రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని విజయ్, భాగ్యశ్రీ బోర్సేతో పాటు ‘కింగ్డమ్’ చిత్ర బృందం దర్శించుకున్నారు. సినిమా విజయం సాధించాలని మొక్కులు చెల్లించుకున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘అర్జున్ రెడ్డి’లో విజయ్‌ని చూస్తారు: నాగవంశీ
తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాని చూపించబోతున్నారని నిర్మాత నాగవంశీ తెలిపారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంత గాఢమైన నటన ప్రదర్శించారో, అది మళ్లీ ‘కింగ్డమ్’లో చూస్తారని చెప్పారు. విజయ్‌కి ఎలాంటి నష్టం జరగకుండా ఈ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.
-
9 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్లు
అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన ‘సైయారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 9 రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
సాధించింది. రెండవ శనివారం నాడు రూ. 26 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 216.75 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది “ఛావా’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో బాలీవుడ్ చిత్రంగా ‘సైయారా’ నిలిచింది. -
నిరాశలో మహేశ్ బాబు ఫ్యాన్స్
హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా రానుంది. ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈమూవీ నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజున ఎలాంటి అప్‌డేట్ రావట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సిఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
-
ఏపీ భవన్‌లో ‘హరిహర వీరమల్లు’ ప్రదర్శన
AP: ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇవాళ ప్రదర్శించనున్నట్టు రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు షో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.
-
విజయ్ దేవరకొండ నోట ‘పుష్పా’ డైలాగ్
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విజయ్ పుష్పా మూవీలోని డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించాడు. ‘నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తాంది. మన తిరుపతి ఏడు కొండల వెంకన్నస్వామి కానీ, ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నడిపించినాడో.. శానా పెద్దోడినై పూడుస్తా సామి.. పోయి టాప్‌లో కూర్సొంటా’ అంటూ చిత్తూరు యాసలో మాట్లాడాడు.
-
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించి ట్రైలర్‌ని విడుదల చేశారు.
-
చిత్తూరు యాసలో అదరగొట్టిన రౌడీ హీరో!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ మూవీ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను శనివారం తిరుపతిలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ వీడియో మీరూ చూసేయండి.
-
మృణాల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా!
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా రెడ్ డ్రెస్ ధరించిన క్యూట్ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నెట్టింట వైరలవుతున్న ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
-
‘పెద్ది’.. మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. తాజాగా ఈమూవీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రెడీ అయినట్లు టాక్. ఈ సాంగ్ వినాయక చవితి స్పెషల్‌గా ఆగస్టులో రిలీజ్ చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పోస్ట్‌లు వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.