Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కొనసాగుతున్న ‘సైయారా’ సందడి

    అహన్ పాండే, అనీత్ పడ్డా నటించిన చిత్రం ‘సైయారా’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ మూడో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన 15 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ.284 కోట్లు వసూలు చేసి.. థియేటర్ల వద్ద సందడిని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

     

  • ‘చెప్పు తెగుద్ది’.. యాంకర్ అనసూయ వార్నింగ్

    ప్రకాశం: యాంకర్ అనసూయ తాజాగా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లారు. అనసూయ మాట్లాడుతుండగా.. కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడడంతో ఆమె తీవ్రంగా మండిపడ్డారు. “చెప్పు తెగుద్ది..మీ ఇంట్లో అమ్మ, చెల్లి, ప్రియురాలు, మీ భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా?పెద్దవారిని ఎలా గౌరవించాలో మీఇంట్లో నేర్పించలేదా” అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • ‘మారువేషంలో “కింగ్డమ్” సినిమా చూసిన రష్మిక’

    విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమా రెండు రోజుల కిందట రిలీజ్ అయి… పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాను.. మారువేషంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చూశారని నిర్మాత నాగ వంశీ బయటపెట్టారు. కింగ్డమ్ సినిమాను… ఆమె శ్రీరాములు థియేటర్‌కు వెళ్లి చూడాలనుకుంది.కాని యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో ఆమె మారువేషంలో భ్రమరాంబ హాలుకు వెళ్లి చూసినట్లు వంశీ స్పష్టం చేశారు.

  • ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ రికార్డు వసూళ్లు

    ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమేటెడ్ చిత్రం ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.60.5 కోట్లు వసూళ్లు చేసి దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా రికార్డు సృష్టించింది.

  • జాతీయ అవార్డు విజేతలకు చిరు శుభాకాంక్షలు

    జాతీయ సినీ అవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ అవార్డు విజేతలు అందరి పేర్లను తన ట్వీట్‌లో చిరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, టాలీవుడ్‌కు 10 అవార్డుల రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకనిర్మాతలు, నటులు చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.

  • అమెరికాలో దూసుకుపోతున్న ‘అతడు’

    మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్లాసిక్ చిత్రం ‘అతడు’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. యూఎస్‌ మార్కెట్‌లో విడుదలకి ఇంకా వారం ఉండగానే ఇప్పటికే 10 వేల డాలర్లకు పైగా వసూలు చేసి సినిమాపై ఉన్న అంచనాలను పెంచింది. గతంలో ‘ఖలేజా’ రీ-రిలీజ్‌తో యూఎస్‌లో రికార్డులు సృష్టించిన మహేష్, ‘అతడు’తో ఎలాంటి వసూళ్లు సాధిస్తాడో చూడాలి.

  • చేతికి దెబ్బతగిలింది.. రెట్టింపు ఉత్సాహంతో వస్తా: షారుఖ్

    జాతీయ అవార్డు రావడంపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ స్పందించారు. 33 ఏళ్ల కెరీర్‌లో తొలి జాతీయ పురస్కారం దక్కించుకున్న సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. తన చేతికి దెబ్బ తగిలిందని, త్వరలోనే రెట్టింపు ఉత్సాహంతో వస్తానని నటుడు పేర్కొన్నారు. అయితే, షూటింగ్ సమయంలోనే షారుఖ్ చేయి విరిగి ఉండొచ్చని, ఆయనకు త్వరగా నయంకావాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్‌ నవాస్‌ (51) శుక్రవారం సాయంత్రం చోట్టానిక్కరలోని ఓ హోటల్‌లో మరణించారు. సినిమా షూటింగ్‌ కోసం హోటల్‌లో బస చేసిన నవాస్‌ అపస్మారక స్థితిలో కనిపించడంతో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు కారణంగా మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • రెండు ఒడియా సినిమాలకు జాతీయ అవార్డులు

    71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఒడియా చిత్రాలకు రెండు పురస్కారాలు లభించాయి. ‘పుష్కర’ ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా, తుపాను బాధితుల సమస్యలపై రూపొందించిన ‘ద సీ అండ్ సెవెన్ విలేజెస్’ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి చిత్ర బృందాలను అభినందించారు.

  • ఉత్తమ తమిళ చిత్రం పార్కింగ్‌

    71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘పార్కింగ్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రంలో నటనకు ఎం.ఎస్‌. భాస్కర్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించగా, దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం దక్కింది. ఈ సినిమాకు హరీష్ కల్యాణ్, ఎం.ఎస్‌.భాస్కర్, ఇందుజా, రామా రాజేంద్రన్, ఇళవరసు వంటివారు ప్రధాన పాత్రల్లో నటించారు.