సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘కూలీ’ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లోకేశ్ తనదైన శైలిలో ‘కూలీ’ ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘వైరల్ వయ్యారి’ వచ్చేస్తోంది.. ప్రోమో రిలీజ్!
గాలి కిరీటి-శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘జూనియర్’. రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న విడుదలైంది. ఈ మూవీలోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ఎంతోగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాట ఫుల్ వీడియోను ఈనెల 14న ఉ.9:36గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సాంగ్ ప్రోమోను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
-
జపాన్‌లో కింగ్ నాగార్జున హిట్ మూవీ రీ-రిలీజ్!
జపాన్ ప్రజల్లో కింగ్ నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ‘మనం’ సినిమాను అక్కడ రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘మనం’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్‌కి వచ్చే జపాన్ అభిమానులతో వర్చువల్ వీడియో కాల్ ద్వారా నాగార్జున మాట్లాడనున్నారు. ఇది జపాన్ ఫ్యాన్స్‌కు ఓ మరిచిపోలేని అనుభూతి అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఈనెల 8న ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
-
‘పెద్ది’ నుంచి క్రేజీ అప్‌డేట్!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్-జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇందులో శ్రీకాకుళంకు చెందిన ఓ ఫేమస్ ఫోక్ సాంగ్‌ను మేకర్స్ రీమిక్స్ చేస్తున్నట్టు సమాచారం. శ్రీకాకుళం జానపద గేయం ‘మా ఊరి ప్రెసిడెంటు’ అనే సాంగ్‌ను రీమిక్స్ చేయగా.. ఈ పాటను పెంచల్ దాస్ ఆలపించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఫోక్ సాంగ్‌కు రెహమాన్ సంగీతం తోడైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
-
‘అర్జున్ రెడ్డి’కి విజయ్ తీసుకున్న పారితోషికం ఇదే!
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈనేపథ్యంలో విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో భాగంగా ‘అర్జున్ రెడ్డి’ మూవీ గురించి పంచుకున్నాడు. ‘‘‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు నేను తీసుకున్న పారితోషికం రూ.5లక్షలు. అప్పటివరకు అంత పెద్ద అమౌంట్ నేను చూడలేదు’’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.
-
‘కుర్చీ మడతబెట్టి’ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్ సెన్సేషనల్ పాట ‘కుర్చీ మడతబెట్టి’ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఊపేస్తోంది. ఈ సాంగ్‌కు తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు-శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట ‘గుంటూరు కారం’ చిత్రంలోనిది.(వీడియో)
-
హీరో విశాల్ ఇంట్లో పెళ్లి సందడి!
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఆయన మేనకోడలు ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ వేడుక జరగ్గా.. కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. ఈ పెళ్లికి విశాల్ హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక విశాల్ తమిళ హీరోయిన్ ధన్సికను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. (వీడియో)
-
జాతీయ అవార్డు విజేతలకు బన్నీ ప్రశంసలు
జాతీయఅవార్డులు దక్కించుకున్న వారిని అల్లు అర్జున్ అభినందించాడు. ఉత్తమ నటుడిగా షారుక్‌ఖాన్, విక్రాంత్ మస్సే నిలిచారు. షారుక్‌ను అభినందించిన బన్నీ.. మీరు ఈ పురస్కారానికి అర్హుడని రాసుకొచ్చారు. అలానే ‘12th ఫెయిల్’ తన ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని.. విక్రాంత్ మస్సేకి అవార్డ్ రావడం తనకు ఆనందంగా ఉందని బన్నీ చెప్పుకొచ్చారు. అలానే ఉత్తమ నటిగా నిలిచిన రాణీ ముఖర్జీకి కూడా శుభాకాంక్షలు తెలిపాడు.(ట్వీట్)
-
మెగాస్టార్‌తో హీరోయిన్ సంయుక్త రొమాన్స్!
హీరోయిన్ సంయుక్త మీనన్‌కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ‘మెగా157’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో రెండవ హీరోయిన్‌గా సంయుక్తను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అని టైటిల్ ఫిక్స్ అయినట్లు సినీవర్గాల సమాచారం.