Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఓటీటీలోకి ‘మార్గన్’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

    విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ‘మార్గన్’ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే తమిళ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులోకి వచ్చింది.

  • ‘‘వార్ 2’’.. రిలీజ్‌కు ముందే రికార్డు!

    హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘‘వార్ 2’’ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం దేశంలోని అన్ని థియేటర్లలో డాల్బీ అట్మాస్ స్క్రీనింగ్‌తో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమాగా నిలవనుంది. ప్రేక్షకులకు మంచి ఆడియో అనుభవాన్ని అందించే లక్ష్యంతో వార్ 2 డాల్బీ అట్మాస్ ఫార్మాట్‌లో విడుదలవుతోంది.

  • ప్రీమియర్ కలెక్షన్లపై ప‌వ‌న్‌ క్లారిటీ!

    ‘‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’’ స‌క్సెస్ మీట్‌లో ప్రీమియ‌ర్ క‌లెక్ష‌న్ల‌పై పవన్ కళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మూవీ ప్రీమియర్ షోల ద్వారానే రూ. 30 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే తనకు అంకెలు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా పట్ల తనకున్న వైముఖ్యాన్ని కూడా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించడం తనకు ఇష్టం ఉండదని వెల్లడించారు.

  • ‘‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’’ తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం ‘‘హరి హర వీరమల్లు’’. ఈ మూవీ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే భారీ అంచనాలతో విడుదలైన హరి హర వీరమల్లుకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది.

  • నాగార్జునకు పెద్ద అభిమానిని: లోకేశ్ కనగరాజ్

    హీరో నాగార్జునపై ద‌ర్శ‌కుడు లోకేశ్ కనగరాజ్ ప్రశంసలు కురిపించారు. కూలీ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘నాగార్జునకు కాలేజ్ డేస్ నుంచి పెద్ద ఫ్యాన్‌ని. రాక్షసుడు సినిమా చూశాక నాగార్జున హెయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యేవాడిని. ‘శివ’ కూడా నాకు చాలా ఇష్టం’’ అని తెలిపారు. కూలీ సినిమాలో రజినీకాంత్‌ను ఒప్పించడం కంటే నాగార్జునను ఒప్పించడం తనకు కష్టమైందని లోకేష్ వివరించారు.

  • ప‌వ‌న్‌తో ఫొటో.. సంబ‌ర‌ప‌డిపోయిన న‌టి (వీడియో)

    ‘హరి హర వీరమల్లు’ సక్సెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హీరో పవన్ కళ్యాణ్ నటి నివిత నటనను ప్రశంసించారు. దీనితో నివిత ప‌వ‌న్‌తో ఫోటో దిగాలని కోరగా, పవన్ ఆమెను వెంటనే స్టేజీపైకి ఆహ్వానించారు. పవన్‌తో ఫోటో దిగిన నివిత ఆనందంతో అక్కడే తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

     

     

  • వీడియో.. అల్లు అర్జున్ కొత్త లుక్ చూశారా?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో AA22xA6 మూవీ షూటింగ్‌లో బిజీ ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో జ‌ర‌గుతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా అల్లు అర్జున్ ముంబై ఎయిర్‌పోర్టులో కొత్త లుక్‌లో క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

     

     

  • నేడు ‘‘వార్ 2’’ ట్రైల‌ర్‌!

    స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన మూవీ ‘‘వార్ 2’’. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌ను నేడు (శుక్రవారం) చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100కి పైగా థియేటర్లలో నేడు ఉదయం 10:08 గంటలకు ఈ ట్రైలర్ విడుదల కానుంది.

  • నా సినిమా అంత భయపెట్టిందా?

    ‘హరిహర వీరమల్లు’ చిత్ర బృందం సక్సెస్ మీట్‌లో హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘‘ఈ సినిమా క్లైమాక్స్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.‘ హరిహర వీరమల్లు’ పార్ట్ -2 త్వరగా పూర్తికావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే దాదాపు 30 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. ‘హరిహర వీరమల్లు’ను బాయ్ కాట్ చేద్దామని బెదిరించారు. నా సినిమా మిమ్మల్ని అంత భయపెట్టిందా?’’ అని ప్రశ్నించారు.

     

  • ‘పవనిజం’ అంటూ.. పవర్‌స్టార్‌పై నిధి ప్రశంసలు!

    హీరో పవన్‌ కల్యాణ్‌-నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘హరిహర వీరమల్లు’ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకాదరణ దక్కుతోన్న నేపథ్యంలో మేకర్స్ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ..‘‘సినిమాపై ఎంతో పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. దీనంతటికీ కారణం ఒక్కటే అది పవనిజం’’ అని చెప్పుకొచ్చింది.