Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న ‘మహావతార్ నరసింహ’

    హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్‌ వద్ద గర్జిస్తోంది. ఈ యానిమేటెడ్ మూవీ రూ.79 కోట్ల వసూళ్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.

  • ఫ్రెండ్‌షిప్‌ డే.. ‘బాహుబలి’ టీమ్ స్పెషల్ వీడియో

    ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ‘బాహుబలి’ టీమ్‌ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. తెర వెనుక జరిగిన ఆసక్తికర సంభాషణల వీడియో పంచుకుంది. ఇందులో ప్రభాస్‌ ‘ఎంత పనిచేశావు దేవసేన’ అంటూ రానాతో ముచ్చటిస్తూ కనిపించారు. మధ్యలో అనుష్క వచ్చి మాట్లాడటంతో నవ్వులు వెల్లి వెరిశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

  • ‘కింగ్డమ్’ మూడు రోజుల వసూళ్లు ఇలా..

    విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘కింగ్డమ్’కు మంచి వసూళ్లు సాధిస్తోంది. నైజాంలో ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.7.85 కోట్ల షేర్(జీఎస్టీ కాకుండా) వసూలు చేసినట్లు పీఆర్ లెక్కలు చెబుతున్నాయి. మూడో రోజున రూ.1.8 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే, ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.

  • రేపు ‘మాస్ జాతర’ రెండో పాట ప్రొమో

    రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. ఈ మూవీ నుంచి రేపు ఉదయం 11.08 గంటలకు రెండో పాట ప్రొమోను విడుదల చేయనున్నారు.

  • వారిని మాత్రం నమ్మకూడదు: రజనీకాంత్

    ‘కూలీ’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నటుడు రజనీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘సత్యరాజ్‌కు నాకు భావజాలం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఆయ‌న త‌న మ‌న‌సులోని ప్ర‌తి విష‌యాన్ని బ‌య‌ట‌కు మాట్లాడతారు. అలాంటి వారిని న‌మ్మొచ్చు. కాని మ‌న‌సులో పెట్టుకునేవారిని న‌మ్మ‌డం డేంజ‌ర్.  మీకు ఎంత డబ్బు, కీర్తి వచ్చినా.. ఇంట్లో ప్రశాంతత, బయట రెస్పెక్ట్ లేకపోతే ఏది విలువైందికాదు’’ అని చెప్పుకొచ్చారు.

  • విజ‌య్ దేవ‌ర‌కొండ లైన‌ప్ మాములుగా లేదుగా..

    విజయ్ దేవ‌ర‌కొండ చాలా రోజుల త‌ర్వాత ‘కింగ్డమ్‌‌’తో మంచి హిట్ కొట్టాడు. కాగా, విజయ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీస్‌తో క‌లిసి రాయలసీమ నేపథ్యంలో ఓ చిత్రం.. వికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌పై ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయ‌నున్నాడు. సుకుమార్, సందీప్‌రెడ్డి వంగాతో సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • అతడు అన్న మాటలకు బాధపడ్డా: రజనీకాంత్

    నటుడు రజనీకాంత్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకానొక సమయంలో కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని తెలిపారు. ఒక వ్యక్తి తన లగేజ్‌ను టెంపో వరకు తీసుకువెళ్ళమని అడిగాడని, తర్వాత అతడు తన కాలేజీ స్నేహితుడని గుర్తించానని చెప్పారు. లగేజ్ మోసినందుకు రూ.2 ఇచ్చి, గతంలో రజనీకాంత్‌కు ఉన్న అహంకారాన్ని గురించి విమర్శించాడని, ఆ మాటలకు తనకు కన్నీళ్లు ఆగలేదని రజనీ బాధపడ్డారు.

  • రామ్‌ చరణ్‌తో సినిమా అందుకే ఆగిపోయింది: డైరెక్టర్

    రామ్‌ చరణ్‌తో సినిమాకు స్క్రిప్ట్ అనుకున్నంత కరెక్ట్‌గా రాలేదని, అందుకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పిన ఐడియా చరణ్‌కు నచ్చింది. కాకపోతే దాని స్క్రిప్ట్‌ ఆయన ఆశించినట్లుగా రాలేదు. అందుకే ఏదో ఒకటి తీయాలని కాకుండా బలమైన కథతో మళ్లీ వస్తానని చెప్పా’’ అని పేర్కొన్నారు.

  • రజనీకాంత్ కాళ్లు మొక్కిన అమీర్ ఖాన్

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీ నుంచి ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని చెన్నై వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.  ఈ ఈవెంట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఫంక్షన్‌కు ఎంటర్ అవ్వగానే రజినీకాంత్ కాంత్ వద్దకు వచ్చి కాళ్లుకు మొక్కారు.  దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

  • గ్రాండ్‌ ఫాదర్‌ టైటిల్‌ లుక్‌ రిలీజ్

    కుట్టి స్టోరీస్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎం.ఎస్‌.భాస్కర్, ప్రాంక్‌స్టార్‌ రాహుల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘గ్రాండ్‌ ఫాదర్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం కామెడీ విత్‌ హారర్‌ ఫ్యాంటసీగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం  విడుదల చేసింది.