“సినిమా తీయడం అంటే వీధిలోకి వచ్చి డాన్స్ వేసినట్టు అనుకున్నావా?” అంటూ నిర్మాత ఏఎం రత్నం, మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని కొత్తపేటలో ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో రత్నం మాట్లాడుతూ, అంబటి రాంబాబు టికెట్ రేట్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సినిమాను బాయ్‌కాట్ అన్నవారే థియేటర్లకు వెళ్తున్నారని, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘చైనా పీస్’ టీజర్ చూశారా?
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చైనా పీస్’. అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకుడు. తాజాగా మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం శత్రువుల చేతికి చిక్కితే, ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? కథానాయకుడిపై టెర్రరిస్ట్ ముద్ర ఎందుకు పడింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
-
‘విశ్వంభర’ చిరు మాస్ స్టెప్పులు..డైరెక్టర్ విజిల్స్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటలో చిరుతో పాటు బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ చిందులేసేందుకు రెడీ అయ్యింది. ఈ సాంగ్‌ను గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. చిరు మస్ స్టెప్పులు వేస్తుండగా.. డైరెక్టర్ వశిష్ట విజిల్స్ వేస్తున్న వీడియోను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
-
‘హరిహర వీరమల్లు’ కలెక్షన్స్.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
క్రిష్-జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న విడుదలైన హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ 2 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.79.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి రూ.70 కోట్ల కలెక్షన్స్ రాగా, రెండో రోజు రూ.9.90 కోట్లు వచ్చినట్లు సినీవర్గాల సమాచారం.
-
‘కానిస్టేబుల్ కనకం’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఆగస్టు 14వ తేదీ నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘‘కానిస్టేబుల్ కనకం’ అన్నింటినీ షేక్ చేయడానికి సిద్ధమవుతోంది’ అని ఈటీవీ విన్ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఫస్ట్ ఎపిసోడ్‌ను ఉచితంగా చూసే వెసులుబాటును కల్పిస్తోంది.
-
‘కూలీ’.. నాగార్జున పాత్ర రివీల్ చేసిన శ్రుతిహాసన్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రుతిహాసన్ ఈమూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ఇందులో నాగార్జున అక్కినేని చాలారోజుల తర్వాత ఓ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నాడని.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి తాను షాక్ అయ్యానని తెలిపింది. (వీడియో)
-
శారీలో అందాల మాళవిక.. పిక్ వైలర్!
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో ఆమె గోల్డ్ కలర్ శారీ కట్టుకుని అందంగా ముస్తాబైంది.
-
రేపు రష్మిక ‘మైసా’ షురూ.. పోస్టర్ రిలీజ్!
హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించనున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. ఈ సినిమా రేపు ఉ.11గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక యోధురాలిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.
-
‘వార్-2’.. ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్
హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రం ‘వార్-2’. కియారా అద్వానీ హీరోయిన్. రీసెంట్‌గా వచ్చిన మూవీ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. హిందీ, తెలుగు సహా తమిళ్‌లో విడుదలైన ఈ ట్రైలర్ ఏకంగా 90 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని అదరగొట్టింది. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.
-
బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో సమంత
హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది.ఇందులో ఆమె బ్లాక్ అండ్ వైట్ లుక్ చాలా క్యూట్‌గా కనిపించింది. ఈ పిక్ ప్రస్తుతం వైరలవుతోంది.