పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ వైదొలిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ స్పందించారు. ‘‘క్రిష్ నాకోసం ఏడాది వెయిట్ చేశారు. ఆయనకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లు ఉండడంతో వైదొలిగారు. క్రిష్ అనుకున్న కోహినూర్ కథ పార్ట్ 2లో వస్తుంది. కోహినూర్ కోసం అసలేం జరిగింది అనేది చూపించనున్నాం’’ అని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
భాగ్యశ్రీ బోర్సే అందానికి నెటిజన్లు ఫిదా
‘కింగ్‌డమ్’ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ చాలా అందంగా ఉన్నారని, న్యాచురల్ బ్యూటీ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. రష్మిక, కీర్తి సురేశ్‌లను ఒకేసారి చూసినట్లు ఉందంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మడు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’తో పరిచయమయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే డేటింగ్‌లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం రూమర్స్ వచ్చాయి.
-
30 లక్షల మందిని బ్లాక్ చేశా: అనసూయ
నటి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు సోషల్ మీడియాలో 3 మిలియన్ల(30 లక్షలు) మందిని బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో.. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే బ్లాక్ చేయడమేనని చెప్పారు. ‘‘కొన్నిసార్లు నెటిజన్ల కామెంట్లను భరించలేకపోయా. కొన్నింటికి రియాక్ట్ అయ్యా… మరికొన్నింటికి కాలేకపోయా. చివరకు నా ప్రపంచంలో నువ్వు లేవు అనుకుంటూ బ్లాక్ చేస్తా’’ అని చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
-
నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ రేట్ల తగ్గింపు
నేటి నుంచి పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ టికెట్ రూ.175లు, మల్టీ ప్లెక్స్‌లలో రూ.295లకే టికెట్లు లభించనున్నాయి.
-
30 లక్షల మందిని బ్లాక్ చేశా: అనసూయ
తాను ఇప్పటివరకు సోషల్ మీడియాలో 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు సినీ నటి అనసూయ తెలిపారు. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే బ్లాక్ చేయడమేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కొన్నిసార్లు నెటిజన్ల కామెంట్లను భరించలేకపోయా. కొన్నింటికి రియాక్ట్ అయ్యా.. మరికొన్నింటికి కాలేకపోయా. చివరకు నా ప్రపంచంలో నువ్వు లేవు అనుకుంటూ బ్లాక్ చేస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
-
‘కింగ్డమ్’ టికెట్ బుకింగ్స్ ఓపెన్
గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే నటించిన ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘కింగ్ డమ్’ సినిమా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘కింగ్ మ్’ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది.
-
తగ్గిన ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు. విడుదలప్పుడు భారీగా పెంచిన టికెట్ ధరలను మూవీటీం తగ్గించింది. జులై 28వ తేదీ నుంచి సాధారణ ధరలకే ‘వీరమల్లు’ టికెట్లు లభించనున్నాయి. బుక్‌మై షో, డిస్ట్రిక్ యాప్‌లలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభించనున్నాయి.
-
దీపికా పదుకొణెకు మరో గౌరవం
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మరో గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచారు. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన లిస్ట్‌లో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, హాలీవుడ్ నటీమణులు ఏంజెలినాజోలీ, సెలినా గోమెజ్ తదితరులున్నారు. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కూ దీపిక ఎంపికైన సంగతి తెలిసిందే.
-
మాజీ భర్త ₹30,000 కోట్ల ఆస్తిలో వాటా కోరుతున్న నటి
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గత నెల 12న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ₹30,000 కోట్ల ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. సంజయ్ మాజీ భార్య కరిష్మా కపూర్ కూడా ఆస్తిలో తన వాటా కోరుతున్నారు. అలాగే, సంజయ్ తల్లి రాణి కపూర్, కంపెనీ బోర్డు, ప్రస్తుత భార్య ప్రియా సచ్‌దేవ్‌లపై ఆరోపణలు చేస్తూ, తన కొడుకు మరణం అనుమానాస్పదంగా ఉందని తెలిపారు.
-
RGV ఒత్తిడి.. సృహ కోల్పోయిన శ్రీదేవి
రామ్‌గోపాల్ వర్మపై అక్షయ్ కుమార్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మేరీ బివి కా జవాబ్ నహిన్’ దర్శకుడు పంకజ్ పరాశర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘క్షణక్షణం’ మూవీ సమయంలో బరువు తగ్గమని ఆర్జీవీ.. శ్రీదేవిని బలవంతం చేశాడని చెప్పాడు. ‘‘శ్రీదేవి క్రాష్ డైట్ చేసి… ఉప్పు తీసుకోలేదు. దీంతో బీపీ పడిపోయింది. నీరసంతో టేబుల్‌కు తగిలి 20నిమిషాలు స్పృహ కోల్పోయింది. ఆమె పన్ను విరిగిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు.