‘సితారే జమీన్ పర్’ సినిమాను ప్రారంభించిన నాటినుంచి దీన్ని ఓటీటీలో విడుదల చేయనని ఆమిర్ ఖాన్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. థియేటర్‌లో మంచి ఆదరణ పొందిన తర్వాత, నేటినుంచి తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు. దీనికి అద్దె రూ.100 అని ఆమిర్ టీమ్ ప్రకటించగా..కొన్ని డివైజ్‌లలో రూ.179 చూపిస్తుండడంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆయన టీమ్ క్షమాపణలు తెలిపింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
యోగి ఆదిత్యనాథ్ బయోపిక్.. సర్టిఫికెట్ నిరాకరించిన సెన్సార్ బోర్డు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ అనే సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికెట్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై చిత్ర దర్శకనిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికెట్ నిరాకరణకు గల కారణాలను సెన్సార్ బోర్డు ఇంకా వెల్లడించలేదు. ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
-
ఓటీటీలోకి సిద్ధార్థ్ ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్ తండ్రికొడుకులుగా నటించిన సినిమా ‘3 బీహెచ్‌కే’. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 1నుంచి స్ట్రీమింగ్ కానుందని నిర్మాణ సంస్థ శక్తి టాకీస్ ప్రకటించింది. తెలుగు, తమిళ్ ఆడియో అందుబాటులో ఉంటుందని తెలిపింది. విదేశాల్లో ‘సింప్లీ సౌత్’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
-
ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్‌కు అస్వస్థత!
ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆమెను జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. మొదట సాధారణ జ్వరమని భావించినా.. వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వైద్యులు ప్రత్యేకంగా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని.. పూర్తి కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.
-
పవన్‌కళ్యాణ్‌పై నిర్మాత నాగవంశీ సంచలన కామెంట్స్
‘కింగ్డమ్’ సినిమా సక్సెస్ మీట్‌ను నేడు హైదరాబాద్‌లో నిర్వహించారు. అయితే ఈ మీట్‌లో పవన్‌కళ్యాణ్‌పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలోనే ఏపీలో కూడా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని వంశీ తెలుపగా.. కోస్తాలో సక్సెస్ మీట్‌కు పవన్‌కళ్యాణ్‌ను పిలుస్తారా? అని రిపోర్టర్స్ ఆయనను ప్రశ్నించారు. దానికి ఆయన.. మాకు విజయ్ దేవరకొండనే పవన్‌కళ్యాణ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
‘కింగ్డమ్’.. ఓవర్సీస్‌లో సాలిడ్ రెస్పాన్స్!
వరల్డ్‌వైడ్‌గా నేడు విడుదలైన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’కు ఓవర్సీస్‌లో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈమూవీ తాజాగా నార్త్‌అమెరికాలో 1 మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
-
సినీ నటి కల్పిక ఆరోగ్యంపై తండ్రి ఫిర్యాదు
సినీ నటి కల్పిక మానసిక ఆరోగ్యంపై ఆమె తండ్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు డిప్రెషన్, అరుదైన వ్యాధితో బాధపడుతోందని ఆయన తెలిపారు. 2023లో చికిత్స తీసుకున్న కల్పిక.. మెడికేషన్ రెండేళ్లుగా నిలిపివేయడం వల్ల తరచూ గొడవలు సృష్టిస్తూ, న్యూసెన్స్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసుకుందని, ఆమె వల్ల కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
ఓటీటీలోకి ‘హరిహర వీరమల్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఇటీవల విడుదలై పరవాలేదనింపింది. ఇక రిలీజైన వారం రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘హరిహర వీరమల్లు’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్ట్రీమింగ్‌కు రానుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది.
-
ఆ స్టార్ హీరోకు జోడీగా యంగ్ హీరోయిన్!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. K-47 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. ఇందులో యంగ్ బ్యూటీ నిశ్వికా నాయుడు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తాజాగా ఈ అమ్మడు షూట్‌లో కూడా జాయిన్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
-
‘OG’.. పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘OG’. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ఆగస్టు 2న రాబోతున్నట్లు మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.