పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ రోజు వీడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కాగా, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్టీమింగ్ కానుంది. అయితే, ఏ డేట్ అనేది ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమా 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. దీని ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘విజయ్ దేవరకొండ’కు మరోసారి ఈడీ నోటీసులు
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీవిచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నటుడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11న హాజరుకావాలని సూచించింది.
-
ఇంతకు ముందెప్పుడూ చూడనివిధంగా మహేశ్-రాజమౌళి మూవీ
మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం #SSMB29(వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘సర్జమీన్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా #SSMB29 గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘ఇప్పటివరకూ ఎవరూ ఊహించనిరీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు’’ అని పృథ్వీరాజ్ అన్నారు.
-
జయం రవి పిటిషన్ కొట్టివేత
నటుడు రవిమోహన్ (జయం రవి) తన సంస్థకు రెండుచిత్రాలు చేయడానికి అగ్రిమెంట్ చేయగా, ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు, బాబీ టచ్ గోల్ల్ యూనివర్సల్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రవిమోహన్ కూడా ఆసంస్థే తనకు నష్ట పరిహారంగా రూ.9 కోట్లు చెల్లించాలని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు రవిమోహన్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.
-
ధర్మ యుద్ధం మొదలైంది: పవన్ కళ్యాణ్
‘హరి హర వీరమల్లు’ రిలీజైన సందర్భంగా ధర్మ యుద్ధం మొదలైందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ విధించిన జిజియా పన్ను హిందువుల అణచివేతకు నిదర్శనం. ముఖ్యంగా మొగలుల క్రూరత్వాన్ని చరిత్రకారులు కప్పిపుచ్చారు. ఈ అన్యాయాన్ని హరిహర వీరమల్లు బయటపెట్టింది. హిందువుల వేదన, భారత సంపద దోపిడీని సినిమా కళ్లకు కట్టింది. దౌర్జన్యాన్ని ఎదిరించిన యోధుల పరాక్రమం, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటింది’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
-
సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు
సినీ నటుడు రాజీవ్ కనకాలకు హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసులు నోటీసులు జారీచేశారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో తన ప్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి గతంలో విక్రయించారు. అదే ప్లాటును అతను మరోవ్యక్తికి విక్రయించాడు. అయితే, లేని ప్లాటును ఉన్నట్లు చూపి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
-
ధనుష్ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..?
కోలీవుడ్ హీరో ధనుశ్ ఈ నెల 27 నుంచి ప్రతివారం 500 మంది అభిమానులను కలవనున్నారు. అయితే, ఇలా అభిమానులను కలవాలన్న ధనుశ్ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. గతంలో విజయ్, కమల్ హాసన్ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి వారితో మరింత దగ్గరయ్యాకనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
-
HHVM మూవీ చూసి.. ‘కోట‘ను గుర్తు చేసుకుంటన్నారు.
పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు(HHVM)’ చిత్రం ఈ రోజ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసినవారంతా చాలా బాగుందని చెబుతున్నారు. అయితే, ఈ మూవీలో దివంగత నటుడు కోట శ్రీనివాసరావు చిన్న పాత్రలో మెరుస్తారు. ‘కోట’ సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్లు..‘ జోహార్ కోట శ్రీనివాసరావు’ అని నినాదాలు చేస్తున్నారు.
-
అతడిని క్షమించకూడదు.. రిసెప్షనిస్ట్‌పై దాడిపై జాన్వీకపూర్ పోస్ట్
మహారాష్ట్ర థానే జిల్లాలో ఓ ఆసుపత్రిలోని రిసెప్షనిస్ట్‌పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ నటి జాన్వీకపూర్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిని ఎప్పటికీ క్షమించకూడదని, అతడిని జైలుకు పంపించాలని అన్నారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
-
హీరో ముందే వైరల్ వయ్యారి పాటకి అదరగొట్టిన చిన్నారి(VIDEO)
కిరీటి, శ్రీలల జంటగా నటించిన మూవీ ‘జూనియర్’. ఈ మూవీలోని ‘వైరల్ వయ్యారి నేనే’ అనే పాటకు ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ సోషల్‌మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి ఈ పాటకు హీరో కిరిటి ముందు అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీంతో ఆయన.. చిన్నారిని మెచ్చుకొని.. ఓ చిన్న కానుక కూడా అందించారు.