Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘కింగ్డమ్‌’ హిట్‌పై రష్మిక పోస్ట్.. విజయ్‌ దేవరకొండ రిప్లై!

    విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ‘కింగ్డమ్‌’ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ‘కింగ్డమ్‌’ స‌క్సెస్‌పై నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా పోస్ట్ పెట్టింది. ‘‘ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మ‌నం కొట్టినం’’’ అంటూ ర‌ష్మిక రాసుకొచ్చింది. దీనికి ‘మ‌నం కొట్టినం’ అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

  • ‘7/G బృందావన్ కాలనీ-2’ టీజర్‌పై ఆసక్తికర అప్‌డేట్!

    2004లో రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ ‘7/G బృందావన్ కాలనీ’కి సీక్వెల్‌గా ‘7G బృందావన్ కాలనీ-2’ రాబోతున్న విషయం తెలిసిందే. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి కృష్ణ-అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘7/G బృందావన్ కాలనీ-2’ టీజర్ ఆగస్టులో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

  • ‘కింగ్డమ్’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

    హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ‘కింగ్డమ్’ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఈ సినిమా హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ టేక్ ఓవ‌ర్ చేసిన‌ట్లు టాక్. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌కి దాదాపు 50 రోజులు ప‌ట్ట‌వ‌చ్చ‌ని సినీవర్గాల సమాచారం.

  • పార్లమెంటు ఆవరణలో సైకిల్‌ ఎక్కి సందడి చేసిన బాలయ్య

    హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతి రోజు పార్లమెంటుకు సైకిల్‌పై వస్తానని.. దాన్ని బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్‌పై ఎక్కి కాసేపు సందడి చేశారు.

  • “కింగ్‌డమ్‌”లో ఆ పాట ఎత్తేశారంటూ ఫ్యాన్స్‌ నిరాశ

    నేడు థియేటర్లలో విడుదలైన విజయ్ దేవరకొండ “కింగ్డమ్” సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘హృదయం లోపల’ పాట సినిమాలో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ మెలోడీ సాంగ్‌కు మంచి స్పందన లభించినప్పటికీ, సినిమా నుండి తొలగించడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో మొత్తం రెండే పాటలు ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

     

  • రష్మిక పోస్ట్‌కు విజయ్ దేవరకొండ రిప్లై

    హీరోయిన్ రష్మిక మందన్న ‘కింగ్‌డమ్‌’ విజయవంతం కావడంపై సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్‌కు హీరో విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రష్మిక తన పోస్ట్‌లో “హిట్‌ కొట్టాం” అని పేర్కొనగా.. దీనికి విజయ్ దేవరకొండ “మనం హిట్‌ కొట్టాం” అని బదులిచ్చారు. వీరిద్దరూ గతంలో పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

     

     

  • ఓటీటీలోకి ‘ఓ భామ.. అయ్యో రామ’

    సుహాస్ ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘ఓ భామ.. అయ్యో రామ’. ఈ మూవీ ఆగస్టు 1 నుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’లో  స్ట్రీమింగ్ కానుంది.

     

  • రూ.400 కోట్లు దాటిన ‘సైయారా’ కలెక్షన్స్‌

    చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘సైయారా’ యూత్‌ను ఆకట్టుకుంటోంది. దీంతో మంచి కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్లు వసూలుచేసినట్లు నిర్మాణ సంస్థ ఇటీవల తెలిపింది. భారత్‌లో రూ.260 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

     

  • ‘ఛావా’ను బీట్‌ చేసిన ‘సైయారా’

    ఓవర్సీస్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న సినిమాగా ‘సైయారా’ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఉన్న ఛావా రికార్డును బీట్ చేసింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘ఛావా’ అంతర్జాతీయ బాక్సాఫీస్‌ వద్ద మొత్తం రూ.91 కోట్లు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. ‘సైయారా’ కేవలం 13 రోజుల్లోనే ఓవర్సీస్‌లో రూ.94 కోట్లు వసూలు చేసినట్లు పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి.

  • సినీనటి ఖుష్బుకు కీలక పదవి

    ప్రముఖ సినీ నటి ఖుష్బు తమిళనాడు రాష్ట్ర BJP ఉపాధ్యక్షురాలిగా నియమితులైనట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ప్రకటించారు. టి.నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో నటి ఖుష్బుతో పాటు ఉపాధ్యక్షులుగా నియమితులైన 14 మంది జాబితాను విడుదల చేశారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా అనుమతితో రాష్ట్ర విభాగానికి నూతన నిర్వాహకులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.