Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • Viral Video: బెంగళూరులో GOT స్టార్

    ప్రపంచవ్యాప్తంగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్‌సిరీస్ అంటే తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ సిరీస్‌లో జైమీ లాన్నిస్టర్ పాత్ర పోషించిన నటుడు నికోలాజ్ కోస్టర్-వాల్డౌ ఇటీవల బెంగళూరులో కనిపించారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో, బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో నికోలాజ్ ఇడ్లీలు, దోసెలు తింటూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

  • Viral Video: గిరిజన మహిళలతో రష్మిక డ్యాన్స్

    రష్మిక ఒకవైపు స్టార్‌ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెండ్‌ చిత్రాలతోనూ దూసుకెళ్తోంది. ఆమె తాజా చిత్రం ‘మైసా’ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా గోండు పాటకు స్టెప్పులేసి అందరికి అలరించింది. సినిమా ఓపెనింగ్‌కి వచ్చిన గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

  • ‘అప్పటివరకు ఉండలేను’.. రష్మిక ఆసక్తికర ట్వీట్

    విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నటి రష్మిక మందన్న ట్వీట్ చేశారు. “కచ్చితంగా 31వ తేదీ కోసం వేచి ఉండలేను” అని రష్మిక పేర్కొన్నారు. ఈ స్పై యాక్షన్ డ్రామా జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.

  • దూసుకుపోతున్న ‘మహావతార్ నరసింహ’

    ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ‘మ‌హావ‌తార్’ సినిమాటిక్ యూనివ‌ర్స్(MCU) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టగా.. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మంచి టాక్ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పెరుగుతోంది.

  • శ్రావణ మాసంలో ఉపవాసం తర్వాత మాంసం తింటాను: నటి

    బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచారు. పవిత్ర శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్న తర్వాత తాను మటన్ తింటానని తనుశ్రీ చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. బెంగాల్‌లో అన్ని ఉపవాసాలు ఇలాగే చేస్తారు. సాయంత్రం వరకు మేము నీటితో మాత్రమే ఉపవాసం ఉంటాము , ఆపై సూర్యాస్తమయం తర్వాత దేవికి ఇచ్చిన భోగ్(మేక మాంసం) తింటాము’’అని ఆమె చెప్పుకొచ్చారు.

  • ‘విశ్వంభర’ స్పెషల్‌ సాంగ్‌పై వశిష్ఠ క్లారిటీ

    చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు సమకూర్చారు. దీనిపై ఇటీవల చర్చ జరిగింది. దాని గురించి డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ.. కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతో భీమ్స్‌ని తీసుకున్నామన్నది అవాస్తమని స్పష్టం చేశారు.

  • పవన్​ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి అప్​డేట్


    పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటను తమిళ హీరో శింబు పాడారు.  DVV ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​గా నటిస్తోంది.

  • బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో హాలీవుడ్ నటుడు సందడి

    ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో జైమ్ లన్నిస్టర్ అనే ఐకానిక్ పాత్రలో నటించిన నికోలాజ్ కోస్టర్-వాల్డౌ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కంటెంట్ క్రియేటర్ షకీరా తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నికోలాజ్మరో ఇద్దరు పర్యాటకులతో కలిసి సాంప్రదాయ దక్షిణ భారత అల్పాహారాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు.

  • ఓటీటీలోకి ‘తమ్ముడు’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    నితిన్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం ‘తమ్ముడు’. ఈ నెల 4న ఇది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ సినిమా ఆగస్టు 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ ఆడియోలలో అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ సినిమాలో లయ, వర్ష, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు.

     

  • నన్ను చంపేస్తామంటున్నారు: నటుడు

    HYD: వైసీపీ కార్యకర్తల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ‘గబ్బర్‌సింగ్’ సినిమా నటుడు సాయి అన్నారు. తనను చంపేస్తామని ఇప్పటివరకు చాలా మంది ఫోన్‌లు చేశారని చెప్పారు. తాను ఆవేశంలో వైసీపీ కార్యకర్తల గురించి ఓ తప్పుడు మాట మాట్లాడానని, దానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.