ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ఈ సినిమాతో నిహారిక NM తెలుగు తెరకు పరిచయమవుతోంది. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ నుంచి తాజాగా సెకండ్ సాంగ్ ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదలైంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలకు రానుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కూలీ’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఆసక్తిగా పోస్టర్!
రజనీకాంత్-నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న విడుదలకానుంది. ఈమూవీ ట్రైలర్ రేపు సా.7గంటలకు రిలీజ్ కానుందంటూ మేకర్స్ ఆసక్తికర పోస్టర్ వదిలారు.
-
నేషనల్ అవార్డు మాకు బోనస్: అనిల్ రావిపూడి
బాలకృష్ణ హీరోగా తాను తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’కి జాతీయ అవార్డు ప్రకటించడంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ‘‘భగవంత్ కేసరి’.. నా కెరీర్‌లో చేసిన విభిన్న ప్రయత్నం. ఈ పురస్కారం బోనస్ అని అనుకుంటున్నా. మా ప్రయత్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే బాలకృష్ణ సర్‌తో మాట్లాడా.. ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు’’ అని పేర్కొన్నారు.
-
సెప్టెంబర్‌లో రాబోతున్న ‘లిటిల్ హార్ట్స్’
శివాని నాగరం-మౌళి తనూజ్ జంటగా సాయి మార్తాండ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
-
తొలిసారి జాతీయ అవార్డుకు ఎంపికైన షారుఖ్ ఖాన్
71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో షారుఖ్ ఖాన్ తన తొలి జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. ‘జవాన్’ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. 2023లో షారుఖ్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 2500 కోట్లకు పైగా వసూలు చేసి, ఘన విజయం సాధించాయి.
-
‘బలగం’ మూవీకి నేషనల్ అవార్డు
2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. అందులో తెలంగాణ చిత్రం ‘బలగం’కు అవార్డు దక్కింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు గాను ‘బెస్ట్ లిరిక్స్’ అవార్డు దక్కింది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. సింగర్ మంగ్లీ, రామ్ మిరియాల కలిసి పాడారు. ఈ మూవీకి నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించగా ప్రియదర్శి-కావ్య జంటగా నటించారు.
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కూలీ’
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ చిత్రం తాజాగా సెన్సార్ ముగించుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈనెల 14న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కానుంది.
-
71వ నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు చిత్రాల హావా
- బెస్ట్ స్క్రీన్ ప్లే: (బేబీ) సాయి రాజేష్ నీలం
- బెస్ట్ సౌండ్ డిజైన్: యానిమల్
- బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్: (బేబీ) రోహిత్
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతివేణి (గాంధీ తాత చెట్టు)
- బెస్ట్ లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు సాంగ్)
- బెస్ట్ స్టంట్, విజువల్ కొరియోగ్రఫీ: నందు, పృధ్వి (హనుమాన్)
-
హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫ్రీ అవార్డు
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలో ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో ‘హను-మాన్’ చిత్రం అవార్డు దక్కించుకుంది. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్’కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్త (అస్సామీ)కు ప్రకటించారు.
-
జాతీయ ఉత్తమ చిత్రం(TELUGU).. భగవంత్ కేసరి
కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డుల వివరాలను జ్యూరీ వెల్లడించింది. జాతీయ ఉత్తమ చిత్రం(తెలుగు) విభాగంలో భగవంత్ కేసరి ఎంపికైంది. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘ఫ్లవరింగ్ మ్యాన్(హిందీ)’ ఎంపికైంది.