పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెకన్లు సాధిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అమెరికాలో భారీ వసూళ్లను సాధిస్తూ తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ నిలిచింది.