Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • స్టేజీపైనే స్టెప్పులేసిన హీరో.. హీరోయిన్ రియాక్షన్ ఇది!

    హీరో శివ కార్తికేయన్‌ నటిస్తోన్న చిత్రం ‘మదరాసి’. మురుగదాస్‌ దర్శకుడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ కనిపించనుంది. తాజాగా బెంగళూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ వేదికపైనే డ్యాన్స్‌తో అలరించాడు. ఈ సినిమాలోని ‘సలంబల’ అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(వీడియో)

  • ‘మదరాసి’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

    శివ కార్తికేయన్‌-రుక్మిణీ వసంత్‌ జంటగా మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న మూవీ ‘మదరాసి’. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్‌ అందుకుంది. సినిమా రన్‌టైమ్‌ 2గంటల 47 నిమిషాలు ఉందని తెలుస్తోంది. సెన్సార్‌ బోర్డ్‌ నాలుగు చోట్ల కట్స్‌ సూచించింది. హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది.

  • చీరకట్టులో అందాల మృణాల్‌

    హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఈ బ్యూటీ చీరకట్టులో డబుల్‌ అందంగా కనిపిస్తోంది.

  • స్టార్ హీరో తల్లికి హీరోయిన్‌ దీపిక కౌంటర్‌

    హీరోయిన్ దీపికా దాస్‌పై హీరో యష్‌ తల్లి పుష్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినిమాను ప్రమోషన్‌లో దీపికా గురించి ఎందుకు అడుగుతున్నారని ఆమె మండిపడారు. దీనిపై దీపికా ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీలో గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అన్నారు. తన కెరీర్ కోసం ఎవరి పేరు వాడుకోలేదని, తన గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. మౌనంగా ఉన్నాను అంటే భయపడి కాదని ఆమె స్పష్టం చేశారు.

     

  • రూ.300 కోట్ల క్లబ్‌లో ‘మహావతార్‌ నరసింహ’

    హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్‌ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారతీయ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యానిమేషన్ చిత్రాల్లో ఇదొక అరుదైన ఘనతగా నిలిచింది.

  • Video: సరోగసీపై సన్నీ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    సరోగసీపై సన్నీ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను గర్భం దాల్చడం ఇష్టం లేకే సరోగసీని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. పిల్లలను దత్తత తీసుకోవాలని మొదట నిర్ణయించుకున్నామని.. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చామని చెప్పింది. తమ సరోగసీ మదర్‌కు ఆర్థికంగా సహాయపడగలిగామని.. తాము ఇచ్చిన డబ్బుతో వారు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని సన్నీ వెల్లడించింది. (వీడియో)

     

  • ఓటీటీలో ‘మాలిక్‌’.. వారికి మాత్రమే ఈ ఆఫర్!

    రాజ్‌కుమార్‌ రావ్‌-మానుషి చిల్లర్‌ జంటగా రూపొందిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘మాలిక్‌’. పుల్కిత్‌ దర్శకుడు. జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రెంట్ విధానంలో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఇక నుంచి ప్రైమ్‌ యూజర్స్ అదనంగా చెల్లించకుండానే ఈ మూవీని చూడొచ్చు. సెప్టెంబరు 5 నుంచి ఈ ఆప్సన్ అందుబాటులోకి రానుంది.

  • రోషన్‌ కనకాల ‘మోగ్లీ’.. నాని వాయిస్‌తో గ్లింప్స్‌

    రాజీవ్‌ కనకాల-సుమ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాక్షి సాగర్‌ హీరోయిన్‌. తాజాగా ఈమూవీ గ్లింప్స్‌ విడుదలైంది. హీరో నాని వాయిస్‌ ఓవర్‌తో కూడిన ‘మోగ్లీ’ ప్రపంచాన్ని మీరూ చూసేయండి.

  • ‘బ్రహ్మాండ’ మూవీ రివ్యూ

    రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాండ’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గ్రామీణ నేపథ్యం, ఒగ్గు కళాకారుల కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమని, కొమరక్క ప్రధాన పాత్రలు పోషించారు. ఆమని, కొమరక్క తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వారి నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, ఎడిటింగ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. రేటింగ్:3/5

  • గుడ్ న్యూస్ ప్రకటించిన అక్కినేని కోడలు

    అక్కినేని నాగచైతన్య భార్య శోభిత తాజాగా గుడ్ న్యూస్ ప్రకటించింది. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పోస్ట్ చేసింది. తన కొత్త సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్లు ఫొటోలు షేర్ చేసింది. దీంతో నెటిజన్లు.. సినిమాలు అవసరమా పిల్లలను కని ఇంటి బాధ్యతలు చూసుకోక అని తిడుతున్నారు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం పెళ్లైతే మూవీస్ చేయొద్దని రూల్ ఉందా అని.. ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.