Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మొదటి లవ్ స్టోరీగా ‘సైయారా’ రికార్డు

    మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన లవ్‌ స్టోరీ ‘సైయారా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు కలెక్షన్లు సాధించింది. అలాగే, భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమ కథగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ రూ.404 కోట్లతో ‘కబీర్ సింగ్’, ‘ఆషికీ 2’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘ఏక్ విలన్’ సినిమాలను దాటేసింది.

  • ‘మహావతార్‌ నరసింహ’.. ఆలయాలుగా మారిన థియేటర్లు!

    ‘మహావతార్‌ నరసింహ’ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాను ఆస్వాదిస్తున్నారు. థియేటర్లు ఆలయాలను తలపిస్తున్నాయి. హాల్‌ బయటే చెప్పులను వదిలేసి సినిమా చూస్తున్నారు. నరసింహుడి అవతారం, గర్జన చూసి పరవశించి పోతున్నారు. కొందరు తబలాలతో థియేటర్లలోకి వెళ్తూ భజనలు చేస్తున్నారు. సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

  • ‘విశ్వంభర’కు ఆ సినిమా స్ఫూర్తి: వశిష్ట

    మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు కీలు గుర్రం సినిమా స్ఫూర్తి వశిష్ట చెప్పారు. “విశ్వంభరలో కనిపించే రెక్కల గుర్రం కీలు గుర్రం నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నాను. రెక్కల గుర్రం అనేది హాలీవుడ్‌ కాన్సెప్ట్‌ కాదు. మన పురాణాల్లోనే ఉంది. సాగరమథనం జరిగిన సమయంలో రెక్కల గుర్రం వచ్చిందని చెబుతారు’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

  • సరికొత్త చరిత్ర.. రూ.404 కోట్ల కలెక్షన్లు

    మోహిత్‌ సూరి దర్శకత్వంలో ఆహాన్‌ పాండే, అనీత్‌ పడ్డా జంటగా నటించిన చిత్రం ‘సైయారా’ .  ఈ నెల 18న విడుదలై సరికొత్త చరిత్రసృష్టించింది.  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.404 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ట్వీట్‌ చేసింది. ఇండియాలో రూ.318 కోట్ల గ్రాస్‌, విదేశాల్లో రూ.86 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిపింది.

  • దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు: రకుల్‌ ప్రీత్

    సినిమా సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాసేవారు, సోషల్‌ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతూ ఎంజాయ్‌ చేసే వారంతా తనదృష్టిలో పనికిమాలిన వాళ్లేనని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. “సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ మన దేశంలో చాలా మందికి ఎలాంటి పనిలేదు. ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడటం, పిచ్చిపిచ్చి కామెంట్లు చేయడం అలవాటుగా మారిపోయింది,” అని తెలిపారు.

  • ట్రెడిషనల్ లుక్‌లో ఐశ్వర్య..నెటిజన్లు ఫిదా

    హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చీరలో ఫొటోను పంచుకుంది. ఇందులో పట్టుచీర.. ఆకట్టుకునే ఆభరణాలు ధరించిన ఈ పిక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.

  • ఇండస్ట్రీలో నా కొడుకును తొక్కేస్తున్నారు: స్టార్ హీరో

    తన కుమారుడు అహాన్‌‌శెట్టి సినీపరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాల గురించి బాలీవుడ్ స్టార్ సునీల్‌శెట్టి మాట్లాడారు. ‘బోర్డర్-2’ మూవీ కోసం అహాన్‌ సంతకం చేసిన తర్వాత.. అతడిని చాలా ప్రాజెక్టుల నుంచి కావాలనే పక్కనపెట్టారని సునీల్‌శెట్టి ఆరోపించారు. ‘‘గతంలో నేను ఏదో తప్పుచేసి ఉంటాను.. అందుకే వారు అహాన్‌ను లక్ష్యంగా చేసుకుని కొన్ని సినిమాల నుంచి తొలిగించినట్టుంది’’ అని సునీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

  • 29 రోజులు మాత్రమే.. ‘మాస్ జాతర’పై క్రేజీ అప్‌డేట్!

    మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న మూవీ ‘మాస్ జాతర’. తాజాగా సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘‘మాస్ జాతర’ కోసం రవితేజ డబ్బింగ్ ప్రారంభమైంది.. కేవలం 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. ఆగస్టు 1వ వారం నుండి భారీ అప్‌డేట్‌లు లోడ్ అవుతున్నాయి’’ అంటూ రవితేజ డబ్బింగ్ చెప్తున్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు.

  • ‘కింగ్డమ్‌’.. జోరుగా టికెట్ బుకింగ్స్!

    విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్‌’ ఈనెల 31న రిలీజ్‌కానుంది. బుక్ మై షోలో 100kపైగా టికెట్స్ అమ్ముడైనట్లు మేకర్స్ తాజాగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ వదిలారు.

  • మోసపూరిత ప్రకటనలపై బాలయ్య వార్నింగ్

    బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో మోసపూరిత ప్రకటనలు వస్తున్నాయని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ హెచ్చరించారు. ‘బంగారు బాలయ్య-బసవతారకం ఈవెంట్’ పేరుతో అశ్విన్ అట్లూరి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వాటికి తన అనుమతిలేదని, ఈ ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఆసుపత్రికి సంబంధించి ఏ సమాచారం కావాలన్నా నేరుగా ఆసుపత్రిని సంప్రదించాలని ట్వీట్ చేశారు.