Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బొజ్జ గణపయ్యను ముస్తాబు చేసిన నటి మేకింగ్‌ వీడియో వైరల్‌

    వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత విగ్రహాలపై అవగాహన పెంచేందుకు సినీ నటి వితిక స్వయంగా మట్టి గణపతిని తయారు చేశారు. “మట్టి గణపతే మహా గణపతి” అనే నినాదాన్ని అనుసరిస్తూ ఆమె గణేశుడి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అభిమానులు, పర్యావరణ ప్రేమికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

     

     

  • వివాదాస్పద ఆడియో.. స్టార్ హీరోకి క్షమాపణలు

    కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువ నటుడు మను క్షమాపణలు కోరాడు. ఇటీవల మనుకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అవ్వగా, అందులో శివరాజ్ కుమార్, దర్శన్, ధృవ్ సర్జా త్వరలో చనిపోతారని వ్యాఖ్యానించాడు. దీంతో కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహంతో మనుపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అతను శివరాజ్ కుమార్‌ను కలిసి క్షమాపణలు చెప్పాడు.

  • రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌

    రష్మిక, దీక్షిత్‌శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలైంది. ‘మనసా.. తెలుసా.. ఏం జరుగుతోంది..’అంటూ సాగే సోల్‌ఫుల్‌ లిరిక్స్‌ను రాకేందు మౌళి రాయగా.. చిన్మయి, హేషమ్‌ అబ్దుల్‌ అలపించారు.

     

  • నాపై కోపం ఉంటే అలా రాయండి.. కానీ: నారా రోహిత్‌

    నారా రోహిత్ న్యూ మూవీ ‘సుందరకాండ’ ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రోహిత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మీద కోపం ఉంటే సినిమా నచ్చలేదని రాయండి ఫర్వాలేదు. కాకపోతే నిజంగా థియేటర్‌కు వెళ్లి చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే మీకు నచ్చింది రాయండి. ఏది రాసినా సినిమా చూశాకే రాయండి. అదొక్కటే నేను అడుగుతున్నాను’’అని రోహిత్‌ అన్నారు.

  • 105కేజీలు పెరిగాను.. ఆ ట్రోల్స్‌ ఎంతో బాధించాయి: సమీరా రెడ్డి

    సినీ నటి సమీరా రెడ్డి తాను బరువు పెరిగిన తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత 105 కేజీలకు బరువు పెరిగానని, ఆ సమయంలో ఎదురైన ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధించి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించిన తాను, ఈ మార్పును తట్టుకోలేకపోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిట్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

  • కోహ్లీ లైక్‌.. ఎట్టకేలకు స్పందించిన అవ్‌నీత్‌కౌర్‌

    ఇటీవల భారత క్రికెటర్కో హ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకోకుండా బాలీవుడ్ నటి అవ్‌నీత్‌కౌర్ పోస్ట్‌ను లైక్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా దీనిపై అవ్‌నీత్‌కౌర్ స్పందించారు. ఇది ఒక పొరపాటున జరిగిన సంఘటన అయినప్పటికీ, నెటిజన్ల నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ ఎప్పటికీ కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ఆమెకు ఎలాంటి మెసేజ్ రాలేదని కూడా ఆమె వెల్లడించారు.

  • ‘కూలీ’.. రూ.500 కోట్లు దాటేసింది

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లకుపైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. తెలుగులో ఈ మూవీ రూ.62.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయన్నాయి.

  • నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌..?

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో డైరెక్టర్ నాగ్‌అశ్విన్ సినిమా చేయబోతున్నట్లు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మాత్రం దీని గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్‌ చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో ‘కల్కి’ సీక్వెల్‌ను పక్కనపెట్టి.. మరో కథని బయటికి తీశారని ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే నాగ్‌ అశ్విన్‌ వరుసగా కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో సినిమాలు చేసినట్టు అవుతుంది.

  • అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేస్తా: శ్రీలీల

    హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డే అండ్ నైట్ షిఫ్టులు చేస్తానని చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు.

  • ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్‌.. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ

    ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన కొత్త సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు ‘ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌’ను ప్రారంభించింది. ప్రత్యేక రాయితీలు, సేల్ ఈవెంట్లకు ముందస్తుగా యాక్సెస్, ప్రియారిటీ కస్టమర్‌ సపోర్ట్‌ వంటివి ఈ ప్యాక్‌తో లభించనున్నాయి. దీనిలో భాగంగా ఏడాది పాటు యూట్యూట్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ వార్షిక ఫీజు రూ.1,499గా కంపెనీ నిర్ణయించగా.. పరిమితకాల ఆఫర్‌లో రూ.990కే అందుబాటులో ఉంది.