71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఒడియా చిత్రాలకు రెండు పురస్కారాలు లభించాయి. ‘పుష్కర’ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, తుపాను బాధితుల సమస్యలపై రూపొందించిన ‘ద సీ అండ్ సెవెన్ విలేజెస్’ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చిత్ర బృందాలను అభినందించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఉత్తమ తమిళ చిత్రం పార్కింగ్
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘పార్కింగ్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రంలో నటనకు ఎం.ఎస్. భాస్కర్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించగా, దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం దక్కింది. ఈ సినిమాకు హరీష్ కల్యాణ్, ఎం.ఎస్.భాస్కర్, ఇందుజా, రామా రాజేంద్రన్, ఇళవరసు వంటివారు ప్రధాన పాత్రల్లో నటించారు.
-
షారుఖ్ ఖాన్: 33 ఏళ్లకు తొలి జాతీయ అవార్డు!
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలి జాతీయ అవార్డు అందుకోవడానికి 33 ఏళ్లు పట్టింది. తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘జవాన్’ చిత్రానికి షారుఖ్ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉన్న ఆ ఒక్క వెలితి కూడా తీరిందని షారుఖ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు .
-
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కలిసి నటించిన చిత్రం ‘OG’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కానుంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ ఇచ్చారు. మొదటి సాంగ్‌ను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశారు.
సెప్టెంబర్ 25న ఈ మూవీ విడుదల కానుంది. -
హాట్ లుక్‌లో నేహా శెట్టి..కుర్రకారు ఫిదా!
హీరోయిన్ నేహా శెట్టి తాజాగా వైట్‌లో డ్రెస్‌లో మెరిసింది. ఇందులో ఆమె లుక్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
నవ్వులు పూయించే ‘బన్ బటర్ జామ్’ టీజర్
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘బన్ బటర్ జామ్’. రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగులో ఆగస్టు 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా కామెడీగా, హార్ట్‌ఫుల్‌గా ఉందని చెప్పాలి.
-
ఈ పురస్కారం మాకు మరింత స్ఫూర్తి: బాలకృష్ణ
“భగవంత్ కేసరి” ఉత్తమ తెలుగు చిత్రంగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకోవడం పట్ల నందమూరి బాలకృష్ణ గారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం మొత్తం చిత్ర బృందానికే చెందుతుందని ఆయన అన్నారు. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే ప్రతి ఒక్క కళాకారుడికి, సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత మంచి కథలను అందించడానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
-
‘జాతీయ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నా’
‘ఊరు పల్లెటూరు’ పాట రాసిన తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నానని లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అన్నారు. ఆయన ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు యెల్దండి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్‌కు నేషనల్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు.
-
త్రిబాణధారి బార్బరిక్’ మాస్ సాంగ్.. ఉదయభాను స్టెప్పులు అదుర్స్!
‘చాలా ఏళ్ల తర్వాత యాంకర్ ఉదయభాను అదిరిపోయే స్టెప్పులు వేసింది. సత్యరాజ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దీనికి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇందులో ఉదయభాను కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈమూవీ నుంచి ఆమెకు సంబంధించిన ఓ మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఉదయభాను మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది.
-
ఆ వ్యక్తినే చేసుకుంటా.. పెళ్లిపై స్పందించిన అనుష్క!
హీరోయిన్ అనుష్కశెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వివాహంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘బాహుబలి తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి బాగా పెరిగింది. నా కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని అంటున్నారు. నాకు వివాహ బంధంపై నమ్మకం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు నాకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. సినిమా ఇండస్ట్రీ చెందిన ఎవరినీ పెళ్లి చేసుకోను’’ అని అనుష్క తెలిపింది.