కోలీవుడ్ హీరో జయం రవి డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టనున్నాడు. కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో.. ఆయన సినిమా తెరకెక్కించనున్నారని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రవి స్పందించాడు. యోగిబాబుతో తాను రూపొందించనున్న ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ తన ప్రొడక్షన్ హౌస్‌కి రెండో చిత్రమని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతోనే నిర్మాణ సంస్థ నెలకొల్పానని, ఓటీటీ ప్రాజెక్టులూ నిర్మిస్తానని ఆయన తెలిపారు.