన్నిహితులవుతారు. స్నేహితులు మిమ్మల్ని ఆత్మసంతృప్తి పరుస్తారు. శత్రువులు మిమ్మల్ని అలర్ట్‌గా ఉంచుతారు’’ అని పేర్కొన్నారు.