శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రే .. ‘నిషాంచీ’ మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.అనురాగ్ కశ్యప్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే 80ల కాలంనాటి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
అతనికి ఛాలెంజ్ విసిరిన నిర్మాత నాగవంశీ
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘కింగ్డమ్’. ఈ సినిమా నేడు విడుదలై హిట్ అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఓవర్సీస్‌లో మేం ఎంతకు విక్రయించామో.. అందులో 50 శాతం వచ్చేసింది. రాయలసీమలోనూ 50 శాతం రాబట్టేస్తుంది. నైజాంలో దాదాపు రూ.8 కోట్లు (గ్రాస్) వసూలు చేయొచ్చు. ఆంధ్రాలోనూ అనుకున్నంత కలెక్షన్స్ చేస్తుంది’’ అని తెలిపారు.
-
మృణాల్ బర్త్ డే.. ‘డెకాయిట్’ స్పెషల్ పోస్టర్
రేపు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు ఒకరోజు ముందే విషెస్ తెలుపుతూ.. ‘డెకాయిట్’ మూవీ టీమ్ పవర్ ఫుల్ పోస్టర్‌ను పంచుకుంది.
-
ఎయిర్‌పోర్ట్‌లో నటి ఊర్వశి నగలు చోరీ
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా లండన్ విమానాశ్రయంలో తన నగలు చోరీకి గురయ్యాయని ఆరోపించారు. వాటి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని ఆమె తెలిపారు. నటి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సంఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
-
‘కింగ్డమ్’ సక్సెస్.. మీడియాతో టీమ్ చిట్‌చాట్!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించిన బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ‘కింగ్డమ్’ ప్రెస్‌మీట్‌లో విజయ్, సత్యదేవ్, నిర్మాత నాగవంశీ, మలయాళ నటుడు వెంకటేష్ పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఆ వీడియో మీ కోసం.
-
‘‘కింగ్డమ్’ విజయంపై చాలా ఫీలవుతున్నా’.. విజయ్ ఎమోషనల్
అనుకున్నట్టుగానే ‘కింగ్డమ్’ సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉందన్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ విజయంపై చాలా ఫీలవుతున్నానని, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నాడు. ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ గురువారం విడుదలైన హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
-
క్యాస్టింగ్ కౌచ్‌పై మరో నటి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి ఇందిరా కృష్ణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘సౌత్ ఇండస్ట్రీలో నేను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. కొన్ని ప్రాజెక్ట్‌లలో హీరోయిన్‌గా ఎంపికైనప్పటికీ కమిట్‌మెంట్ అడగడంతో నేను నో చెప్పాను. దాంతో ఆ సినిమాలలో అవకాశం కోల్పోయాను. నా టాలెంట్‌ను అమ్ముకోవడానికి వచ్చాను కానీ.. నన్ను అమ్ముకోవడానికి కాదు అని వారికి సమాధానం చెప్పాను’’ అంటూ ఇందిరా చెప్పుకొచ్చింది.
-
వీడియో.. థియేటర్స్‌ని దేవాలయాలుగా మార్చిన సినిమా
‘మహావతార్ నరసింహ’ సినిమాపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని, ప్రతి హిందువు తప్పకుండా చూడాలని, ఇది కేవలం సినిమా కాదని, ఒక ఆధ్యాత్మిక అనుభూతి అని సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత అభిమానుల రియాక్షన్స్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
-
‘వీడే హీరో అయ్యాడు మనం అవ్వలేమా?’
‘‘వీడే హీరో అయ్యాడు.. మనం అవ్వలేమా అనుకున్నావ్ కదా’’ అని ఆది పినిశెట్టి సరదాగా చైతన్యరావ్ అన్నాడు. గురువారం నిర్వహించిన ‘మయసభ’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆది, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మయసభ’. దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ ‘సోనీలివ్’లో ఆగస్టు 7న విడుదలకానుంది.
-
‘మిత్ర మండలి’.. సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్!
నటుడు ప్రియదర్శి-నిహారిక జంటగా విజయేందర్.S తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలోని ‘స్వేచ్ఛ స్టాండు’ అనే సెకండ్ సాంగ్ ఆగస్టు 1న సా.5:04 గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ చిన్న వీడియోను షేర్ చేశారు. ఇక దానిని నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. (వీడియో)