హీరోయిన్ సంయుక్త మీనన్‌కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ‘మెగా157’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో రెండవ హీరోయిన్‌గా సంయుక్తను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అని టైటిల్ ఫిక్స్ అయినట్లు సినీవర్గాల సమాచారం.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే..
విజయ్ దేవరకొండ న్యూ మూవీ ‘కింగ్డమ్’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా ‘కింగ్డమ్’ చిత్రానికి ముందుగా ‘దేవర నాయక’ అనే టైటిల్‌ను అనుకున్నట్లు విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఎన్టీఆర్ నటించిన మూవీకి ‘దేవర’ అనే టైటిల్ ఉండటంతో, తాము ఆ టైటిల్‌ను వదులుకున్నామని తెలిపారు. కాగా, ఎన్టీఆర్ ‘దేవర’ సెప్టెంబర్ 27, 2024న విడుదలైంది.
-
‘కింగ్డమ్’ కలెక్షన్స్.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈమూవీ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ వదిలారు.
-
బాలీవుడ్ బాద్‌షాకు కమల్ విషెస్!
శుక్రవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. షారుఖ్‌తో పాటు విక్రాంత్ మాస్సే, రాణీ ముఖర్జీ తదితరులు అవార్డులు గెలుచుకున్నారు. అయితే షారుఖ్ ఖాన్‌తో పాటు ఉత్తమ నటుడు, నటి అవార్డులు గెలుచుకున్న నటులకు స్టార్ హీరో, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.
-
మా పోరాటానికి ఈ అవార్డులే నిదర్శనం: దర్శకుడు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’. సినీ రంగంలోనే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రెండు విభాగాల్లో పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ ఎంపిక కాగా.. ఉత్తమ ఛాయాగ్రహణం విభాగంలో పసంతను మొహపాత్రో అవార్డు సొంతం చేసుకున్నారు. దీనిపై దర్శకుడు స్పందిస్తూ 10 ఏళ్ల పోరాటానికి ఈ అవార్డు నిదర్శనమని అన్నారు.
-
‘ఓజీ’ వచ్చేశాడు.. పవర్‌ఫుల్ సాంగ్ రిలీజ్..
పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం అభిమానుల్లో జోష్ నింపుతూ ఓ పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ లిరిక్స్‌కు తమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచేలా ఉంది.
-
ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలివే!
ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఎక్కడ అందుబాటులో ఉందో చూద్దాం.
- నెట్‌ఫ్లిక్స్: ‘తమ్ముడు’
- యూట్యూబ్: ‘సితారే జమీన్ పర్’
- ఈటీవీ విన్: ‘ఓ భామ.. అయ్యో రామ’
- అమెజాన్ ప్రైమ్ వీడియో: ‘3 బీహెచ్‌కే’
- ఆహా: ‘అస్త్రం’
- జియో హాట్‌స్టార్: ‘బ్లాక్ బ్యాగ్’
-
ఆ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు.. కేంద్రంపై సీఎం ఫైర్
‘ది కేరళ స్టోరీ’ చిత్రం రెండు నేషనల్ అవార్డులు పొందింది. ఈ సినిమా కేరళలోని మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ISISలో చేర్చడాన్ని గురించి వివరిస్తుంది. ఈ చిత్రానికి 2 అవార్డులు రావడంపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేరళకు తీవ్రమైన అవమానంగా వర్ణించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ చిత్రం.. రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
-
ఏ సినిమా అయినా టెన్షన్ సహజం: నాగవంశీ
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘కింగ్డమ్’ మంచి ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రూ.5 కోట్ల సినిమా అయినా రూ.500 కోట్లదైనా రిలీజ్‌కు ముందు తాను ఎప్పుడూ టెన్షన్ పడతానని అన్నారు.
-
కొనసాగుతున్న ‘సైయారా’ సందడి
అహన్ పాండే, అనీత్ పడ్డా నటించిన చిత్రం ‘సైయారా’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ మూడో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన 15 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ.284 కోట్లు వసూలు చేసి.. థియేటర్ల వద్ద సందడిని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.