నటి శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ‘‘ నా గొంతు కాస్త బొంగురుగా, విభిన్నంగా ఉంటుంది. దాంతో కోలీవుడ్‌లో నా వాయిస్‌పై చాలా ట్రోలింగ్ జరిగింది. అయితే, దర్శకుడు నాగ్‌అశ్విన్ ఒక ఎపిసోడ్ కోసం మొదటిసారి నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత నేను ‘‘సలార్’ మూవీకి డబ్బింగ్ చెప్పాను” అని వెల్లడించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలని ఉంది: విజయ్ దేవరకొండ
నటుడు విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ‘‘ గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. గర్ల్‌ఫ్రెండ్‌కు సమయాన్ని కేటాయించలేదు. కానీ ఇప్పుడు పద్ధతి మార్చుకున్నాను. నా వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా విజయ్ చెప్పిన గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటూ మరోసారి చర్చ మొదలైంది.
-
ఆ హీరోయిన్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన సినిమాల్లో తొలి సినిమా ‘ఏ’. అయితే ఈ సినిమాకు సెన్సార్ సమస్య రావడంతో రివిజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సరోజా దేవి సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. ఆమె కారణంగానే మా సినిమాకు సెన్సార్ పూర్తయింది. ‘మీరే లేకపోతేను నేను హీరో అయ్యేవాడ్ని కాదు’ అని ఆమెకు చెప్పేవాడిని అని ఉపేంద్ర తెలిపారు.
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి నిరోషా
AP: తిరుమల శ్రీవారిని సీనియర్ నటి నిరోషా దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. నటి నిరోషా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగులో సింధూర పువ్వు, నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
-
సమరసింహా రెడ్డి మూవీలో బాలయ్య అలా చేశాడు: పృథ్వీ
నటుడు పృథ్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సమరసింహా రెడ్డి’ సినిమాలోని ఓ సన్నివేశంలో బాలకృష్ణ తనను 500 మీటర్లు మోసుకెళ్లారు. అప్పుడు నా బరువు దాదాపు 100 కేజీలు ఉంటుంది. అంత బరువున్న నన్ను ఎలా మోశారని నేను బాలయ్యను అడిగాను. దానికి ఆయన.. ‘నేను కాదు, సమరసింహా రెడ్డి మోశాడు’ అని చెప్పినట్లు తెలిపారు.
-
పవన్ కల్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు: క్రిష్
పవన్ కల్యాణ్ న్యూమూవీ ‘హరి హర వీరమల్లు’ సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమా మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జ్యోతికృష్ణ దీన్ని పూర్తిచేశారు. దీంతో పవన్‌తో క్రిష్‌కు విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై క్రిష్ స్పందించారు. ‘నాకు, పవన్‌కు విభేదాలు లేవు. భవిష్యత్తులోఆయనతో కలిసి సినిమా చేసేందుకు కూడా సిద్ధమే’అని క్రిష్ తెలిపారు.
-
రష్మికతో డీల్.. స్నాప్‌చాట్ ప్రత్యేక బహుమతులు
ప్రపంచవ్యాప్తంగా తొలిసారి స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ప్రత్యేక బహుమతి ప్రకటించింది. ఈమేరకు హీరోయిన్ రష్మిక మందన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈఏడాది వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా, స్నాప్‌చాట్ యూజర్లకు ప్రత్యేకమైన స్ట్రీక్ రిస్టోర్‌ను బహుమతిగా ఇవ్వనుంది. జూలై 30నుంచి ఆగస్టు 3వరకు ఇండియన్స్‌కు ఉచితంగా ఐదు ప్రత్యేక స్ట్రీక్‌లను పొందేందుకు అవకాశం కల్పించింది.
-
‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
యోధుడిగా ‘మిరాయ్’ అంటూ తేజ సజ్జా తెరపై సందడి చేయనున్నారు. రితికా నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. సెప్టెంబరు 5న 2డీ, 3డీ ఫార్మేట్లలో, మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇందులోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు.
-
బేబీ బంప్‌తో లావణ్య త్రిపాఠి
హీరో వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా లావణ్య బేబీ బంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె, వరుణ్ వెకేషన్ నుంచి నిన్న తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లావణ్య బేబీబంప్‌తో కనిపించారు. కాగా వరుణ్‌తేజ్, లావణ్య 2023లో వివాహంతో ఒక్కటయ్యారు.