బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్‌రావు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. 2017లో ఆయన నటించిన ‘బెహెన్ హోగీ తేరి’ సినిమాలో శివుడు చెప్పులు వేసుకుని ఉన్న సన్నివేశంపై ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో జలంధర్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే విచారణలో భాగంగా నిన్న కోర్టుకు రాజ్‌కుమార్‌రావు హాజరుకాలేదు. దీనిపై మండిపడిన కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె తప్పదా?
ఆగస్టు 1 నుంచి సినీ కార్మికుల సమ్మె అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు చర్చలు విఫలమయ్యాయి. ప్రతి మూడేళ్లకోసారి 30% పెంపు నిబంధన జూన్ 30తో ముగియగా, ఛాంబర్ 5% మాత్రమే పెంచుతామని ప్రతిపాదించింది. దీనికి ఫెడరేషన్ అంగీకరించలేదు. రేపు జరిగే చర్చల్లో సమస్య కొలిక్కి రాకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
-
విజయ్ దేవరకొండ ఆసక్తికర ట్వీట్
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ ‘కింగ్డమ్’. ఈ నెల 31న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్‌కు ఒకరోజే ఉన్నందుకు విజయ్ దేవరకొండ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘సూరీ చాలా కోపంగా ఉన్నాడు. కానీ మీ అందరి ప్రేమ, సపోర్ట్ వల్ల నేను మాత్రం ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను. రేపు సినిమాలో కలుద్దాం’’ అని పేర్కొన్నారు.
-
మరో సినిమాను ప్రకటించిన రిషభ్ శెట్టి
‘కాంతార’ స్టార్ రిషభ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కొత్త సినిమా తెరకెక్కనుంది. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రానున్నట్లు సంస్థ వెల్లడించింది.
-
67 ఏళ్ల నటుడితో 37 ఏళ్ల నటి ప్రేమాయణం!
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, నటి అనాడి అర్మాస్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ కొద్దిరోజులుగా హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 63 ఏళ్ల టామ్.. 37 ఏళ్ల అనాతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్దరూ లండన్‌లో చేతులు పట్టుకుని కలిసి నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకురింది.
-
పృథ్వీరాజ్ సుకుమారన్ భార్యకు వేధింపులు
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మేనన్‌ను ఓ మహిళ వేధిస్తోంది. గత ఏడేళ్లుగా వేధిస్తున్నట్లు సుప్రియ తెలిపారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో ఆమె అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందని సుప్రియ చెప్పారు. ఈ వేధింపులు 2018 నుంచే జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. చాలా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వేధిస్తోందని చెప్పారు.
-
శ్రీవారి సన్నిధిలో గాలి జనార్దన్‌రెడ్డి కుటుంబం
తిరుమల శ్రీవారిని గాలి జనార్దన్‌రెడ్డి కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. ఇటీవల జనార్ధన్‌రెడ్డి కొడుకు కిరీటి నటించిన ‘జూనియర్’ సినిమా విజయం సాధించిన సందర్భంగా శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. ‘‘శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరో రెండు వారాల్లో నా సెకండ్ ప్రాజెక్ట్ ప్రకటిస్తా. పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ నా స్ఫూర్తి’’ అని కిరీటి తెలిపారు.
-
నాగార్జున నన్ను 15 సార్లు కొట్టారు: ‘చంద్రలేఖ’ హీరోయిన్
1998లో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘చంద్రలేఖ’. మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఇషా గుర్తుచేసుకున్నారు. ‘‘చంద్రలేఖ’లో నాగార్జున నన్ను కోపంగా కొట్టే సన్నివేశం ఉంటుంది. సీన్ బాగా రావడానికి నిజంగానే కొట్టమని ఆయనతో చెప్పా. దీంతో 15 సార్లు చెంపపై గట్టిగా కొట్టారు. సన్నివేశం అయ్యాకచూస్తే.. మొహమంతా కందిపోవడంతో నాగార్జున క్షమాపణలు చెప్పారు’’ అని తెలిపారు.
-
ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
HYD: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. Jungle Rummy బెట్టింగ్ యాప్‌ను గతంలో ప్రకాశ్ రాజ్ ప్రమోట్ చేశారు. దీంతో ఆయనకు 10 రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసింది. తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో తన అడ్వకేట్‌తో కలిసి ప్రకాశ్ రాజ్ ఈడీ ఎదుట హాజరయ్యారు.