Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • 50 స్క్రిప్ట్‌లు తిరస్కరించిన రోషన్.. ఎందుకంటే?

    శ్రీకాంత్‌ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నటుడు రోషన్‌. అయితే,  రోషన్‌  నటించిన ‘పెళ్లి సందD’ చిత్రం రిలీజై నాలుగేళ్లు అయినా.. కొత్త సినిమా చేయలేదు. దీనికి కారణం..  స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో రోషన్ తండ్రి శ్రీకాంత్ చాలా జాగ్రత్తగా ఉండటమే. ఇప్పటివరకు  రోషన్.. దాదాపు 50 స్క్రిప్ట్‌లను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

  • ‘‘జూనియర్‌’’ టైటిల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

    వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘జూనియర్‌’.. జులై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా జెనీలియా, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు.

  • ULLU తదితర OTTలపై నిషేధం

    ULLU, ఆల్ట్‌ బాలాజీ తదితర OTT యాప్‌లు, వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నందుకు గాను ఈమేరకు చర్యలు తీసుకుంది. మొత్తంగా 25 వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించింది.

     

  • ‘సైయారా’ హిట్‌.. సందీప్ వంగాకు థ్యాంక్స్‌ చెప్పిన దర్శకుడు

    ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి ఆదరణను సొంతం చేసుకుంది ‘సైయారా’.  ఈ చిత్రం విజయం సాధించడంపై సందీప్‌ వంగాకు దర్శకుడు మోహిత్‌ సూరి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సైయారా’ను నమ్మిన మొదటి వ్యక్తి సందీప్‌ వంగా. బహిరంగంగా దీనికి మద్దతు ఇచ్చి పోస్ట్ పెట్టింది ఆయనే’’ అని సందీప్‌ వంగాకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, జులై 18న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకూ దాదాపు రూ.15 కోట్లు వసూలు చేసింది.

     

     

     

  • కమల్‌హాసన్‌ అనే నేను..

    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ఆయన ప్రమాణం చేశారు. కమల్‌తో పాటు తమిళనాడు నుండి పి.విల్సన్, సల్మా, ఎస్.ఆర్ శివలింగంతో పాటు మరికొంత మంది ప్రమాణస్వీకారం చేశారు.

  • అప్పుడు అరవింద సమేతలో.. ఇప్పుడు వార్-2లో

    హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ‘వార్-2’చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఎన్టీఆర్ ఒక చోట షర్ట్ లేకుండా కనిపించాడు. దీంతో ‘అరవింద సమేత’ మూవీలో ఇంట్రో ఫైట్‌లో షర్ట్ లేకుండా కనిపించిన ఎన్టీఆర్ .. ఇప్పుడు వార్-2లో కనిపించారు. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

  • ‘వార్‌ 2’ ట్రైలర్‌ వచ్చేసింది!

    ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని చూస్తోన్న ‘వార్‌ 2’ ట్రైలర్‌ వచ్చేసింది. ఎన్టీఆర్‌, హృతిక్‌లు పోటాపోటీగా తలపడుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ‘ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను.. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను’ అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

     

  • వివాదంలో ‘హరిహర వీర మల్లు’

    AP: పవన్ కల్యాణ్ న్యూ మూవీ ‘హరిహర వీరమల్లు’ వివాదంలో చిక్కుకుంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఈ చిత్రాన్ని తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. 1355లో మరణించిన వీరమల్లు.. 1591లో నిర్మించిన చార్మినార్ వద్ద ఎలా యుద్ధం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని రామకృష్ణ కోరారు.

     

  • రిటైర్మెంట్‌ తర్వాత.. క్యాబ్‌ డ్రైవర్‌ అవుతా: ఫహాద్‌ ఫాజిల్‌

    ‘మారీశన్‌’మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫహాద్‌ ఫాజిల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత తాను బార్సిలోనా వెళ్లి అక్కడ క్యాబ్ డ్రైవర్ అవుతానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అభిమానులలో చర్చనీయాంశంగా మారాయి. సినిమారంగం నుండి తప్పుకున్నాక కూడా ఫహాద్‌ ఫాజిల్ తన ప్రత్యేకతను చాటుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు.

  • శామ్‌ ఆల్ట్‌మన్‌ను కలిసిన ఏఆర్‌ రెహమాన్

    ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్  కలిశారు. ఓ ఏఐ ప్రాజెక్టు గురించి శామ్‌‌తో చర్చించినట్లు రెహమాన్ వెల్లడించారు.