Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘హరిహర వీరమల్లు చూస్తే 10 మార్కులు వచ్చినట్లే’

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ చూసిన ఓ అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులందరూ ఈ సినిమా చూడాలి. ఇందులో తెలుగు హిస్టరీ చాలా దాగి ఉంది. ఈ సినిమా చూస్తే 10 మార్కులు సంపాదించినట్లే’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

  • పవన్ హవా.. ‘హరిహర వీరమల్లు’‌కు భారీ వసూళ్లు

    నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ విడుదలైంది. ఈ మూవీ ప్రీమియర్లు నిన్ననే పడ్డాయి. ఈ షోలకు కలెక్షన్ల వర్షం కురిసినట్లు సమాచారం. ప్రీమియర్స్ ద్వారానే ఈ మూవీ దాదాపు రూ.11 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.4 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయట. అలాగే మొదటి రోజు ఈ సినిమా రూ.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

  • కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ‘పెద్ది’

    బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఆయనకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘‘బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రజాసేవలో మరెన్నో గొప్ప సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమాలో బిజీగా ఉన్నాడు.

  • ‘వార్‌-2’లో ఎందుకు నటించలేదంటే: వాణీ కపూర్‌

    హృతిక్‌ రోషన్‌-ఎన్టీఆర్‌ కలిసి నటించిన ‘వార్‌-2’ ఆగస్టు 14న విడుదలకానుంది. ఈ చిత్రం 2019లో విడుదలైన ‘వార్‌’కు సీక్వెల్‌. ఆ సినిమాలో హృతిక్‌, టైగర్‌ష్రాఫ్‌, వాణీకపూర్‌ నటించారు. అయితే ‘వార్‌-2’లో టైగర్‌ ష్రాఫ్‌, వాణీకపూర్‌ భాగం కాలేదు. ఇందులో తాను లేకపోవడంపై వాణీకపూర్‌ తాజాగా స్పందించింది. ‘‘టైగర్‌, నేను ‘వార్‌’లో చనిపోయాం. ఒక వేళ టైగర్‌ తిరిగి వస్తే, నేనూ వస్తాను’’ అని చెప్పింది.

  • కాస్టింగ్‌ కౌచ్‌.. చెండాలంగా మాట్లాడేవారు: హీరోయిన్

    బాలీవుడ్ హీరోయిన్ సుర్వీన్‌ చావ్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడింది. ‘‘ఒకానొక సమయంలో కాస్టింగ్‌ కౌచ్‌ చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేయాలన్నా మాకేంటి? అని చెండాలంగా మాట్లాడేవారు. అసలు ఇవన్నీ నాకు అవసరమా? అని తిట్టుకునేదాన్ని. యాక్టింగ్‌ మానేయాలన్నంత కోపం వచ్చేది. వాళ్లు అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు చేజారాయి’’ అని చెప్పుకొచ్చింది.

  • స్టార్ హీరో మూవీ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!

    అజయ్ దేవగన్-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్-2’. విజయ్ కుమార్ అరోరా తెరకెక్కిస్తున్న ఈ మూవీ జులై 25న రిలీజ్ కానుండగా.. కొన్ని అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేశారు. అయితే అజయ్ దేవగన్ తాజాగా దీని కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. ‘సన్నాఫ్ సర్దార్-2’ ఆగస్టు 1న రిలీజ్‌కు సిద్ధమైనట్లు పోస్టర్ పోస్ట్ చేశాడు.

  • ‘హరిహర వీరమల్లు’ నుంచి పవర్‌ఫుల్ సాంగ్ రిలీజ్

    పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిన్న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ మూవీలోని ‘సలసల మరిగే రక్తమే’ అనే పవర్‌ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

  • టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2025కు ‘బయాన్‌’

    బికాస్‌ రంజన్‌ మిశ్రా దర్శకత్వంలో హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన ‘బయాన్‌’ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ (TIFF) 2025కు ఎంపికైంది. ఈనేపథ్యంలో నటి హ్యుమా ఆనందం వ్యక్తంచేశారు. ‘‘నాకు ఎంతో ఇష్టమైన క్యారెక్టర్‌ను పోషించే అవకాశాన్ని బయాన్‌ ఇచ్చింది. డిస్కవరీ విభాగంలో బయాన్‌ TIFFకు ఎంపికవడం నాలో ఉత్సాహాన్ని నింపింది’’ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.

     

  • థియేటర్ డైరెక్టర్ రాజిందర్ నాథ్ కన్నుమూత

    ప్రముఖ నాటక కళాకారుడు, శ్రీరామ్ సెంటర్ తొలి డైరెక్టర్ రాజిందర్ నాథ్(91) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం వృద్ధాప్య సంబంధిత కారణాలతో తన నివాసంలో మరణించారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పది రోజులుగా ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతి చెందారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

  • రేపే ‘వార్-2’ ట్రైలర్

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘వార్-2’ ఆగస్టు 14న రిలీజ్‌కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇక ఈమూవీ ట్రైలర్ రేపు విడుదల కానుందంటూ మేకర్స్ పోస్టర్ వదిలారు.