Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘రాజాసాబ్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్.. ఫొటో వైరల్!

    హీరో ప్రభాస్‌-దర్శకుడు మారుతి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘రాజాసాబ్‌’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అయితే ఈ మూవీ సెట్స్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి సందడి చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ‘రాజాసాబ్’ డిసెంబర్‌ 5న విడుదలకానుంది.ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

  • రజనీ ‘కూలీ’.. కాపీ అంటూ నెట్టింట ట్రోల్స్!

    రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కూలీ’. ఈ సినిమా ఆగస్టు 14న విడుదలకానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ఆగస్టు 2న రాబోతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది. దానికి కారణం ఏంటంటే.. హాలీవుడ్ సినిమా ‘మాడ్ ఆమె వెబ్’ పోస్టర్‌ను కాపీ పేస్ట్ చేసి రిలీజ్ చేశారని నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు.

  • చీరలో మెరిసిపోతున్న అందాల నిధి!

    హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్ స్టాలో బ్యూటీఫుల్ ఫొటో షేర్ చేసింది.అందులో ఈ బ్యూటీ గోల్డ్ కలర్ చీరలో హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది.

  • Video: ‘మా కూతురును చూస్తుంటే గర్వంగా ఉంది’

    తన కుమార్తె నైసాను చూస్తుంటే గర్వంగా ఉందని అజయ్‌ దేవ్‌గణ్‌, కాజోల్‌ అన్నారు. నైసా గ్రాడ్యుయేషన్‌ డే వేడుకకు హాజరైన వారు ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘చాలా ప్రత్యేకమైన సందర్భం. గర్వంగా ఉంది. ఎమోషనల్‌’’ అని పేర్కొన్నారు. 22 ఏళ్ల నైసా స్విట్జర్లాండ్‌లోని విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్‌ హాస్పిటాలిటీలో బీబీఏ డిగ్రీ పట్టా పొందింది. (వీడియో)

  • ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ కీలక ప్రకటన!

    కలెక్షన్లపై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ఆసక్తికర పోస్టర్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

  • ఓటీటీలో మరో స్పై థ్రిల్లర్‌.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్!

    ఓటీటీలోకి మరో స్పై థ్రిల్లర్‌ ‘సలాకార్‌’ సిరీస్‌ రాబోతోంది. ఈ సిరీస్‌ ఆగస్టు 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు, ఇతర భారత భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో హాట్‌స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. మౌని రాయ్, నవీన్‌ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ‘సలాకార్‌’కు ఫరూక్‌ కబీర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

     

  • ‘మదరాసి’ ఫస్ట్ సాంగ్.. ఇంట్రెస్టింగ్ ప్రోమో!

    శివ కార్తికేయన్-రుక్మిణి వసంత్ జంటగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మదరాసి’. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా..సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా శివ కార్తికేయన్ ‘మదరాసి’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయినట్లు ప్రకటించాడు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘సిలంబల’ ప్రోమో రిలీజ్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు. ఇక పూర్తి పాట జులై 31న సా.6గంటలకు విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు.

  • ‘కూలీ’.. తెలుగులో ‘పవర్‌హౌస్‌’ సాంగ్‌ రిలీజ్

    రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ‘కూలీ’. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సాంగ్స్‌ను రిలీజ్‌ చేసిన చిత్ర బృందం.. మూడో పాట ‘పవర్‌హౌస్‌’ తెలుగు లిరికల్‌ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

  • సిద్ధుతో లవ్‌లో పడిపోతారు: రాశీ ఖన్నా

    ‘తెలుసు కదా’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ అందరికీ నచ్చుతుందని హీరోయిన్ రాశీఖన్నా తెలిపింది. ‘‘సిద్ధు సినిమాల్లో అందరికీ ‘డీజే టిల్లు’ నచ్చుతుంది. కానీ, ‘తెలుసు కదా’ చూశాక సిద్ధుతో లవ్‌లో పడిపోతారు’’ అని రాశీ వెల్లడించింది. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘తెలుసు కదా’. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్ వేడుకలో రాశిఖన్నా మాట్లాడింది.

  • ఆమిర్‌ఖాన్‌ కీలక నిర్ణయం.. యూట్యూబ్‌లోకి కొత్త సినిమా!

    బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ జూన్‌లో థియేటర్లలో విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని ఆగస్టు 1 నుంచి రూ.100 రెంట్‌తో యూట్యూబ్‌లో చూడొచ్చని హీరో ఆమిర్ తాజాగా వెల్లడించారు. తన సినిమాను ఓటీటీకి విక్రయించనని ఆయన గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (వీడియో)