ఎలిమెంటల్ మీడియా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్‌నర్లుగా బిగ్‌టీవీ ‘ద బిగ్ ఫోక్ నైట్-2025 కార్యక్రమం’ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఎల్బీ స్టేడియంలో జరగనుంది. అయితే KINGDOM20 కూపన్ కోడ్ ఉపయోగించి.. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెల 10 వరకే. కాగా, విజయ్ దేవరకొండ నటించిన‘కింగ్డమ్’ మూవీ హిట్ టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
అజిత్ ‘AK64’పై ఇంట్రెస్టింగ్ బజ్!
హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన 64వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించనున్న ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తోంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈనెలలో ఉండనుందని సమాచారం. అలాగే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారట. ‘AK64’ను 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
-
ట్రెండీ వేర్‌లో అందాల జాన్వీ!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ అందాల ఆరబోతతో మరోసారి గ్లామర్ ఫోటో షూట్‌లో మెరిసింది. కుర్రకారు మనసు దోచేలా ఉన్న ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది.
-
షర్ట్ విప్పేసి ఈవెంట్‌కు వచ్చిన స్టార్ హీరో
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ఆమిర్ షర్ట్ లేకుండా బనియన్‌పై వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
పవన్ కోసం వెనక్కి తగ్గిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘అఖండ-2’. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ మూవీ వాయిదా పడినట్లు నెట్టింట వార్తలు వైరలవుతున్నాయి. ఈ డేట్‌కే పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ కూడా రిలీజ్ ఉండటంతో.. రెండు ఒకేసారి రిలీజ్ చేయడం ఎందుకని మేకర్స్ మాట్లాడుకున్నారట. దీంతో ‘అఖండ-2’ను వాయిదా చేసేందుకు సిద్ధమైయ్యారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
-
గ్లామర్‌తో ఆకట్టుకుంటోన్న కృతి శెట్టి
హీరోయిన్ కృతిశెట్టి బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఉన్న తన హాట్ ఫొటో ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసింది.
-
ప్రముఖ కమెడియన్ కన్నుమూత
తమిళ నటుడు, కమెడియన్ మదన్ బాబు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని మదన్ బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరు, జెమిని, రన్, జోడీ, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. మదన్ మృతి తమిళ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
-
‘బేబీ’ మూవీకి అవార్డులు.. టీమ్ స్పందన ఇదే!
‘బేబీ’ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నలకు హీరోహీరోయిన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవితోపాటు దర్శక నిర్మాతలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఆ వీడియో మీ కోసం.
-
‘బేబీ’కి నేషనల్ అవార్డు.. టీమ్ సెలబ్రేషన్స్!
‘బేబీ’ చిత్రానికి రెండు జాతీయఅవార్డులు రావడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తంచేసింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా దర్శకుడు సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా పీవీఎన్ఎస్ రోహిత్ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. హీరోహీరోయిన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవితోపాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.(వీడియో)
-
‘SSMB29’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ‘SSMB29’పై ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ హైదరాబాద్, ఓడిశాలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్ కోసం జక్కన్న రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ రెండో వారంలో టాంజానియాలో ఈ షూట్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఈ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.