Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ ఎలా ఉందంటే?

    విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ‘‘కింగ్డమ్ సినిమా గాంగ్‌స్టర్ డ్రామా. బ్రదర్స్ ఎమోషన్స్ బాగా డీల్ చేశారు. గౌతమ్ తిన్ననూరి మార్కు డ్రామా, ఎమోషన్స్ ఉన్నాయి. టెక్నికల్‌గా సౌండ్‌గా రూపొందించారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా ఊహించుకోకండి. కొన్నిసార్లు ఈ సినిమా నడిచే విధానం చాలా స్టోగా ఉంటుంది. ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమా’’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

  • ‘కింగ్డమ్’.. విజయ్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

    విజయ్ దేవరకొండ హీరో బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కింగ్డమ్’ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ కోసం విజయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైనే చర్చ జరుగుతోంది. దీని కోసం ఈ రౌడీ హీరో దాదాపు రూ.30 కోట్ల వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ గత సినిమాల కంటే ఈ మూవీకే ఎక్కువ తీసుకున్నాడని సినీ వర్గాల సమాచారం.

  • హీరోయిన్ సమంత కీలక నిర్ణయం!

    టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ఏడాదికి రెండు చొప్పున సినిమాలు చేసేందుకు ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో లాగా కాకుండా.. ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక సమంత తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

  • రెహమాన్ కన్సర్ట్.. భారీగా టికెట్ ధరలు!

    మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ నవంబర్ 8న హైదరాబాద్‌లో గ్రాండ్ కన్సర్ట్ చేయనున్నారు. అయితే ఈ ఈవెంట్‌ టికెట్ ధరలు షాకవ్వాల్సిందే. ఎందుకంటే స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ధర రూ.1800 కాగా, ప్లాటినం సీటు రూ.4000, MIP జంట టికెట్లు రూ.13,000, ఫేజ్ 3లో కూర్చుని దగ్గరగా వీక్షించాలంటే రూ.24,000 చెల్లించాల్సిందే. ఫ్యాన్ పిట్ సెక్షన్‌లోకి వెళ్లాలంటే రూ.5,500 లేదా రూ.10,000 ఖర్చు చేయాల్సిందే.

  • తన నాలుగో పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు

    బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌కు రచయితగానూ పేరుంది. ఇప్పటి వరకు ఆయన మూడు పుస్తకాలను విడుదల చేశారు. తాజాగా ఆయన తన నాలుగో పుస్తకమైన ‘డిఫరెంట్‌ బట్‌ నో లెస్’ను బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకం తనకు చాలా ప్రత్యేకమని ఆయన అన్నారు. తన నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా దీన్ని రాశానని ఆయన వివరించారు.

  • కీర్తి సురేష్‌ అందాల ఆరబోత!

    హీరోయిన్ కీర్తి సురేష్‌ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రెండీ డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • ‘ఉస్తాద్’ను కలిసిన ‘కింగ్డమ్’ టీమ్.. పిక్ వైరల్!

    పవన్‌కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. జెట్‌స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‌లో ‘కింగ్డమ్’ టీమ్ సందడి చేసింది. ఇందులో పవర్‌స్టార్‌తో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీ, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలు కనిపిస్తున్నారు. ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ‘కింగ్డమ్’ రేపు విడుదలకు రాబోతుండగా.. ‘ఉస్తాద్‌’ను వచ్చే ఏడాదికి ప్లాన్ చేస్తున్నారు.

  • ‘అతడు’ రీ-రిలీజ్ ట్రైలర్‌ చూశారా?

    ‘రీ-రిలీజ్‌’ ట్రెండ్‌లో భాగంగా ‘అతడు’ మూవీ మరోసారి బాక్సాఫీసు ముందుకు రానుంది. మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ 4K వర్షన్‌లో ఆగస్టు 9న రీ-రిలీజ్ కానుంది. తాజాగా రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలోని డైలాగ్స్‌, పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. 2005లో ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

  • ఓటీటీలోకి హారర్ మూవీ.. ట్రైలర్ చూస్తే వణకాల్సిందే!

    హాలీవుడ్ హారర్ మూవీ ‘28 ఇయర్స్ లేటర్’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

  • హీరోయిన్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మూవీ టీమ్

    అడివిశేష్-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. కాగా మృణాల్‌కు చిత్రబృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆగస్టు 1న మృణాల్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా మూవీ సెట్స్‌లో ప్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. సెట్స్‌లో ఆమెతో కేక్‌ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.