గత శుక్రవారం విడుదలైన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్: నరసింహా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. 3 రోజల్లో దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ వదిలారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన శ్రుతిహాసన్
హీరోయిన్ శ్రుతిహాసన్ తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ఈ బ్యూటీ తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్‌లో కుర్రకారు మతి పొట్టింది. ప్రస్తుతం ఈ పిక్ వైరలవుతోంది.
-
ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలివే!
ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు పలు సినిమా, సిరీస్‌లు సిద్ధమైయ్యాయి. మరి అవి ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతున్నాయో చూద్దాం.
- నెట్‌ఫ్లిక్స్: ‘తమ్ముడు’ (ఆగస్టు 1)
- జియో హాట్‌స్టార్: ‘పతీ పత్నీ ఔర్ పంగా’ (ఆగస్టు 2)
- యాపిల్ టీవీ: ‘చీఫ్ ఆఫ్ వార్’ (ఆగస్టు 1)
-
రాఘవ్ ఎప్పటికీ ప్రధాని కాలేరు: పరిణీతి చోప్రా
బాలీవుడ్ జంట పరిణీతి చోప్రా-రాఘవ్ చద్ధా తాజాగా కపిల్ శర్మ షోలో సందడి చేశారు. పరిణీతి ఏం చెబితే దానికి వ్యతిరేకంగా జరుగుతుందని.. అందుకే రోజూ ఆమెతో ‘రాఘవ్ ఎప్పటికీ ప్రధాని కాలేరు’ అని చెప్పమంటాను. దానికి రివర్స్‌లో జరగాలని అలా అనిపించుకుంటా’ అని రాఘవ్ చెప్పడంతో స్టేజ్ అంతా నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
-
ఇది శాంత కాదు ‘కాంత’.. ఆసక్తిగా టీజర్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. దుల్కర్‌తో కలిసి హీరో రానా తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్ చూస్తే.. సినిమా డైరెక్టర్ హీరోకి మధ్య జరిగే కథలా అనిపిస్తోంది. టీజర్ మూవీ ఎంతో ఆసక్తిని రేపుతోంది.
-
ఈ వారం థియేటర్‌లో అలరించే చిత్రాలివే!
ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికర సినిమాలు అలరించేందుకు సిద్ధమైయ్యాయి. మరి అవేంటో చూద్దాం.
- విజయ్ దేవరకొండ-‘కింగ్డమ్’ (జులై 31)
- విజయ్ సేతుపతి-‘సార్ మేడమ్’ (ఆగస్టు 1)
- టీజై అరుణాచలం-‘ఉసురే’ (ఆగస్టు 1)
- అజయ్ దేవగణ్-‘సన్నాఫ్ సర్దార్-2’ (ఆగస్టు 1)
-
విజయవాడలో ‘వార్-2’ ప్రీ-రిలీజ్.. మేకర్స్ క్లారిటీ!
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధానపాత్రల్లో రానున్న చిత్రం ‘వార్-2’. ఆగస్టు 14న విడుదలకానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై విజయవాడలో జరగనుందని.. ఎన్టీఆర్, హృతిక్‌లు పాల్గొననున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. కొన్నిరోజులుగా ‘వార్-2’ ఈవెంట్‌పై వస్తోన్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఇంకా వేదికను ఖరారు చేయలేదని.. అన్ని పనులు అన్నీ పూర్తయ్యాక అధికారికంగా తెలుపుతామని సూచించారు.
-
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
సత్యదేవ్-ఆనంది ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘అరేబియా కడలి’. సూర్యకుమార్ దర్శకుడు. స్టార్ దర్శకుడు క్రిష్ దీనికి రైటర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా సిరీస్ స్ట్రీమింగ్ వివరాలను అమెజాన్ ప్రైమ్ పంచుకుంది. ఆగస్టు 8 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
-
అనసూయ.. ఫాలోవర్స్ vs బ్లాక్ లిస్ట్
తాను ఇప్పటికే సోషల్ మీడియాలో 3 మిలియన్ల మందిని బ్లాక్ చేశానని యాంకర్ అనసూయ వెల్లడించారు. అయితే, ఆమెకు సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోవర్లు 1.2 మిలియన్లు మాత్రమే.అయితే, బ్లాక్ లిస్ట్‌లో మాత్రం 3 మిలియన్ల మంది ఉన్నారు. ఈ గణాంకాలు చూసిన నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. ఇంత మంది నెగెటివ్‌గా స్పందించారా లేక ఆమె నిజంగా సోషల్ మీడియాలో కావాలనే బ్లాక్ చేస్తున్నారా అని అంటున్నారు.