Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఫ్యాన్స్‌కు హీరో కిచ్చా సుదీప్ కీలక విజ్ఞప్తి!

    హీరో కిచ్చా సుదీప్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు(సెప్టెంబర్ 2న) ఇంటిముందుకు వచ్చి నానా రబస చేయోద్దని సూచించాడు. ‘‘ప్రతిసారీ మీతో నా పుట్టిన రోజును జరుపుకుంటాను. కానీ ఈ సారి ఇది చాలా కష్టం. ఎందుకంటే నా తల్లి లేని మొదటి సంవత్సరం నా తల్లి లేకుండా ఈ వేడకను ఊహించుకోవడం నాకు కష్టంగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చాడు.

  • ఆకట్టుకునేలా మోహన్‌లాల్‌ ‘హృదయపూర్వం’ ట్రైలర్‌

    మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హృదయపూర్వం’. మాళవికా మోహనన్‌, సంగీత్‌ ప్రతాప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేసింది.

  • ఈనెల 29న ‘బ్రహ్మాండ’ రిలీజ్

    టాలీవుడ్‌లో మొట్ట మొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘బ్రహ్మాండ’. ఆమని, బన్నీ రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దాసరి సురేష్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 29న రిలీజ్ కాబోతుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ.. ‘‘స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాం. ముఖ్యంగా ఆమని, బలగం జయరాం, సహకారం మరవలేము’’ అని చెప్పారు.

     

  • శ్రీదేవి ఆస్తి కోసం కోర్టుకెక్కిన బోనీకపూర్‌

    తన భార్య, దివంగత నటి శ్రీదేవి ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీకపూర్‌ కోర్టును ఆశ్రయించారు. వారు చట్టవిరుద్ధంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని.. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలూకా తహసీల్దార్‌ను జస్టిస్‌ ఆనంద్‌ ఆదేశించారు.

  • ‘బాహుబలి:ది ఎపిక్‌’ టీజర్‌ రిలీజ్ వచ్చేసింది

    ‘బాహుబలి:ది బిగినింగ్‌’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాల్ని.. ఈసారి ‘బాహుబలి:ది ఎపిక్‌’ పేరుతో ఒకే భాగంగా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. ‘బాహుబలి: ది ఎపిక్‌’కు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

  • అందుకే గ్యాప్‌ వచ్చింది: ఉదయభాను

    యాంకర్, నటి ఉదయభాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘ఇన్ని రోజులు మంచి పాత్రలు, స్క్రిప్ట్‌ వినగానే ఓకే చెప్పాలి అనిపించే కథలు రాలేదు. కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చింది. కానీ, వాటిల్లో కొన్ని సన్నివేశాలు నచ్చక రిజెక్ట్‌ చేశాను. అందుకే గ్యాప్‌ వచ్చింది. ‘త్రిబాణధారి బార్బరిక్‌’ నెరేషన్‌ చేసేటప్పుడే కళ్లకు కట్టినట్లు చూపించారు.వెంటనే ఓకే చెప్పా’’ అని చెప్పుకొచ్చింది.

  • మెగాస్టార్ కొత్త మూవీ టీజర్ వచ్చేస్తోంది

    మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న ‘కలమ్ కవల్’ మూవీ టీజర్ రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆగస్టు 28న విడుదల కాబోతున్న కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా’ థియేటర్స్‌లో ఈ టీజర్‌ను ప్రసారం చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సినిమాకు జితిన్ కె జోస్ దర్శకత్వం వహిస్తుండగా.. వినాయకన్ విలన్‌గా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌‌లో మమ్ముట్టి నిర్మిస్తున్నారు.

     

     

  • ‘మిరాయ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

    తేజా సజ్జా-మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబరు 12న విడుదల కానున్న ఈమూవీ ట్రైలర్ ఈనెల 28న రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • సచిన్ మెచ్చిన సౌత్ మూవీ ఏంటో తెలుసా?

    క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు ఈ మధ్య రిలీజైన ఓ తమిళ సినిమా బాగా నచ్చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. రీసెంట్‌గా రెడిట్‌లో ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఇందులో సినిమాల గురించి అడగ్గా.. ఈ మధ్య కాలంలో తనకు ‘3బీహెచ్‪‌కే’ అనే చిత్రం నచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో సిద్ధార్థ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

  • హీరో జయం రవిపై ఆర్తి ఆసక్తికర పోస్ట్‌!

    భార్య ఆర్తితో జయం రవి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రవి తన స్నేహితురాలు, గాయని కెనీషాతో కలిసి తిరుమల వెళ్లడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఆర్తి ఆసక్తికర పోస్ట్‌ చేసింది. ‘‘నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ, దేవుడిని మోసం చేయలేవు’’ అని స్టోరీలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.