Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘బోల్డ్‌గా ఉన్నంత మాత్రాన.. అలా చేసినట్టు కాదు’

    తన డ్రెస్సింగ్‌ స్టైల్‌పై వస్తున్న విమర్శలకు యంకర్, నటి అనసూయ ఘటుగా సమాధానిమిచ్చింది. ‘‘సోషల్‌‌మీడియాలో నన్ను లక్ష్యంగా వీడియోలు పెడుతున్నారు. నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. అవును.. నేను ఓ స్త్రీని, భార్యని, ఇద్దరు పిల్లలకు తల్లిని. నాకు ఇష్టమైన దుస్తులు ధరించడాన్ని ఆస్వాదిస్తా. నేను ఓ తల్లిగా ప్రవర్తించడంలేదని కొందరు ఆరోపిస్తున్నారు. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు’’ అని పోస్ట్‌లో పేర్కొంది.

  • 61 ఏళ్ల హీరోతో 22 ఏళ్ల హీరోయిన్ డేటింగ్!

    హాలీవుడ్ హీరో జానీ డెప్‌తో 22 ఏళ్ల హీరోయిన్ జెన్నా ఒర్టెగా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. కలిసి ఎంజాయ్ చేస్తున్నారని.. వెకేషన్స్‌లో జంటగా కనిపించారనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే దీని జెన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. 61 ఏళ్ల జానీ డెప్‌ను తాను ఎప్పుడూ కలవలేదని.. అతనితో పని చేయలేదని స్పష్టం చేసింది. దయచేసి అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని తెలిపింది.

  • స్టార్ హీరో మూవీకి థియేటర్ల కొరత!

    బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌-2’ విడుదలకు థియేటర్ల కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్, చిన్న థియేటర్లలో 60 శాతం లక్ష్యంగా ఈ సినిమాను విడుదల చేయాలని పంపిణీదారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో.. కేవలం 35 శాతంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  • తమిళ కమెడియన్ ‘పవర్ స్టార్’ శ్రీనివాసన్ అరెస్ట్

    కోలీవుడ్ హాస్యనటుడు ‘పవర్ స్టార్’ శ్రీనివాసన్ ను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వరదరాజన్ అనే వ్యక్తికి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ రుణం ఇప్పిస్తానని నమ్మించి శ్రీనివాసన్ అతడి వద్ద రూ.30లక్షలు కమీషన్ తీసుకున్నాడు. అయితే మోసపోయాయని భావించిన వరదరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై 2018 నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.

  • అందుకే ‘కింగ్‌డమ్’ ప్రీమియర్‌ లేదు: నాగవంశీ

    విజయ్‌ హీరోగా  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌గా తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్’. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ మూవీకి ముందురోజు ప్రీమియర్‌ లేదని స్పష్టం చేశారు. నైజాంలో ఉదయం 7 గంటల నుంచే షోలు ప్రారంభమవుతాయని, అందుకే ప్రీమియర్‌ అవసరం లేదని ఆయన తెలిపారు. కాగా ఈ చిత్రం రేపు విడుదల కానుంది.

  • ‘హరిహర వీరమల్లు’ 6వ రోజు కలెక్షన్లు ఇవే?

    పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం రిలీజైన 6వ రోజు రూ.1.50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. 5వ రోజు (రూ.2.60 కోట్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువని సినీవర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 53% (రూ.109.50 కోట్ల గ్రాస్‌) రికవరీ అయిందని పేర్కొన్నాయి.

  • నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా: విజయ్ దేవరకొండ

    ‘కింగ్డమ్’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడాడు. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పద్ధతిగా మాట్లాడుతున్నందుకు కారణమేంటని మీడియా ప్రశ్నించగా విజయ్‌ స్పందించాడు. ‘‘నేనెప్పుడూ నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా. ఈరోజు ఇలా మాట్లాడాలని అనిపిస్తోంది. ‘ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్‌ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి’ అన్న ఆలోచనలతో కెరీర్‌ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో’’ అని పేర్కొన్నాడు.

     

  • RAW vs ISI: ఆసక్తిగా ‘సారే జహా సే అచ్ఛా’ టీజర్‌

    ప్రతీక్‌ గాంధీ, సన్నీ హిందూజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సారే జహా సే అచ్ఛా’. సుమిత్‌ పురోహిత్‌ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ ఆగస్టు 13 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. భారత నిఘా విభాగమైన  RAW, పాకిస్థాన్‌కు చెందిన ISIల మధ్య సన్నివేశాలు సిరీస్‌లో కీలకం కానున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. 1970ల నేపథ్యంతో ఈ సిరీస్‌ రూపొందింది.

  • ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ!

    ఆహాన్ పాండే-అనీత్ పద్దా జంటగా నటించిన బాలీవుడ్ మూవీ ‘సైయారా’. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జులై 18న థియేటర్స్‌లోకి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 12న స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

  • Video: చిరుతో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు!

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన స్పెషల్ సాంగ్‌ షూటింగ్ జరుగుతోంది. ఇందులో చిరు పక్కన మౌనీరాయ్ స్టెప్పులు వేయనుంది. అయితే సాంగ్ షూట్ వీడియోలతో పాటు చిరుతో దిగిన పలు ఫొటోలను మౌనీరాయ్ తాజాగా తన సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ‘‘మెగాస్టార్ చిరంజీవి సర్ మీ పక్కన డ్యాన్స్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. (వీడియో)