దర్శకుడు అశ్విన్‌కుమార్ తెరకెక్కించిన యానిమేషన్ మూవీ ‘మహావతార్: నరసింహ’ ఈనెల 25న విడుదలైన హిట్ అందుకుంది. ఈనేపథ్యంలో దర్శకుడు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ యామినేషన్ కాకుండా నటులతోనే ఈ సినిమాని తీయాల్సి వచ్చినా.. నరసింహస్వామిని మాత్రం డిజిటల్‌గానే చూపించేవాడినని తెలిపారు. హిరణ్యకశిపుడిగా రానా, మోహన్‌లాల్, విజయ్ సేతుపతిలో ఒకరిని ఎంపిక చేసేవాడినని అన్నారు. ఆ పాత్రకు ముగ్గురూ పర్‌ఫెక్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’.. గ్లింప్స్ రిలీజ్
దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈరోజు దుల్కర్ బర్త్ డే సంర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
-
నాకు బాలీవుడ్‌పై ఆసక్తి లేదు: యశ్
KGF సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో యశ్. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో యశ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు.. బాలీవుడ్ లేదా మరే ఇతర పరిశ్రమ పట్ల ఆసక్తి లేదు. ఏదైనా సినిమా తీసినప్పుడు అది భారతీయ సినిమాగా ఉండాలి. ఆలాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయి’’ అని తెలిపారు.
-
‘అర్జున్ చక్రవర్తి’ టీజర్ చూశారా?
విజయరామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. డైరెక్టర్ హను రాఘవపూడి తాజాగా ఆ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
-
‘కింగ్డమ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ‘కింగ్డమ్’ ఈనెల 31న రిలీజ్‌కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా లాక్ అయింది. ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకర సీన్స్, డైలాగులు తొలగించాలని సెన్సార్‌బోర్డు ఆదేశించడంతో 2 నిమిషాల 31 సెకన్ల సన్నివేశాలను రీప్లేస్ చేశారు.
-
ధనుష్‌కు విషెస్ చెప్పిన ‘కలాం’ టీమ్
ధనుష్ ప్రధానపాత్రలో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘కలాం’. నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మూవీ టీమ్ విషెస్ తెలుపుతూ ఓ క్రేజీ పోస్టర్ పంచుకుంది.
-
రూ.72 కోట్ల ఆస్తిని ఇచ్చిన అభిమాని.. హీరో క్లారిటీ!
2018లో ఓ అభిమాని ఇచ్చిన రూ.72 కోట్ల ఆస్తిని తాను తిరిగి వారి కుటుంబానికే ఇచ్చివేసినట్లు నటుడు సంజయ్‌దత్ తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న నిషా పాటిల్ అనే అభిమాని అప్పట్లో తన ఎస్టేట్ మొత్తాన్ని సంజయ్ దత్ పేరిట రాశారు. ఆమె తన తదనంతరం సంపదనంతా సంజయ్‌కు ఇవ్వాలని బ్యాంకుకు సూచించినట్లు సమాచారం. తాను ఆ ఆస్తిని ఆమె కుటుంబ సభ్యులకే ఇచ్చేశానని సంజయ్ స్పష్టంచేశారు.
-
పవన్‌కు బాగా ఇష్టమైన హీరోయిన్ ఈమెనే..
తనకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో పవన్ కల్యాణ్ చెప్పేశారు. ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్లలో ఓ ర్యాపిడ్ ఫైర్‌లో ఇంట్రస్టింగ్ సమాధానాలు చెప్పారు. ఆలియా, దీపికా, కృతిసనన్, కియారా అద్వానీలో ఎవరి నటన ఇష్టమని అడగగా కృతి అని చెప్పారు. ఇక ఇందిరాగాంధీ పాత్రలో కనిపించిన కంగనా యాక్టింగ్ నచ్చుతుందని తెలిపారు. మొత్తానికి అలనాటి హీరోయిన్ శ్రీదేవి అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
-
నా చివరి కోరిక అదే: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తనకు సంగీతం అంటే ప్రాణమని… సినిమాలలో ఓ మ్యూజిషియన్ పాత్ర చేయాలన్నదే తన చివరి కోరిక అని తెలిపింది. మంచి కథలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తానని పేర్కొన్న ఆమె.. ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా తనకు సంబంధం లేదని.. కథలో దమ్ము ఉంటే కచ్చితంగా సినిమా ఒప్పుకుంటానని వెల్లడించింది.
-
సూపర్ హీరో జానర్‌లో ‘లోకా’.. ఆకట్టుకునేలా టీజర్
కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘లోకా’. దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అది ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను తెలుగులోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కల్యాణికి జోడిగా ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్ నటిస్తున్నాడు.