జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ సిరీస్‌లో మూడో భాగమైన ‘అవతార్ 3’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్‌లో ఆకట్టుకునే కొత్త వీక్షణలు, అద్భుతమైన దృశ్యాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా, కొత్త పాత్రల పరిచయంతో పాటు నావి నాగరికతలో ‘నల్లని జీవులు’ (Ash People) కనిపించడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తాతినేని సత్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’.ఈ మూవీ టీజర్‌ను రేపు ఉ.10:30 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
-
బాలీవుడ్ బ్యూటీస్ రాసిన రచనలివే!
ప్రముఖ సెలబ్రిటీలు కొందరు ఎప్పుడూ ఆడిషన్లు, షూటింగ్‌లు, మీటింగ్‌లతో కూడిన బిజీ లైఫ్‌లో సైతం స్ఫూర్తినిచ్చే రచనలోనూ రాటుదేలారు. ఇంతకీ వారెవరు? ఎలాంటి రచనలు చేశారో ఇప్పుడు చూద్దాం.
- ప్రియాంక చోప్రా : Unfinished
- అలియా భట్: Ed Finds a Home
- కరీనాకపూర్ : Pregnancy Bible
- హుమా ఖరేషి : Things We Don’t Tell the People We Love
-
రజనీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న విడుదలకానుంది. ఈనేపథ్యంలో ఆగస్టు 2న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ మూవీ ‘పౌర్ణమి’ మళ్లీ థియేటర్లకు రాబోతుంది. సెప్టెంబర్ 19న ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
‘హరిహర వీరమల్లు’.. 4 రోజుల వసూళ్లు ఇవే!
పవన్‌కళ్యాణ్-నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘హరిహర వీరమల్లు’ ఈనెల 24న విడుదలైన మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా 4 రోజుల్లో రూ.105+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీవర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ.78.30 కోట్లు రాబట్టడం గమనార్హం. బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఇంకా రూ.62.48 కోట్ల కలెక్షన్లు రాబట్టాలని అంచనా. ఇప్పటివరకూ ఈ చిత్రం 51శాతం రికవరీ చేసిందని తెలుస్తోంది.
-
హాట్ లుక్‌లో నభా నటేష్.. కుర్రాళ్ళు ఫిదా!
అందాల భామ నభా నటేష్ హాట్ లుక్ చూసిన కుర్రాళ్ళు ఫిదాఅవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫొటోలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది.
-
అప్పటి ‘షోలే’ టికెట్ ఫొటోను షేర్ చేసిన అమితాబ్!
బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ ఆదివారం ముంబయిలోని తన నివాసం వెలుపల అభిమానులను పలకరించారు. ఆ ఫొటోలను ఆయన తన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. వాటితోపాటు 1975లో విడుదలైన ‘షోలే’ టికెట్ చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ‘‘షోలే టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరిచాను. దాని ధర అప్పట్లో రూ.20. నాకు తెలిసి ఇప్పుడు ఆ డబ్బుతో థియేటర్‌లో ఓ సాఫ్ట్ డ్రింక్ మాత్రమే కొనుక్కోగలం. నిజమేనా?’’ అని ఆయన రాసుకొచ్చారు.
-
‘తెలుసు కదా’.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి హీరోయిన్లు. అక్టోబరు 17న రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘మల్లిక గంధ’ అంటూ సాగే ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ సంగీతం అందించాడు. ఈ సాంగ్‌తో తమన్ మరోసారి తనమార్క్ చూపించారు.
-
ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్.. వీడియో వైరల్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14 రిలీజ్ కానుంది. కియారా అడ్వాణీ హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తారక్ ముంబైకి వెళ్లాడు. ఈక్రమంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆయను ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. (వీడియో)