Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నటి రేణు దేశాయ్ సంచలన పోస్ట్

    నటి రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ నెట్టింట దుమారం రేపుతోంది. ‘‘ఒక కుక్క మనిషిని కరిచిందని, ఏ పాపం చేయని వీధి కుక్కలను అన్నింటినీ చంపేయడం ఎంత న్యాయం. అదే సమాజంలో రేపిస్టులు, మర్డర్ చేసినవాళ్లు మాత్రం మన చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇదెక్కడి న్యాయం. ’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది.

     

  • నటి కంగనాకు హైకోర్టులో ఎదురుదెబ్బ!

    బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బటిండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ పరువు నష్టం దావా రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంపై ఆమె చేసిన ట్వీట్‌పై పరువు నష్టం కేసు నమోదైంది.

  • అవతార్ 4, 5ని నేనే డైరెక్ట్ చేస్తా: జేమ్స్ కామెరూన్

    హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తానని వెల్లడించారు. వయసు పెరుగుతున్నా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఈ భారీ ప్రాజెక్టులకు దర్శకత్వం వహించే సత్తా తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా అవతార్-3 ఈ సంవత్సరం డిసెంబర్ 19న విడుదల కానుంది.

     

  • ఎవరైనా ఆడిషన్‌ ఇవ్వాల్సిందే: సుమంత్‌

    నటుడు సుమంత్‌ తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్ని అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ‘సినీ నేపథ్యం ఉన్న వారిని ఆడిషన్‌ చేస్తారా?’ అని ఓ అభిమాని అడగ్గా.. ‘‘ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వారికి ఇండస్ట్రీలోకి ప్రవేశించడం తేలికేగానీ.. ఓ స్థాయి దాటాక ఎవరైనా ఆడిషన్‌ ఇవ్వాల్సిందే. కొన్నాళ్ల క్రితం నేను నాలుగైదు హిందీ ప్రాజెక్టులకు ఆడిషన్స్‌ ఇచ్చా. రిజెక్ట్‌ అయ్యాను’’ అని సుమంత్ తెలిపాడు.

  • సంక్రాంతి బరిలో రాజా సాబ్?

    ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ‘రాజా సాబ్’ చిత్రాన్ని జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

     

  • విజ‌య్ ‘కింగ్డ‌మ్’ను వీక్షించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి

    విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘కింగ్డ‌మ్’. గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీని దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తన ఫ్యామిలీతో కలిసి చూశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

  • ‘ప్లీజ్‌ ప్లీజ్‌ మేమ్‌’ అంటున్న హీరో నారా రోహిత్‌!

    నారా రోహిత్‌ హీరోగా వెంకటేశ్‌ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘాని కథానాయికలు. ఆగస్టు 27న ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ‘‘ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ మేమ్‌…’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీహర్ష ఈమని రాసిన ఈ పాటకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించాడు.

  • ‘కూలీ’ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్.. ఎక్కడంటే?

    కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. ఈనెల 14 విడుదలకానుంది. ఈనేపథ్యంలో మూవీ మేకర్స్ ట్రైలర్ లాంచ్‌కు ప్లానింగ్స్ చేస్తున్నారు. ఓ గ్రాండ్ ఈవెంట్‌తో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టుగా వేదికను ఖరారు చేశారు. రేపు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. (వీడియో)

  • ఆ పాటకు కష్టంగానే ఓకే చెప్పా: ప్రియాంక చోప్రా

    సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ్‌-లీలా’ అప్పట్లో ట్రెండ్‌ సృష్టించింది. ఇందులో ‘రామ్ చాహే లీలా’  పాటలో ప్రియాంక చోప్రా ఆడిపాడింది. తాజాగా ఈ పాట జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘‘సంజయ్‌ ఈ పాట కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను చేయగలనా అనుకున్నాను. కష్టంగానే ఓకే చెప్పా. కానీ, దర్శకుడు నాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు’’ అని ప్రియాంక రాసుకొచ్చారు.

  • ‘కింగ్డమ్‌-2’లో మరో స్టార్ హీరో!

    విజయ్‌ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్టుగానే ‘కింగ్డమ్‌’ మూవీతో ఆయన విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విజయ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే ‘కింగ్డమ్‌ 2’ మొదలవుతుందని, అందులో మరో అగ్ర హీరో కూడా ఉంటారని చెప్పారు. ఆయన ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రమే ‘కింగ్డమ్‌’.