Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘హరిహర వీరమల్లు’ నుంచి కొన్ని సీన్ల తొలగింపు

    పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా.. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమాలో VFX బాగోలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. సినిమాకు అది పెద్ద మైనస్‌గా మారిందని కామెంట్స్ వచ్చాయి. దీంతో మూవీలో VFX సరిగా లేని సీన్లను మూవీ టీమ్ తొలగించింది.

  • ఆమిర్ ఖాన్‌ ఇంటికి 25 మంది ఐపీఎస్‌లు.. ఎందుకు వెళ్లారంటే?

    బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్లిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా ఆమిర్ టీమ్ స్పందించింది. ప్రస్తుత బ్యాచ్‌లో ఐపీఎస్‌కు శిక్షణ తీసుకుంటున్న ట్రైనీలు ఆమిర్‌‌ను కలవాలని కోరుకున్నారని తెలిపారు. దీంతో ఆమిర్ తన ఇంట్లోనే వారితో భేటీ అయ్యారని చెప్పారు.

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివ రాజ్‌కుమార్

    కన్నడ హీరో శివరాజ్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శివరాజ్ కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

     

  • నటికి అత్యాచార బెదిరింపులు

    కన్నడ నటి రమ్యకు నటుడు దర్శన్‌ అభిమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. తనను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు బెదిరింపులకు పాల్పడ్డారని రమ్య తెలిపారు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆన్‌లైన్ ట్రోలింగ్ ఎంతో బాధాకరమని రమ్య తెలిపారు.

  • ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ

    ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తన 500కి పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్‌ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఇళయరాజా సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ వినోద్ చంద్రన్, జస్టిస్‌ ఎన్‌.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది.

  • పృథ్వీరాజ్‌ సుకుమారన్ ‘ఎల్‌ 3’పై రూమర్స్‌.. ఖండించిన టీమ్‌

    పృథ్వీరాజ్‌ సుకుమారన్ దర్శకత్వంలో  ‘L3’ చిత్రం రానుంది. ఈ మూవీ గురించి పృథ్వీరాజ్‌ మాట్లాడినట్లు  వైరల్ అయిన వార్తలను చిత్ర బృందం ఖండించింది.  ఈ సినిమా గురించి పృథ్వీరాజ్‌ ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. ‘సర్జమీన్’ ప్రమోషన్ ఇంటర్వ్యూలను మాత్రమే రిఫరెన్స్‌గా తీసుకోవాలని మీడియాను కోరింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ప్రముఖ ఛానళ్లపై టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

  • ఆమిర్‌ ఖాన్ ఇంటికి 25 మంది IPSలు

    బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఇంటికి 25మంది ఐపీఎస్ అధికారులు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలువతోంది. పోలీసులు బస్సు, వ్యాన్‌లలో బాంద్రాలోని ఆమిర్‌ ఇంటికి వచ్చారు. ఇంతమంది నటుడి ఇంటిని ఆకస్మికంగా సందర్శించడం వెనక ఉన్న కారణం ఏంటని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. దీనిపై తమకు కూడా వారికి కూడా కచ్చితమైన సమాచారం అందలేదని ఆమిర్‌ టీమ్‌ తెలిపింది.

     

  • సినిమా పైరసీకి కఠిన శిక్షలు

    సినిమా పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరించింది. ఇకపై చట్టవిరుద్ధంగా సినిమాలను రికార్డు చేసినా, ప్రసారం చేసినా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. అలాగే, నిర్మాణ వ్యయంలో 5% వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. గతంలో ఈ నేరానికి 3 నెలల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా ఉండేది. అయితే, ఈ విషయాన్ని ప్రసార శాఖల సహాయమంత్రి ఎల్. మురుగన్ వెల్లడించారు.

     

  • హీరో విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు

    TVK పార్టీ అధినేత, హీరో విజయ్‌ నివాసంతోపాటు, CM స్టాలిన్‌ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.  దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. సీఎం స్టాలిన్‌, విజయ్‌ నివాసాలతో పాటు విమానశ్రయం వద్ద సెక్యూరిటీ పెంచారు. భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే, వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

  • వాస్తవ సంఘటనల.. ‘ఉసురే’

    టీజై అరుణాచలం, జననీ కునశీలన్‌ జంటగా నవీన్‌ డి గోపాల్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉసురే’. రాశి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా, గ్రామీణ ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. తప్పకుండా అందరి హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’అని చిత్ర బృందం చెబుతోంది.