Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కూలీ’

    రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ చిత్రం తాజాగా సెన్సార్ ముగించుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈనెల 14న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కానుంది.

  • 71వ నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు చిత్రాల హావా

    • బెస్ట్ స్క్రీన్ ప్లే: (బేబీ) సాయి రాజేష్ నీలం
    • బెస్ట్ సౌండ్ డిజైన్: యానిమల్
    • బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్: (బేబీ) రోహిత్
    • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌: సుకృతివేణి (గాంధీ తాత చెట్టు)
    • బెస్ట్ లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు సాంగ్)
    • బెస్ట్ స్టంట్‌, విజువల్ కొరియోగ్రఫీ: నందు, పృధ్వి (హనుమాన్)

  • హనుమాన్‌ మూవీకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫ్రీ అవార్డు

    71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలో ఉత్తమ యాక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ)లో ‘హను-మాన్‌’ చిత్రం అవార్డు దక్కించుకుంది. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్‌’కు అవార్డు దక్కింది. బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ)కు ప్రకటించారు.

  • జాతీయ ఉత్తమ చిత్రం(TELUGU).. భగవంత్‌ కేసరి

    కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డుల వివరాలను జ్యూరీ వెల్లడించింది. జాతీయ ఉత్తమ చిత్రం(తెలుగు) విభాగంలో  భగవంత్‌ కేసరి ఎంపికైంది. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘ఫ్లవరింగ్‌ మ్యాన్‌(హిందీ)’ ఎంపికైంది.

  • 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటన

    71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.

    • ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సీ (‘12th ఫెయిల్’)
    • ఉత్తమ నటి : రాణి ముఖర్జీ (‘Mrs Chatterjee vs Norway’)
    • ఉత్తమ చిత్రం: Rocky Aur Rani Kii Prem Kahaani
    • బెస్ట్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
    • బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
    • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: GV ప్రకాశ్ (వాతీ)
  • 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటన

    71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా వివిధ కేటగిరీల్లో అవార్డులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తున్నారు. బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ)కు ప్రకటించారు. తొలుత నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి అవార్డులను వెల్లడించారు.

  • బిగ్‌బాస్ కొత్త సీజన్‌ వచ్చేస్తోంది.. స్టార్ హీరో పోస్ట్!

    బిగ్‌బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా హిందీ బిగ్‌బాస్ న్యూ సీజన్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సీజన్ 19కు సంబంధించిన టీజర్‌ను సల్మాన్ ఖాన్ పంచుకున్నాడు. ఇందులో సల్మాన్ రాజకీయ నాయుకుడి గెటప్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ సీజన్ జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో ప్రసారంకానుంది. ఈ షో ఆగస్టు 24 నుంచి గ్రాండ్ ప్రీమియర్‌తో ప్రారంభమవుతోంది.

     

  • ‘గరివిడి లక్ష్మి’ ఫోక్ సాంగ్‌కు డేట్ ఫిక్స్!

    హీరోయిన్ ఆనంది నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గరివిడి లక్ష్మి’. ఈ సినిమాలోని ‘నల జిలకర మొగ్గ’ అనే సాంగ్ ఆగస్టు 4న రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ వదిలారు.

  • ఆసక్తిగా ‘అరేబియా కడలి’ ట్రైలర్‌

    సత్యదేవ్‌, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘అరేబియా కడలి’. సూర్యకుమార్‌ దర్శకుడు. స్టార్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 8 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ విడుదలైంది.

  • నటి రేణు దేశాయ్ సంచలన పోస్ట్

    నటి రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ నెట్టింట దుమారం రేపుతోంది. ‘‘ఒక కుక్క మనిషిని కరిచిందని, ఏ పాపం చేయని వీధి కుక్కలను అన్నింటినీ చంపేయడం ఎంత న్యాయం. అదే సమాజంలో రేపిస్టులు, మర్డర్ చేసినవాళ్లు మాత్రం మన చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇదెక్కడి న్యాయం. ’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది.