Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సక్సెస్‌ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ‘వీరమల్లు’ డైరెక్టర్!

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ గురువారం విడుదలైన హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకాదరణ దక్కుతోన్న నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ మూవీ విషయంలో తన భార్య ఎంతో సపోర్ట్ చేసిందిని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • మరో రూ.60 కోట్లు వచ్చేవి.. ‘కుబేర’పై పరుచూరి రివ్యూ

    ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాకృష్ణ ఇటీవల విడుదలైన ‘కుబేర’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పరుచూరి పాఠాలు’ పేరిట సినిమాలపై చర్చిస్తుంటారనే సంగతి తెలిసిందే. దర్శకుడు శేఖర్‌ కమ్ముల మంచి కథ అందించారని ప్రశంసించిన ఆయన.. ‘కుబేర’ను ట్రిమ్‌ చేసి ఉంటే ఇంకా మరిన్ని కలెక్షన్స్‌ చేసేదన్నారు. ఈ వీడియోలో ‘కుబేర’పై పరుచూరి రివ్యూ చూడండి.

  • ‘పంచాయితీలు చేసి సినిమా రిలీజ్‌ చేయాల్సి వచ్చింది’

    హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హరిహర వీరమల్లు’ సక్సెస్‌ మీట్‌లో హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తన జీవితంలో తొలి సారి సక్సెస్‌ మీట్‌కు హాజరయ్యానన్నారు. ‘‘డిప్యూటీ సీఎంను కదా సినిమా సులువుగా రిలీజ్‌ అవుద్ది అనుకున్నా. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా నేను పంచాయితీలు చేసి సినిమా రిలీజ్‌ చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు.

  • ‘హరిహర వీరమల్లు’.. ‘పరదా’లో థియేటర్‌కు ఫ్యాన్స్!

    ‘హరిహర వీరమల్లు’ సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో కనిపించారు. ఆ మహిళా అభిమానులు తమ ముఖంపై శారీని పరదాలాగా కప్పుకుని సందడి చేశారు. అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ మూవీ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

  • విజ‌య్ ‘కింగ్డమ్’ ప్రమోషన్స్‌లో స్టార్ డైరెక్టర్

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. జూలై 31న ఈ సినిమా విడుదలకాబోతుండ‌గా.. మేకర్స్ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించాడు. ఈ వీడియో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా.. విజ‌య్ దేవ‌ర‌కొండ, సందీప్ వంగా, ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి క‌లిసి ఉన్న ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

  • పెళ్లిపై మనసులో మాట చెప్పిన స్టార్ హీరోయిన్!

    హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనే విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాదు తల్లి కావడం తనకు ఎప్పటినుంచో ఉన్న కల అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు పెళ్లి ప్లాన్ లేదని.. ప్రస్తుతానికి ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే పెట్టానని స్పష్టం చేసింది.

  • హాట్ లుక్‌లో హీట్ పెంచుతున్న ప్రగ్యా!

    టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మరోసారి హాట్ లుక్‌తో మెస్మరైజ్ చేసింది. వైట్ అండ్ గ్రీన్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.

  • నేను వాట్సాప్‌ వాడను: నటుడు ఫహాద్‌

    మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘ఏడాది నుంచి సాధారణ మొబైల్‌ వాడుతున్నా. వాట్సాప్‌ లేదు. సినిమా స్టోరీలకు సంబంధించి ఈ మెయిల్‌తోనే కాంటాక్ట్‌ అవుతుంటా. ఒకప్పుడు సోషల్‌ మీడియా వినియోగించేవాడిని. అది కూడా కెరీర్‌ అప్‌డేట్‌ కోసమే’’ అని ఫహాద్‌ తెలిపారు.

  • నా పేరెంట్స్‌ ఎక్కువ గర్వపడిందప్పుడే: రష్మిక

    తన విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా గర్వపడిన సందర్భాన్ని హీరోయిన్ రష్మిక గుర్తుచేసుకుంది. బెంగళూరు విమానాశ్రయంలో తన తండ్రితో కలిసి దిగిన ఫొటో గురించి చెబుతూ.. ‘‘నేను ‘ఫ్రెష్‌ ఫేస్’ టైటిల్‌ గెలిచినప్పుడు (2014).. కానుకగా కొన్న గొలుసును ఎయిర్‌పోర్టులోనే నాన్న నా మెడలో వేశారు. ఈ మరుపురాని క్షణాలను అమ్మ కెమెరాలో బంధించింది. నా విషయంలో పేరెంట్స్‌ అప్పుడే ఎక్కువగా గర్వపడ్డారని అనుకుంటున్నా’’ అని పేర్కొంది.

  • ‘కిష్కింధపురి’ రిలీజ్ అప్పుడే!

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్-అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ధమైనట్లు నెట్టింట వైరల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి.