ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘డ్యూడ్’. ఇందులో మమిత బైజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘డ్యూడ్’ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గెస్ట్ రోల్ చేయనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సివుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఎమోషనల్‌గా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ట్రైలర్!
నటుడు నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. బియా ఖాటూన్ హీరోయిన్. విపిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆగష్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. లవ్ కమ్ మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుదని తెలుస్తోంది.
-
నన్ను కూడా చంపాలనుకుంటున్నారు: తనుశ్రీ దత్తా
బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ రాజ్‌పుత్‌లాగే తననూ చంపాలని చూస్తున్నారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానంటూ ఆమె విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
-
సందీప్‌రెడ్డి వంగాతో ‘కింగ్డమ్ బాయ్స్’ స్పెషల్ చిట్‌చాట్
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘కింగ్డమ్ బాయ్స్’ పాడ్ క్యాస్ట్ పేరుతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కలిసి విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
-
నవ్వులు పంచే ‘సుందరకాండ’ రిలీజ్ డేట్ వీడియో
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సుందరకాండ’. వ్రితి వాఘని హీరోయిన్. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్‌ను శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 27న విడుదల కానుందని తెలియజేస్తూ పంచుకున్న వీడియో నవ్వులు పూయిస్తోంది. రిలీజ్ డేట్‌పై రోహిత్, నరేశ్, అభినవ్ గోమఠం ముచ్చటించారు.
-
‘కింగ్డమ్’.. డబ్బింగ్ పూర్తి చేసిన భాగ్యశ్రీ!
విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్డమ్’. జూలై 31న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి నటి భాగ్యశ్రీ భోర్సే డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ఆమె డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
-
నా కొడుకైనా ఇలాగే చేస్తా: విజయ్ దేవరకొండ
సినిమాల విషయంలో తన తమ్ముడు ఆనంద్‌కు సలహాలు, సూచనలు ఇవ్వనని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫలానా సినిమా చేస్తున్నానని ఆనంద్ నాకు చెబుతాడు. అంతవరకే గానీ.. కథేంటి? దర్శకుడెవరు? అని నేను అడగను. ఎందుకంటే అతడు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నా కొడుకైనా ఇలాగే ట్రీట్ చేస్తా’’ అని విజయ్ పేర్కొన్నారు.
-
మారేడుమిల్లి అడవుల్లో బాలయ్య తాండవం!
బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2:తాండవం’. ఇందులో సంయుక్తా మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. వారం రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.