Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘విశ్వంభర’లో ఐదుగురు హీరోయిన్స్‌.. డైరెక్టర్ క్లారిటీ

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విశ్వంభర’. తాజాగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ఇందులో ఐదుగురు హీరోయిన్స్‌ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మెయిన్‌ హీరోయిన్ త్రిష, సెకండ్‌ లీడ్‌ ఆషిక వాళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. విడిగా నటీమణులు కొన్ని పాత్రల్లో కనిపిస్తారు. స్క్రీన్‌పై వీళ్లందరూ చాలా ఫ్రెష్‌గా ఉంటారు’’ అని చెప్పారు. (వీడియో)

     

  • ఓటీటీలోకి క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్‌

    వెట్రి, దియా మయూరి, ‘కేజీయఫ్‌’ రామచంద్ర రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రెడ్‌ శాండిల్‌వుడ్‌’. గురు రామానుజం దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఈటీవీ విన్‌’లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

  • ఆ రూమర్స్‌పై మల్లికా శెరావత్‌ క్లారిటీ

    సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా ‘బిగ్‌బాస్‌-19’ (హిందీ) త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్‌ కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. దానిపై మల్లిక తాజాగా స్పందించింది. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లడం లేదంటూ ఆ ప్రచారాన్ని ఖండించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

  • ఎమ్మెల్యే మల్లారెడ్డి నాకు స్పూర్తి: తమన్‌

    సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ చిత్రానికి తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మల్లిక గంధ…’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటను సోమవారం విడుదల చేశారు. మల్లారెడ్డి కాలేజ్‌లో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో తమన్‌ మాట్లాడారు. ఎమ్మెల్యే మాల్లారెడ్డి అంటే తనకు స్పూర్తి అని తెలిపాడు.

  • భారీగా తగ్గిన ‘హరిహర వీరమల్లు’ వసూళ్లు!

    పవన్‌‌కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ 5వ రోజు వసూళ్లు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ రావడం, వీక్‌ డేస్‌ కావడం, అటు ‘మహావతార్‌ నరసింహా’ హిట్‌ టాక్‌తో దూసుకెళ్లడం ‘హరిహర వీరమల్లు’ కలెక్షన్లపై ప్రభావం చూపించాయని సమాచారం. కాగా ప్రపంచవ్యాప్తంగా HHVM 5వ రోజు రూ.2.60 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

  • ‘బాహుబలి’ వెబ్‌సిరీస్‌ ఆగిపోవడంపై.. దర్శకుడు క్లారిటీ!

    తాను దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ వెబ్‌సిరీస్‌ ఆగిపోవడంపై దేవ కట్టా స్పందించారు. ‘‘రాజమౌళి విజన్‌తోనే భారీ తరహాలో ఆ సిరీస్‌ను ప్రారంభించాం. దాదాపు దశాబ్దం పాటు చేయాల్సిన ప్రాజెక్టు అది. స్క్రిప్టు రాయడానికే టీమ్‌కు చాలా సమయం పట్టేది.. ‘మనం సరైన దారిలో వెళ్లడం లేదేమో’ అని ఒకానొక దశలో అందరం అనుకున్నాం. ఆపేయడమే బెటర్‌ అనే నిర్ణయానికొచ్చాం’’ అని తెలిపారు.

  • ‘సార్ మేడమ్‌’ నుంచి సాంగ్ విడుదల

    విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రల్లో పాండిరాజ్‌ తెరకెక్కించిన సినిమా ‘సార్‌ మేడమ్‌’. తాజగా ఈ చిత్రం నుంచి ‘మిఠాయ్ పొట్లం’ అనే సాంగ్‌ని విడుదల చేశారు. కాగా ఈ సినిమా ఆగష్టు 1న రిలీజ్ కానుంది.

  • నటి రమ్యకు కన్నడస్టార్‌ శివరాజ్‌కుమార్‌ మద్దతు

    నటుడు దర్శన్ అభిమానులు తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారంటూ నటి రమ్య (దివ్య స్పందన) ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి రమ్యకు కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌కుమార్‌ మద్దతుగా నిలిచారు. ‘‘రమ్యకు వ్యతిరేకంగా  పెడుతున్న పోస్టులు, వాడిన పదాలను నేను ఖండిస్తున్నా. నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది రమ్య. నీకు మేమంతా సదా తోడుగా ఉంటాము’’అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

     

  • ‘అతడిని కిడ్నాప్‌ చేసి నాతోపాటే ఉంచుకోవాలనుంది’

    చెన్నైలో జరిగిన ‘కింగ్డమ్‌’ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో హీరో విజయ్‌ దేవరకొండ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘అనిరుధ్‌ ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ దీని పనుల్లోనే బిజీగా ఉన్నాడు. అతడిని కిడ్నాప్‌ చేసి నాతోపాటే ఉంచుకోవాలని ఉంది. ఈ సినిమా విషయంలో నేను చెప్పిన అప్‌డేట్స్‌ కంటే అనిరుధ్‌ చెప్పినవే వైరల్‌ అయ్యాయి’’ అని తెలిపాడు.

  • ఫిల్మ్ ఛాంబర్‌లో రచ్చ రచ్చ

    హైదరాబాద్‌లోని  ఫిల్మ్ ఛాంబర్‌ లో  సినారె(సింగిరెడ్డి నారాయణ రెడ్డి) 94వ జయంతి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి.  సినారె ఫోటోస్, పోస్టర్స్ పెట్టలేదని ఆయన అభిమానులు వివాదానికి దిగారు. దీంతో  ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్‌‌‌‌కు, సినారె అభిమానులకి మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. ఒకరినొకరు దాడి చేసుకోవడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  దీనిపైన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.