Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • Video: సరోగసీపై సన్నీ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    సరోగసీపై సన్నీ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను గర్భం దాల్చడం ఇష్టం లేకే సరోగసీని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. పిల్లలను దత్తత తీసుకోవాలని మొదట నిర్ణయించుకున్నామని.. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చామని చెప్పింది. తమ సరోగసీ మదర్‌కు ఆర్థికంగా సహాయపడగలిగామని.. తాము ఇచ్చిన డబ్బుతో వారు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని సన్నీ వెల్లడించింది. (వీడియో)

     

  • ఓటీటీలో ‘మాలిక్‌’.. వారికి మాత్రమే ఈ ఆఫర్!

    రాజ్‌కుమార్‌ రావ్‌-మానుషి చిల్లర్‌ జంటగా రూపొందిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘మాలిక్‌’. పుల్కిత్‌ దర్శకుడు. జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రెంట్ విధానంలో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఇక నుంచి ప్రైమ్‌ యూజర్స్ అదనంగా చెల్లించకుండానే ఈ మూవీని చూడొచ్చు. సెప్టెంబరు 5 నుంచి ఈ ఆప్సన్ అందుబాటులోకి రానుంది.

  • రోషన్‌ కనకాల ‘మోగ్లీ’.. నాని వాయిస్‌తో గ్లింప్స్‌

    రాజీవ్‌ కనకాల-సుమ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాక్షి సాగర్‌ హీరోయిన్‌. తాజాగా ఈమూవీ గ్లింప్స్‌ విడుదలైంది. హీరో నాని వాయిస్‌ ఓవర్‌తో కూడిన ‘మోగ్లీ’ ప్రపంచాన్ని మీరూ చూసేయండి.

  • ‘బ్రహ్మాండ’ మూవీ రివ్యూ

    రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాండ’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గ్రామీణ నేపథ్యం, ఒగ్గు కళాకారుల కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమని, కొమరక్క ప్రధాన పాత్రలు పోషించారు. ఆమని, కొమరక్క తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వారి నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, ఎడిటింగ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. రేటింగ్:3/5

  • గుడ్ న్యూస్ ప్రకటించిన అక్కినేని కోడలు

    అక్కినేని నాగచైతన్య భార్య శోభిత తాజాగా గుడ్ న్యూస్ ప్రకటించింది. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పోస్ట్ చేసింది. తన కొత్త సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్లు ఫొటోలు షేర్ చేసింది. దీంతో నెటిజన్లు.. సినిమాలు అవసరమా పిల్లలను కని ఇంటి బాధ్యతలు చూసుకోక అని తిడుతున్నారు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం పెళ్లైతే మూవీస్ చేయొద్దని రూల్ ఉందా అని.. ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

     

  • సీఎం సహాయనిధికి సందీప్ వంగా విరాళం

    TG: ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి తమ నిర్మాణ సంస్థ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వారి ఉదారతను ముఖ్యమంత్రి అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.

  • బీర్ ఒక ఎమోష‌న్.. తమన్నా కొత్త సిరీస్ ట్రైలర్!

    తమన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘డు యూ వనా పార్ట్‌నర్‌’ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుండి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కార్పొరేట్ ఉద్యోగాలపై విసుగు చెందిన ఇద్దరు స్నేహితులు బీర్ కంపెనీ ప్రారంభించాలనుకోవడం, ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామెడీ, థ్రిల్లర్‌ అంశాలతో ఈ వెబ్‌సిరీస్ ఆసక్తికరంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

  • ఈ వారం ఓటీటీ సినిమాలివే!

    ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవెంటో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

    • నెట్‌ఫ్లిక్స్‌: ‘కింగ్డమ్‌’, ‘మెట్రో ఇన్ డినో’
    • అమెజాన్‌ ప్రైమ్‌: ‘ది 100’
    • ఈటీవీ విన్‌: ‘భాగ్‌ సాలే’
    • జియో: ‘థండర్‌బోల్ట్స్‌’
    • జీ5: ‘శోధ’
    • సోనీలివ్‌: ‘సంభవ వివరణమ్‌ నలర సంఘం’
    • ఆహా తమిళ్‌: ‘ది డోర్‌’

  • రజనీ-సత్యరాజ్ వివాదం.. 18 ఏళ్లకు ముగింపు!

    రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘శివాజీ’ చిత్రంలో విలన్ పాత్రను తాను ఎందుకు తిరస్కరించారో నటుడు సత్యరాజ్‌ తాజాగా వెల్లడించారు. ఆ సమయంలో తాను హీరోగా కొన్ని సినిమాలు చేస్తుండడం వల్ల విలన్ పాత్ర చేస్తే అలాంటి పాత్రలే వస్తాయని ఆఫర్‌ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. ఈ వివాదంపై 18 ఏళ్లుగా కొనసాగుతున్న చర్చకు దీంతో ముగింపు పడింది. 38 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు ‘కూలీ’ సినిమాలో కలిసి నటించారు.

     

  • అతను నా భర్త: జాన్వీకపూర్‌

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ తన స్నేహితుడు ఓర్రీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ఒకసారి లాస్‌ ఏంజెలెస్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్‌లో వెయిటర్స్‌కి ఓర్రీని చూపిస్తూ.. ‘అతను నా భర్త’ అని సరదాగా చెప్పానని అన్నారు. ఈ విషయం విన్న చాలామంది ఆశ్చర్యపోయారు. కాగా ఓర్రీ ఒక ఫ్యాషన్‌ డిజైనర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.. బాలీవుడ్‌ సెలబ్రిటీలలో చాలామందికి మంచి స్నేహితుడు.