Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఫ్యాషన్‌ ఈవెంట్‌లో మెరిసిన జాన్వీ.. పిక్స్ వైరల్!

    బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది. న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో జరుగుతున్న హ్యుందాయ్‌ ఇండియా కౌచర్‌ వీక్‌ 2025లో సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ జయంతి రెడ్డి రూపొందించిన పింక్‌ కలర్‌ లెహంగాలో ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

     

  • ‘వార్-2’ ఫస్ట్ సాంగ్ రెడీ.. రొమాంటిక్ పోస్టర్ రిలీజ్

    హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వార్-2’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ కియారా బర్త్‌డే స్పెషల్‌గా జులై 31న రిలీజ్ కానుంది. ఈమేరకు హృతిక్-కియారా రొమాంటిక్ పోస్టర్ వదిలారు.

  • థాంక్యూ సూర్య అన్న: విజయ్‌ దేవరకొండ

    హీరో విజయ్‌ దేవరకొండ ‘కింగ్డమ్‌’తో ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ-రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో విజయ్‌ మాట్లాడుతూ.. హీరో సూర్యకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇస్తారా అని అడగ్గానే అంగీకరించారని విజయ్ తెలిపాడు.‘‘ఆయన పవర్‌ఫుల్‌ వాయిస్‌ టీజర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చేసింది. థాంక్యూ సూర్య అన్న’’ అని అన్నాడు.

  • ‘మహావతార్‌ నరసింహ’ చూసిన ప్రభాస్‌..

    ‘మహావతార్‌ నరసింహ’ సినిమాను ప్రభాస్ చూశారు. ‘‘పవర్‌ఫుల్‌ విజన్‌తో ‘మహావతార నరసింహ’ను వాస్తవంలోకి తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్స్‌కు శుభాకాంక్షలు. సినిమా నాకెంతో నచ్చింది. యానిమేషన్‌ రూపంలో తీర్చిదిద్దిన యాక్షన్‌ సన్నివేశాలు, కథాగమనం అద్భుతంగా ఉన్నాయి. ఈ అపురూప విజయం సాధించిన దర్శకుడు అశ్విన్‌కుమార్‌, చిత్ర బృందానికి అభినందనలు’’ అని పేర్కొన్నారు.

     

  • పురాణ చిత్రాలకు హిందీ ప్రేక్షకులు ఫిదా

    పురాణకథలకు హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘కార్తికేయ 2’, ‘కాంతార’ వంటి చిత్రాల తర్వాత ఇప్పుడు ‘మహావతార్: నరసింహ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ₹14.70 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు ₹1.40 కోట్లు రాగా, ఆదివారం ఒక్కరోజే ₹6.50 కోట్లు సాధించింది. సోమవారం కూడా ₹3.60 కోట్లు రాబట్టింది. పూర్తి సినిమాను విజువల్‌ ఎఫ్టెక్స్‌తో తీర్చిదిద్దడంతో 3డీ వెర్షన్‌కు డిమాండ్‌ తారస్థాయిలో ఉంది.

  • సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్.. ‘రాజాసాబ్’ స్పెషల్ పోస్టర్

    ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజాసాబ్’ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, నేడు సంజయ్ దత్తు బర్త్ డే. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ మూవీలోని ఆయన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.

  • 90s Re Union.. ఫొటోలు వైరల్

    90వ దశకంలో స్టార్ డమ్ పొందిన సినీ ప్రముఖులు కూడా ప్ర‌తి ఏడాది ఒకే చోట కలుసుకొని రీయూనియన్ పార్టీ చేసుకోవడం ఒక ట్రెడిషన్‌గా మారిపోయింది. ఈ ఏడాది ఆ ప్రత్యేక సమ్మేళనానికి గోవా వేదిక అయింది. ఈ పార్టీకి సిమ్రాన్, సంగీత, సంఘవి మీనా, మహేశ్వరి, శ్రీకాంత్, జగపతిబాబు హాజరయ్యారు. అలాగే డైరెక్టర్లు శంకర్, కె.ఎస్. రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా, కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ప్రభుదేవా హాజరై తీపి జ్ఞాప‌కాల‌ని నెమ‌ర‌వేసుకున్నారు.

     

  • రూ.300 కోట్ల క్లబ్‌కు చేరువలో ‘సైయారా’

    మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్‌ పాండే, అనీత్‌ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.260 కోట్లకు పైగా వసూలు చేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇది రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నెల 18న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

     

  • నవ్వులు పూయిస్తోన్న ‘సతీ లీలావతి’ టీజర్‌

    లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ ప్రధానపాత్రల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి.  తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా దీని టీజర్‌ను టీమ్‌ విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో వచ్చే కౌంటర్స్‌, సరదాగా సాగే పంచ్‌లతో ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.  మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే దీని విడుదల తేదీని ప్రకటించనున్నారు.

  • డేవిడ్ వార్నర్‌కు రాజమౌళి స్పెషల్ గిఫ్ట్

    తాను ‘బాహుబలి’ వేషధారణలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆస్ట్రేలియ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ షేర్ చేశారు. ఆ ఫోటలోపై బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ‘‘హాయ్ వార్నర్.. మీరు నిజమైన మాహిష్మతి రాజులా దుస్తులు ధరించే సమయం వచ్చింది. మీకు రాయల్ హెల్మెట్ పంపుతున్నాను!’’ అంటూ రాజమౌళి పేర్కొన్నారు.