హీరోయిన్ సమంత తాజాగా డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌ను తీసుకున్నారు. 90 సెకన్ల పాటు ఈ వ్యాయామం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్రైనర్ పంచుకున్నారు.‘‘మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది విషయం కాదు. మీ వారసత్వం ఏమిటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు పంచుకోవడం కూడా ప్రాధాన్యం కాదు.. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేది ముఖ్యం’’ అని ఈ వీడియోకు ఆయన క్యాప్షన్ పెట్టారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కింగ్డమ్’ నుంచి సర్‌ప్రైజ్.. ‘రగిలే రగిలే’ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘రగిలే రగిలే’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
-
రవితేజ థియేటర్ ప్రారంభం.. ఫస్ట్ సినిమా ఏదంటే..?
హీరో రవితేజ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో కూడిన లగ్జరీ మల్టీప్లెక్స్ ‘ART (ఏషియన్ రవితేజ)’ను నిర్మించారు. జూలై 31న ప్రారంభం కానున్న ఈ థియేటర్‌లో మొదటి సినిమాగా విజయ్ దేవరకొండ న్యూ మూవీ ‘కింగ్‌డమ్’ ప్రదర్శించనున్నారు. 60 అడుగుల భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ఈస్ట్ హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన థియేటర్‌గా ఇది నిలవనుంది.
-
‘ఉస్తాద్ భగత్‌సింగ్’..క్లైమాక్స్ పూర్తి
పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది.
-
రిసార్ట్‌లో వివాదంపై నటి కల్పిక వివరణ
HYD: తనకు మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో సిబ్బందితో జరిగి వివాదంపై నటి కల్పిక వివరణ ఇచ్చారు. తనకు సిగరెట్లు కావాలని, రిసార్ట్ సిబ్బంది ఎవరైనా తీసుకురావాలని తాను కోరానని.. దానికి వారు నిరాకరించారని చెప్పారు. తాను వెళ్లడానికి కనీసం క్యాబ్ అయిన బుక్ చేయాలని అభ్యర్థించినా వారు వినలేదన్నారు. దీంతో తాను వారిపై ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు.
-
‘విశ్వంభర’ టీజర్‌పై కాపీ ట్రోల్స్.. దర్శకుడు ఏమన్నారంటే!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలైంది. ఆ టీజర్‌లోని సీన్లు కాపీ అంటూ ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా వశిష్ట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వంభర’ అంటే విశ్వాన్ని భరించేవాడని చెప్పారు. ఈ టీజర్‌లో కనిపించిన పాత్రలు చందమామ కథల నుంచి తీసుకున్నవని స్పష్టం చేశారు.
-
HHVM మూవీ చాలా బాగుంది: నాగబాబు
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా చాలా బాగుందని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ‘‘ధర్మం కోసం పోరాడిన ఒక వీరుడి కథ ఇది. రాజకీయాలను పవన్ కల్యాణ్ ఎంత నిబద్ధతతో చేస్తారో.. సినిమాను కూడా అంతే నిబద్ధతతో చేస్తారు. నేను ఈ సినిమా షూటింగ్‌కు చాలా సార్లు వెళ్లాను. పవన్‌లో ఆ డెడికేషన్‌ను చూశాను’’ అని చెప్పారు.
-
నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చిన మహ్వాష్
యుజ్వేంద్ర చాహల్ స్నేహితురాలు అని చెప్పుకునే ఆర్జే మహ్వాష్ ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘‘వేరొకరి భర్తను దొంగిలించడం మోసం’’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై మహ్వాష్ స్పందించారు. ‘‘నేను దొంగిలించలేదు. అందుకే నాకు తెలియదు. అవును నిజమే అలా చేయడం మోసమే’’ అని కౌంటర్ ఇచ్చారు.
-
ఆ రెండూ నా బాధ్యతలు: విజయ్ దేవరకొండ
‘కింగ్డమ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానుల్ని ఉద్దేశించి హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఇకపై మరింత శ్రద్ధ పెడతా. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది కావట్లేదో అర్థమవడం లేదు. కానీ, మీరు గౌరవించే సినిమాలే చేస్తా. వ్యక్తిగతంగా మీ అందరికీ నా వంతుగా ఏదో ఒక మంచి పని చేస్తా. ఈ రెండూ నా బాధ్యతలు’’ అని పేర్కొన్నారు.
-
మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘కింగ్డమ్’. ఈనెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీరు నాకు దేవుడిచ్చిన వరం అని అన్నారు. తన గత సినిమాల రిజల్స్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందనకు సంతోషిస్తున్నానని చెప్పారు.