Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘సుందరకాండ’ నుంచి మెలోడి సాంగ్

    నారా రోహిత్-శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘సుందరకాండ’. ఈమూవీ నుంచి ‘ప్లీజ్ ప్లీజ్ మ్యామ్’ సాంగ్‌ రేపు సా.4:03గంటలకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • జపాన్‌లో అక్కినేని నాగార్జునకు కొత్త పేరు!

    టాలీవుడ్ సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున జపాన్‌లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. అక్కడ ఆయనను అభిమానులు ప్రేమగా ‘నాగ్-సామ’ అని పిలుస్తున్నారు. జపనీస్ సంస్కృతిలో ‘సామ’ అనేది దేవుళ్లు, రాజవంశం లేదా ఉన్నత స్థాయి వ్యక్తులకు ఇచ్చే గౌరవ చిహ్నం. ‘బ్రహ్మాస్త్ర’ (హిందీ), ఇటీవల విడుదలైన ‘కుబేరా’ వంటి చిత్రాలు జపాన్ ప్రేక్షకులకు నాగార్జునను మరింత చేరువ చేశాయి.

     

  • కలెక్షన్లలో దూసుకెళ్తున్న “మహావతార్‌ నరసింహా”

    మైథలాజికల్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా ఐదు రోజుల్లో ₹30 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు  70 లక్షల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. హిందీలోనే దాదాపు ₹20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

  • ‘వార్‌-2’ ఫస్ట్ సాంగ్ ప్రోమో.. హృతిక్‌-కియారా రొమాన్స్!

    హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘వార్‌-2’. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలోని హృతిక్‌–కియారాలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్‌ రేపు విడుదల కానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

  • బెట్టింగ్‌ యాప్స్‌తో డబ్బు సంపాదించాలనుకోవద్దు: ప్రకాశ్‌రాజ్‌

    బెట్టింగ్‌ యాప్స్‌తో డబ్బు సంపాదించాలని ఎవరూ భావించవద్దని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. బెట్టింగ్‌ యాప్స్‌పై ప్రచారం కేసులో ప్రకాశ్‌రాజ్‌ విచారణ ముగిసింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం వ్యవహారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని చెప్పారు. ఇక నుంచి బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేయను అని తెలిపారు.

     

  • భారీ ర‌న్‌టైమ్‌తో రాబోతున్న సూపర్ స్టార్!

    ఆగ‌స్టులో రెండు పెద్ద సినిమాలు థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. ఒక‌వైపు ‘కూలీ’ అంటూ ర‌జ‌నీకాంత్ రాబోతుండ‌గా.. హృతిక్-ఎన్టీఆర్ ‘వార్-2’తో వస్తున్నారు. ఆగ‌స్టు 14న విడుదల కానున్న ఈ రెండు చిత్రాల మ‌ధ్య గ‌ట్టి పోటి నెల‌కొన‌బోతుంది. మ‌రోవైపు ఈ సినిమాల ర‌న్‌టైమ్‌కు సంబంధించి వార్త వైర‌ల్‌గా మారింది. ‘కూలీ’ 2 గంట‌ల 50 నిమిషాలతో రాబోతుంటే.. ‘వార్-2’ ఏకంగా 3 గంట‌ల ర‌న్‌టైంతో వస్తోందని తెలుస్తోంది.

  • ‘పరమ్‌ సుందరి’ వచ్చేస్తోంది.. బ్యూటీఫుల్ సాంగ్ రిలీజ్

    జాన్వీకపూర్‌-సిద్ధార్థ్‌ మల్హోత్రా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్‌ సుందరి’. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అలాగే ఈ చిత్రంలోని ‘పరదేశియా’ అనే సాంగ్‌ను కూడా యూట్యూబ్‌ వేదికగా రిలీజ్ చేశారు. ఈ పాటలో జాన్వీ-సిద్ధార్థ్‌ జోడీ ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.

  • ‘రూ.125 కోట్ల కంటే వాళ్ల ప్రేమే నాకు ముఖ్యం’

    ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ ఆగస్టు 1 నుంచి రూ.100 అద్దె ప్రాతిపదికన యూట్యూబ్‌ ఛానల్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ కంపెనీలు ఇచ్చే రూ.125 కోట్ల కంటే ఆడియన్స్ ఇచ్చే రూ.100 నాకు ఎక్కువ. వాళ్ల ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం. నా సినిమా నచ్చితే వాళ్లు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.

  • ‘కింగ్డమ్‌’కు ఫస్ట్ అనుకున్న హీరో ఆయనే!

    విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘కింగ్డమ్’. రేపు ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ అనుకున్న హీరో రామ్‌చరణ్ అని గౌతమ్ తెలిపారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌కు కింగ్డమ్ కథను వినిపించామని, ఆయన కూడా సినిమా చేయడానికి అంగీకరించారని చెప్పారు. కానీ పలు కారణాల వల్ల రామ్‌చరణ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని తెలిపారు.

    కి

  • హిట్ అండ్ రన్ కేసు.. నటి అరెస్ట్

    గౌహతిలో 21 ఏళ్ల విద్యార్థిని బలిగొన్న హిట్ అండ్ రన్ కేసులో అస్సామీ నటి నందిని కశ్యప్‌ అరెస్ట్ అయ్యారు. జూలై 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గౌహతిలోని దఖింగావ్ ప్రాంతంలో నందిని నడుపున్న కారు సమియుల్ హక్‌(21)ను ఢీకొట్టింది. దీంతో అతడు చనిపోయాడు. హిట్ అండ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిన్న రాత్రి నటి నందినిని అదుపులోకి తీసుకున్నారు.