Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నటుడు సోనూ సూద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

    సినీ నటుడు సోనూ సూద్‌కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోనూ సూద్ నిస్వార్థ దాతృత్వాన్ని, అవసరం ఉన్నవారికి ఆయన అందిస్తున్న సాయాన్ని సీఎం కొనియాడారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలకు సోనూ సూద్ చేసిన సాయం ఉపయోగపడిందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరం ఆనందం, ఆరోగ్యం.. మార్పును కొనసాగించడానికి నిరంతర శక్తితో నిండి ఉండాలని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.

     

  • ఆ పనులకు సమయం పడుతుంది: అనుపమ్ ఖేర్

    జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. దీనిపై నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ‘‘మన పౌరులు 26 మందిని దారుణంగా చంపిన నేరస్థులను అంతం చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు. దీనికి సమయం పడుతుంది అనుకున్నాను. రాత్రికి రాత్రే ఇలాంటివి జరగవు. సాయుధ దళాల వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పుడు దేశమంతా గర్విస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.

  • హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం

    టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి విమల్‌కుమార్ రాజ్‌పుత్(67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన జులై 28న మరణించారు. కాస్త ఆలస్యంగా ఆ విషయాన్ని పాయల్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. అన్నవాహిక క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. కానీ, తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఎమోషనల్ అయ్యింది.

  • HHVM మూవీని మేమే ప్రమోట్ చేస్తాం: మంత్రి

    AP: పవన్ కల్యాన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్ మా అధ్యక్షుడు. ఆయన సినిమాను మేమే ప్రమోట్ చేస్తాం. ఇది హిస్టారికల్ సినిమా. ఆ సబ్జెక్ట్ ప్రజల్లో వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని ప్రమోట్ చేస్తున్నాం’’ అని తెలిపారు.

  • బీచ్‌లో కుప్పకూలి నటుడు మృతి

    ప్రముఖ ఇజ్రాయెల్ నటుడు అలోన్ అబుత్బుల్ (60) కన్నుమూశారు. హైఫా సమీపంలోని బీచ్‌లో ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. నీటి నుండి బయటకు వచ్చిన అబుత్బుల్.. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి.. అకస్మాత్తుగా ఇసుక మీద కుప్పకూలియారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతో సంఘటనా స్థలంలోనే చనిపోయినట్లు పలు వార్తా పత్రికలు తెలిపాయి.

  • హనీమూన్ మర్డర్ కేసుపై సినిమా!

    మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై ఎస్పీ నింబావత్ దర్శకత్వంలో ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. దీనిపై మృతుడు రాజా రఘువంశీ సోదరుడు సచిన్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి మేము మా సమ్మతిని ఇచ్చాము. నా సోదరుడి హత్య కథను తెరపైకి తీసుకురాకపోతే ఎవరు సరైనది, ఎవరు తప్పు అని ప్రజలు తెలుసుకోలేరని మేము భావిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.

  • హిందీ సినిమాలు విషయంలో నేను దివ్యాంగుడిని: మురుగదాస్‌

    హిందీ సినిమాల విషయంలో తనకు ఏమీ తెలియదని దర్శకుడు మురుగదాస్‌ అన్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘మదరాసి’ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘హిందీ విషయంలో నాకు ఏమీ అర్థం కాదు. నేను స్క్రిప్ట్‌ ఇస్తాను. దాన్ని వాళ్లు ఇంగ్లిష్‌లోకి తర్వాత హిందీలోకి అనువదిస్తారు. డైలాగుల విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. అందుకే హిందీ సినిమాలకు వర్క్‌ చేసే సమయంలో నేను దివ్యాంగుడిని అవుతాను’’ అని పేర్కొన్నారు.

  • ‘సైయారా’ విజయంపై ఆమిర్‌ ఖాన్‌ రియాక్షన్ ఇదే..

    ‘సైయారా’ చిత్రం విజయంపై బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్‌ స్పందించారు. ఆ సినిమా విజయం తనను ఆశ్చర్యపరచలేదని చెప్పారు. నటన, చిత్ర బృందం కృషి, బలమైన కథాంశం ఈ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కొత్త నటులే ఎక్కువగా ఉన్నప్పటికీ పలు స్టార్ హీరోల చిత్రాల రికార్డులను బద్దలుకొట్టింది.

  • నేడు ఈడీ విచారణకు ప్రకాశ్ రాజ్

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా నటుడు ప్రకాశ్ రాజ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వ్యవహారంపై ప్రకాశ్ రాజ్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

  • ఎప్పుడూ నా పెళ్లి గోలేనా?: నిత్యా మేనన్

    విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా ‘తలైవా తలైవి’ సినిమా ‘సార్‌ మేడమ్‌’ టైటిల్‌తో ఆగస్టు 1న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన పెళ్లిపై నిత్యా మేనన్‌కు ప్రశ్న ఎదురైంది. దీంతో ‘‘ఎప్పుడూ నా పెళ్లి గోలేనా’’ అంటూ కొంచెం అసహనానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.