విజయ్ దేవరకొండ న్యూ మూవీ ‘కింగ్డమ్’ ఈ రోజు థియేటర్‌లో రిలీజైంది. అన్నను వెతుక్కుంటూ వెళ్లిన హీరో ఒక తెగకు రాజుగా ఎలా మారాడన్నది ‘కింగ్డమ్’ సినిమా కథ. విజయ్ దేవరకొండ యాక్షన్, వెంకటేష్ విలనిజం, అనిరుధ్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయి. అయితే సెకండాఫ్ స్లోగా ఉండడం మైనస్. పార్ట్-2 కోసం డైరెక్టర్ గౌతమ్ క్లైమాక్స్‌ను అసంపూర్తిగా ముగించినట్లు అనిపిస్తుంది. రేటింగ్ 2.25/5.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
WAR-2 నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘వార్-2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ఈ సినిమాలోని హృతిక్–కియారాలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
-
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా?
ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘రాజాసాబ్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది డిసెంబర్‌లో మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్.. సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 9కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
‘కింగ్డమ్’ రిలీజ్ వేళ విజయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
విజయ్ దేవరకొండ న్యూ మూవీ ‘కింగ్డమ్’ నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు.. సూపర్ హిట్ అంటూ తమ అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన అభిమానులు సినిమాపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి చాలా ఆనందంగా ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
-
మృణాల్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘డెకాయిట్’ టీమ్
‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టు 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా, ‘డెకాయిట్’ చిత్ర బృందం సెట్‌లో ఆమెకు ప్రీ-బర్త్‌డే వేడుకలను నిర్వహించింది. కేక్ కట్ చేసిన మృణాల్ టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే సరస్వతి’ అంటూ అందరూ విష్ చేయడంతో ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు సరస్వతి అని తెలుస్తోంది.
-
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. జులై 30న తన 52వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. మరో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. 500 మంది సీనియర్ సిటిజన్లకు ఆశ్రయం, సంరక్షణ అందించే వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమంలోని వృద్ధులకు ఆశ్రయంతో పాటు, వైద్య సంరక్షణ, పోషకమైన భోజనం, ఎమోషనల్ సపోర్ట్‌ను కూడా అందించనున్నట్లు చెప్పారు.
-
టాయిలెట్‌లో ఏడ్చిన షారుక్ ఖాన్!
ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు మూడుసార్లు టైటిల్ కొట్టింది. అయితే కేకేఆర్ ట్రోఫీ సాధించడానికి ఆ జట్టు జెర్సీని మార్చడమే కారణమని ప్రముఖ న్యూమరాలజీస్ట్ శ్వేతా తెలిపారు. ‘‘కేకేఆర్ విషయంలో షారుక్ ఖాన్ మా సలహా అడిగారు. మేము వారి జెర్సీని మార్చాము. ఆ తర్వాతే వారు మూడు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్నారు. కెకెఆర్ మ్యాచ్‌లు ఓడిపోతే షారుక్ టాయిలెట్‌లో ఏడ్చేవారు’’ అని పేర్కొన్నారు.
-
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ విలన్ మృతి
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలన్ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు పొందిన నటుడు బోరబండ భాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తన స్నేహితులతో గండికోటకు వెళ్లి తిరిగివస్తుండగా ఆయన కారు బొత్కూర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. తీవ్ర గాయాలపాలైన భాను అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుమందు ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరలవుతోంది.
-
అందం కోసం సర్జరీ చేయించుకోమన్నారు: విద్యాబాలన్
నటి విద్యాబాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను సినిమా ఇండ్రస్టీలోకి వచ్చిన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘అందంకోసం దర్శకుడు నన్ను సర్జరీ చేయించుకోమని సూచించాడు. అయితే, అందం గురించి పట్టింపులు పెట్టుకోవద్దని నా తల్లిదండ్రులు చెప్పడంతో నేను సర్జరీ చేయించుకోలేదు’’ అని ఆమె చెప్పారు.
-
రాపర్ హిరాందాస్ మురళిపై లైంగిక వేధింపుల కేసు
కేరళకు చెందిన రాపర్ హిరాందాస్ మురళిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆగస్టు 2021 నుండి మార్చి 2023 వరకు తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఓ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ‘వేదన్’గా హిరాందాస్ మురళి ప్రసిద్ధి చెందాడు.