మిల్కీబ్యూటీ తమన్నా హాట్ లుక్స్‌తో హీటు పెంచేసింది. తాజాగా నెట్టింట షేర్ చేసిన ఫొటోలో ఆమె కలర్‌ఫుల్ డ్రెస్సులో ఆకట్టుకునేలా ఉంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
విజయ్ సేతుపతి మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఇదే!
విజయ్ సేతుపతి-నిత్యా మీనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తలైవాన్ తలైవి’. తెలుగులో ‘సార్ మేడమ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ జులై 25న రెండు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. కేవలం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు కారణాల వల్ల తెలుగులో వాయిదా పడింది. ‘సార్ మేడమ్’ ఆగస్టు 1న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం.
-
‘కింగ్డమ్’.. యూఎస్‌లో సెన్సేషనల్ ఓపెనింగ్స్!
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ మూవీ ఈనెల 31న రిలీజ్‌కానుంది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. అప్పుడే లక్ష డాలర్స్ మార్క్‌ను దాటేసింది.
-
సెట్‌లో విజయ్ వంటచేసి వడ్డించారు: నిత్యామీనన్
షూటింగ్ సమయంలో విజయ్ సేతుపతి సెట్ చెఫ్‌గా మారారని హీరయిన్ నిత్యామీనన్ తెలిపింది. విజయ్‌సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన ‘తలైవన్.. తలైవి’ సినిమా జులై 25న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి వంటమనిషి పాత్ర పోషించారు. అయితే ఆయన కేవలం నటనకే పరిమితం కాకుండా.. సెట్‌లోని వారికి నిజంగా వంటచేసి వడ్డించారని నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
-
‘అతడు’ను థియేటర్‌లలో తక్కువ మంది చూశారు: మురళీమోహన్
మహేశ్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అతడు’ చిత్రంలోని కామెడీ, పాటలు, డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. 2005లో విడుదలైన ఈ సినిమాను మురళీ మోహన్ నిర్మించారు. ఆగస్టు 9న దీన్ని రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మురళీ మోహన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘అతడు’సినిమాను థియేటర్లలో తక్కువ మంది చూశారని, టీవీలో వచ్చాక చాలామంది బాగుందన్నారని వెల్లడించారు.
-
‘వార్-2’.. ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా?
హృతిక్-ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్-2’ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈక్రమంలో హీరోలు హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా కోసం తారక్‌కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. ఇక హృతిక్‌కు రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. కాగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.
-
ఓటీటీలో అలరిస్తున్న ఆసక్తికర చిత్రాలు!
ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవి ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
- అమెజాన్ ప్రైమ్ వీడియో: ‘మార్గన్’
- నెట్‌ఫ్లిక్స్: ‘మండల మర్డర్స్’
- జియో హాట్‌స్టార్: ‘సర్జమీన్’, ‘రోంత్’
- ఈటీవీ విన్: ‘ఇట్టిమాని : మేడ్ ఇన్ చైనా’
- ఆహా: ‘సారధి’
-
‘అతడు’ పార్ట్2 ఎవరితో తీస్తారు? మురళీ మోహన్ ఏం చెప్పారంటే!
మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమా ఆగస్టు 9న మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘త్రివిక్రమ్ దర్శకత్వంలోనే మహేశ్ హీరోగానే ‘అతడు’ పార్ట్2 తీస్తా. వాళ్లను మారిస్తే జనం అంగీకరించరు. వాళ్లు డేట్స్ ఇస్తే కచ్చితంగా తీస్తా’’ అని తెలిపారు.
-
“అతడు”లో హీరో క్యారెక్టర్ నెగటివ్‌గా ఉందన్నా: మురళీ మోహన్
నిర్మాత మురళీ మోహన్ ‘అతడు’ సినిమాపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘త్రివిక్రమ్ అతడు మూవీ కథను 3 గంటలు నాన్‌స్టాప్‌గా ప్రతీది డీటెయిల్‌గా చెప్పారు. కథ విన్నాక హీరో క్యారెక్టర్ కాస్త నెగటివ్‌గా ఉందని ప్రశ్నించా. కానీ త్రివిక్రమ్ కన్విన్స్ చేశాక మూవీపై ముందుకెల్లాం’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ మూవీ ఆగస్టు 9న మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
-
‘కింగ్‌డమ్’ సెన్సార్ పూర్తి!
విజయ్ దేవరకొండ నటిస్తున్ ‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31న విడుదలకానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.